అర్థమయ్యే భాష !!
"మళయాళ మనోరమ" అనేది కేరళ నుండి వెలువడే ప్రముఖ దినపత్రిక. దీనికి ఆ రాష్ట్రంలోను, దేశంలోనే కాకుండా పలు దేశాలలో పెద్ద సంఖ్యలో పాఠకులున్నారు. మలయాళీలు కాకపోయినా ఆ భాష తెలిసినవారు ఆ పత్రికను పోస్టులో తెప్పించుకుని మరీ చదివేవారు. జాతీయ పత్రికల కన్నా దీనికి అంత క్రేజ్ ఉండేది.
1993లో ఆ పత్రిక హిందుత్వాన్ని హేళన చేస్తూ ఒక సంపాదకీయం వ్రాసింది. అంతే మర్నాటి నుండి ఆ పత్రిక అమ్మకాలు యాభై శాతానికి పడిపోయింది. పత్రికా యాజమాన్యం ఆరాతీస్తే విషయం తెలిసింది. దెబ్బకి పత్రికా యాజమాన్యం, సంపాదకుడూ దిగివచ్చి పత్రికా ముఖంగా క్షమాపణలు చెప్పుకున్నారు.
నేడు హిందుత్వం, హిందూ సమాజంపై ఇష్టమొచ్చినట్లు రాస్తున్న పత్రికలకీ, అడ్డమైన కూతలూ కూస్తున్న మీడియాకీ అర్థమయ్యే భాష ఇదొక్కటే !
అర్థమయ్యే భాష !!
Reviewed by rajakishor
on
12:48 PM
Rating:
No comments: