కోబ్రా పోస్ట్ కథనం పై అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషద్ - ఈసీ కి ఫిర్యాదు
క్రొత్త డిల్లి , 04/04/2014 : అయోధ్య శ్రీ రామ జన్మ భూమి ఉద్యమ నేపథ్యాన్ని, డిసెంబర్ 6, 1992 కరసేవ గురించి కోబ్రా పోస్ట్ ప్రచురించిన కథనం పై విశ్వ హిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది, ఈ అంశం పై పరిషద్ అంతర్జాతీయ మహా మంత్రి ( ప్రధాన కార్యదర్శి ) మాన్య శ్రీ చంపత్ రాయ్ గారు కోబ్రా పోస్ట్ కథనాన్ని దుష్ప్రచారంగా, ఎన్నికను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమంగా పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ గారికి ఫిర్యాదు చేసారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ' హిందూ ధర్మం పై ఉద్దేశపూర్వకంగా ఎన్నికలలో ఒక వర్గం పై బలమైన ప్రభావాన్ని చూపే విధంగా కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ అంటూ కథనం ప్రసారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఈ దేశంలో హిందువుల పై ఎంత తీవ్రమైన నిరాధారా ఆరోపణలు చేయడం ద్వారా తాము ఆర్థికంగా, సామాజికంగా లాభపడాలని కోబ్రా పోస్ట్ యాజమాన్యం ఆలోచనగా కనిపిస్తుంది, దేశంలోని రాజకీయ పార్టిలు మరియు విశ్వ హిందూ పరిషద్ చాలా కాలంగా ఈ అంశాల పట్ల మౌనం వహిస్తూ ఉంది, కాని ఎన్నికలకు కొన్ని రోజులు ముందుగానే ఈ కథనం ప్రచురితం కావడం అనుమానాలకు తాపు ఇస్తుంది, దాదాపు 18 సంవత్సరాలుగా కేంద్ర విచారణ సంస్థ సిబిఐ విచారణ ఒక కొలిక్కి వస్తున్న సమయంలో ఇలాంటి కథనం ఆ సంస్థ పై ప్రశ్న చిహ్నాలు పెట్టేలా ఉంది' అని అన్నారు.
మూలం : విశ్వ సంవాద కేంద్రం - భారత్
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here
కోబ్రా పోస్ట్ కథనం పై అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషద్ - ఈసీ కి ఫిర్యాదు
Reviewed by JAGARANA
on
9:22 AM
Rating:
No comments: