సూర్యాపేటలో VHP ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించిన శ్రీ యాదగిరి రావ్
నల్గొండ, సూర్యాపేట , 10/10/215 : విశ్వ హిందూ పరిషద్ మహిళా విభాగం ' మాతృమండలి ' ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సూర్యాపేట లోని 15 వ వార్డు లో తేది 08/10/2015 నాడు ' ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ' ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన మాన్య శ్రీ టి యాదగిరి రావ్ గారు విశ్వ హిందూ పరిషద్ దక్షిణ మధ్య క్షేత్ర గోరక్షా విభాగం సంఘటన కార్యదర్శి మార్గదర్శనం చేస్తూ ' భారతీయ కుటుంబ విలువలకు మూలం ఇంట్లోని ఇల్లాలు గతం లో ఇంటి నిర్వహణ బాధ్యత పూర్తిగా స్త్రీ చూసుకుంటూ ఉండేది, అప్పుడు సమాజంలో నైతిక విలువలు, దేశభక్తి గల పౌరుల నిర్మాణం జరుగుతూ ఉండేది, మళ్ళి ఆ రోజులు రావాలంటే మహిళలకు ఆర్ధిక స్వావలంబన చాలా అవసరం ఆ దిశలో ఈ పరిణామం సకారాత్మక దిశలో ఉంటుందని ఆశిస్తున్నాను" అని అన్నారు
సూర్యాపేటలో VHP ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించిన శ్రీ యాదగిరి రావ్
Reviewed by JAGARANA
on
12:29 PM
Rating:

No comments: