వీళ్ళా మనకి పాఠాలు చెప్పేది?
భారతదేశంలో మత అసహిష్ణుత పెరిగిపోతోందనీ, ప్రధాని మోదీ దానిని అదుపు చెయ్యకపోతే ప్రపంచ దేశాలకు మోదీ పట్ల, భారతదేశం పట్ల ఉన్న విశ్వాసం పోతుందనీ "మూడీస్ అనలిటిక్స్" అన్న సంస్థ హితబోధలు చేసింది.
గతంలో భారత ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపాయ్ గారు పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపితే అగ్రరాజ్యాలన్నీ ఒక్కసారిగా విరుచుకుపడి భారత్ పై లెక్కలేనన్ని ఆంక్షలు విధించేయి. వాటిని అటల్జీ ఆవగింజంత కూడా లెక్కచేయలేదు. అమెరికా అధ్యక్షుడు ఒకసారి రమ్మని ఆహ్వానిస్తే అటల్జీ వెళ్ళలేదు. తాను తీసుకున్న నిర్ణయం పట్ల అటల్జీ దృఢంగా నిలబడ్డారు. దెబ్బకి అగ్ర రాజ్యాలుగా విర్రవీగిన దేశాలన్నీ క్రిందకి దిగివచ్చేయి.
ఇప్పుడు మోదీజీ కూడా అలాగే దృఢం గా ఉండాలి. మనపై పొగరు చూపిస్తున్న వాళ్ళు, మనపై అసహనం వెళ్ళగక్కుతున్న వాళ్ళు దిగిరాక తప్పదు. వాళ్ళు దిగిరాకపోయినా మనకి వచ్చే నష్టమేమీ లేదు.
వీళ్ళా మనకి పాఠాలు చెప్పేది?
Reviewed by rajakishor
on
11:07 AM
Rating:
No comments: