బాధ్యత లేదా?
బీహార్లో మహాకూటమి గెలిస్తే పాకిస్తాన్లో టపాసులు పేలుతాయి అని అమిత్ షా అంటే విమర్శించేరు. కానీ ఆయన చెప్పిందే పాకిస్తాన్ నిజం చేసి చూపింది.
మరి పాకిస్తాన్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఎవరైనా గెలిచినా, ఓడినా మన దేశం లో టపాసులు కాల్చిన సందర్బాలు ఉన్నాయా? మరి ఇక్కడ మహాకూటమి గెలిస్తే వాళ్ళకంత సంబరం ఎందుకు?
పాకిస్తాన్ సంగతి సరే. మరి ఇక్కడి మహాకూటమికి బాధ్యత లేదా? ఎన్.డి.ఏ., మహాకూటమిలు భారత్ లోని రాజకీయ పార్టీలు. ఒక వేళ రేపు మహాకుటమి కేంద్రంలో అధికారం లోకి వస్తే పాకిస్తాన్ లో ఉన్న డాన్ దావూద్ ని ఇండియాకి అప్ప చెపుతారా? ఆ మాట ఆ కూటమి ఇవ్వగలదా?
సరిహద్దులలో పాక్ తన కవ్వింపు చర్యలకు స్వస్తి చెప్పగలదా?
మనదేశంలోకి ఉగ్రవాదుల చొరబాటును పాక్ నిరోధించగలదా?
ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.
మరి మహాకూటమి గెలుపుకు పాక్ సంబరాలు చేస్తూంటే దానిని ఖండించాల్సిన బాధ్యత మహాకుటమి నాయకులకు లేదా?
భారతదేశం లో జరిగే ఎన్నికలు తమ అంతర్గత విషయం అనీ, తమ గెలుపు ఓటములను శత్రు దేశం పండగ చేసుకోవడమేమిటనీ పాక్ల ని ఎదురు ప్రశ్నించాల్సిన కనీస బాధ్యత మహాకూటమికి లేదా?
ఒకవేళ లేదు అని మహాకుటమి బావిస్తే దానికన్నా చారిత్రిక తప్పిదం మరొకటి ఉండదు.
బాధ్యత లేదా?
Reviewed by rajakishor
on
3:14 PM
Rating:
No comments: