Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

కీర్తికాంక్ష


కామవాంఛ, ధనవాంఛ, భోగవాంఛలకు ఒక దశ వచ్చేక అడ్డుకట్ట వేయగలమేమో గాని కీర్తివాంఛను మాత్రం ఏనాడూ అదుపు చేయలేం. ఎందుకంటే అది అహంకారం నుండి జనించేది కాబట్టి. 

భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలో ఒక శ్లోకం ఇలా చెప్తోంది:

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే
హత్వా2పి స ఇమాన్ లోకాన్న హన్తి  న నిబధ్యతే
ఎవరికీ 'నేను కర్తను' అన్న తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను, కర్మలను అంటదో అతడు ప్రాణులన్నింటినీ చంపినను వాస్తవముగ నేవియూ చంపుటలేదు. మరియు అతడు కర్మ ఫలములచే బంధింపబడడు. 

నిరహంకారంతో చేసే దానధర్మాలు మనకు పది రెట్లు ఫలితాన్ని సమకూరుస్తాయి. అహంకారంతో చేస్తే ఉన్నది ఊడ్చిపెట్టుకుపోతుంది. 

వాంఛా విషవలయంలో మనం కోరుకుపొరాదు. 

తల్లి బిడ్డకి పాలిచ్చినంత గోప్యంగా మనం కర్మలను ఏ ప్రచార కాంక్ష లేకుండా చేయాలి. 

అహంకారం లేకుండా పనిచేసినవాడు ఆంజనేయుడు. గాను చేస్తున్నది రామకార్యం, స్వామికార్యం అనుకున్నాడు కాని తనకార్యం అనుకోలేదు. సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు మైనాకుడు ఆతిథ్యాన్ని ఇస్తానంటే తానూ రామకార్యార్థం వెళ్తున్నాననీ, పూర్తయ్యే వరకు విశ్రాంతికి తావు లేదనీ అన్నాడు. తనని మింగడానికి ఎదురొచ్చిన సురసతో తనస్వామి కార్యం పూర్తైన తరువాత స్వయంగా వచ్చి తన నోట్లోకి ప్రవేశిస్తానని అన్నాడు ఆంజనేయుడు. చేస్తున్నది తనకార్యమని కాక స్వామికార్యమని భావించి చేయడంలో ఆంజనేయుని కీర్తి నిరపేక్ష కనిపిస్తుంది. అందుకే దిగ్విజయంగా ఆ కార్యాన్ని పూర్తిచేయగలిగాడు. 

కాబట్టి ఏ పని చేసినా కీర్తికాంక్ష వదలాలి. భగవత్కార్యంగా భావించి మనం కర్మలనాచారించాలి. 

కీర్తికాంక్ష Reviewed by rajakishor on 6:28 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.