కర్ణాటక: టిప్పుజయంతిని నిరసన ర్యాలి పై ముష్కరాల దాడి-VHP నేత DS కుటప్పా దారుణ హత్య
వేలాది మంది కాశ్మీర్ పండిట్ లు తమ సర్వస్వాన్ని వదిలి తమ దేశంలోనే శరణార్థులు అయినప్పుడు, గోద్రా లో 69 రామ(కర)సేవకులు సజీవ దహనం చేయబడినప్పుడు, తన సోదరి చాతి పై చేసిన వేసిన ముష్కరుడిని అడ్డుకున్న యువకుడు ముక్కలు ముక్కలుగా నరికివేయబడినప్పుడు దేశంలో రగలని మత అసహనం దాద్రి ఘటనతో రగిలింది, మరి తాజా టిప్పు జయంతి ఘటనలో ఒక హిందువు రాళ్ళతో క్రూరంగా మొదబడి దారుణ హత్యకు గురైనప్పుడు రగులుతుందా మత అసహనం? మేధావులారా సమాధానం చెప్పండి? ఈ ఘటన పై మీ అవార్డులు తిరిగి ఇస్తున్నారా ? - రాష్ట్ర చేతన
కోడగు,కర్ణాటక, 11/11/2015 : కర్ణాటక ప్రభుత్వం హిందువుల పవిత్ర పండుగ "దీపావళి" రోజున నిర్వహించతలపెట్టిన #టిప్పుజయంతిని వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న హిందూ సంస్థల పై ఆయుదాలు తో ఉన్న ముష్కర మూక దాడి చేసి విధ్వసం సృష్టించింది, ఆ దాడిలో కోడగు జిల్లా విశ్వ హిందూ పరిషద్ సంఘటన కార్యదర్శి శ్రీ DS కుటప్పా దారుణంగా రాళ్ళతో మోది హత్యచేయబడ్డారు.
వివారాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 వ తేదిన టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పరిపాలన కాలంలో వేల మంది హిందువులను క్షోభ పెట్టిన ముష్కరుడు, లక్షల మందిని మతం మార్చిన హిందూ ద్రోహి, మైసూరు మహారాజును దారుణంగా హింసించిన దేశ ద్రోహి #టిప్పుజయంతిని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ బద్దంగా తమ నిరసనను తెలియజేయడానికి సంఘ్ పరివార్ సంస్థలు విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్, హిందూ జాగరణ వేదిక తదితర సంస్థలు ర్యాలి నిర్వహించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానిక VHP నేత మదికేరి ఘటనను వివరిస్తూ " దాదాపు 100 మంది VHP కార్యకర్తలం స్థానిక తిమ్మయ్యా సర్కిల్ లో శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం, ర్యాలి సర్కిల్ లో కి చేరగానే మూడు వైపులనుండి కేరళ నెంబర్ ప్లేట్ తో గల వాహనాలలో అనేక మంది చేరుకోవడం గమనించాం, స్థానిక పోలీసులను ఈ విషయంలో వాహనాలను అనుమతి ఇవ్వొద్దని వినతిచేయడం జరిగింది, అయిన ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, వెంటనే పెద్ద ఎత్తున రాళ్ళతో దాడి చేయడం జరిగింది, ఈ దాడిలో శ్రీ DS కుటప్పా గారు దారుణంగా గాయపడి ఆసుపత్రిలో మరణించడం జరిగింది, ఈ దాడిలో స్థానికంగా అక్రమంగా నివసిస్తున్నా బంగ్లాదేశీ వారు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి, SDPI మరియు PFI లు ఈ దాడి వెనకాల ఉండి నడిపించినట్లు అనిపిస్తుంది " అని అన్నారు.
Source : http://samvada.org/2015/news/vhp-leader-ds-kuttappa-hacked-to-death/
Source : http://samvada.org/2015/news/vhp-leader-ds-kuttappa-hacked-to-death/
కర్ణాటక: టిప్పుజయంతిని నిరసన ర్యాలి పై ముష్కరాల దాడి-VHP నేత DS కుటప్పా దారుణ హత్య
Reviewed by JAGARANA
on
9:08 AM
Rating:
No comments: