Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మాంస భక్షణపై ఇంత రాజకీయమా?

తాడేపల్లి హనుమత్ ప్రసాద్ , ఆంధ్రభూమి , 10-10-2015


‘కాదేదీ కవిత కనర్హం’ అన్నాడు శ్రీశ్రీ. నేడు దాన్ని కాదేదీ రాజకీయానికనర్హం’ అని మార్చి చెప్పుకోవాలేమో! ప్రతి విషయంలో రాజకీయం తొంగి చూస్తోంది. మీడియాకు కావాల్సినంత వార్తా సమాచారం కలిసి వచ్చింది. గత మాసంలో మహాముంబై మునిస్పల్ కార్పొరేషన్ పరిధిలో 8 రోజులపాటు మాంస భక్షణంపై నిషేధం విధించడం శివసేనకు, మహారాష్ట్ర నవ నిర్మాణం సేనకు కోపం తెప్పించింది. మహారాష్టల్రో మాంసం, కోళ్ళు, సంబంధిత ఆహారం ఎక్కువగా తీసుకునే మరాఠాలకు మద్దతుగా రాజకీయం రచ్చకెక్కింది. మాంసం తినేవారికి ఇళ్ళు అద్దెకు లభించకపోవడం కూడా సమస్య అయంది. శాకాహారం తినే గుజరాతీయులు, జైనుల మనోభావాలు, వారి ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా మహారాష్టన్రు ఏలుతున్న బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం మిత్ర పక్షానికి కోపం తెప్పించింది. 2017లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షంతో కలవకుండా స్థానిక బలం ఆధారంగా బిజెపి పోటీ చేయాలనుకోవడమే ఇందుక్కారణం కావచ్చు. జైనుల పవిత్ర ఉపవాస దీక్షల సందర్భంగా బిజెపి తీసుకున్న నిర్ణయంపై పెద్ద దుమారం రేగింది. 8 రోజులనుంచి 4 రోజులకు తరువాత 1 రోజుకు మాంస విక్రయంపై నిషేధం విధించారు. ముంబైలో ఏ సినిమాలు ఆడాలో, ఏ సమయంలో ఆడాలో, ముంబై ప్రజలు ఏం తినాలో, యివన్నీ ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇది అప్రజాస్వామికమంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.

రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, చత్తీస్‌గడ్ రాష్ట్రాలు కూడా మాంసాహారం నిషేధించాయి. ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో మంసం అమ్మకాలను నిషేధించడం సరికాదని చాలామంది మేధావులు, కోర్టులు కూడా అభిప్రాయపడ్డాయి. కాని ఈ తరహా నిషేధం విధించడం ఎప్పటినుంచో వస్తున్నది. ఈసారి ప్రత్యేకంగా బిజెపి పాలనలో ఈ విషయం బయటకు లాగడం రాజకీయం కాక మరేమిటి? 

వివిధ మత విశ్వాసాలు కల్గిన మన దేశంలో హిందువుల తరఫున మాట్లాడే శివసేన కూడా వీరంగం సృష్టించడం శివసేనకు హిందూత్వం కంటే రాజకీయాలే ముఖ్యమన్న విషయాన్ని తేల్చి చెప్పింది. ఇది ప్రతిపక్షాలకు పదునైన ఆయుధమైంది. పైగా దీన్ని చట్టంతో ముడిపెట్టి, రాజ్యాంగం, హక్కులూ అంటూ చాలామంది లెక్చర్లిచ్చారు. 

చట్టప్రకారం చూసినా రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ప్రకారం వ్యవసాయాన్ని, జంతు సంరక్షణను వ్యవస్థీకృతంగా నిర్వహిచేందుకు ప్రభుత్వం గోవధ నిషేధం వంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొనడం జరిగింది. గుర్రం మాంసాన్ని కాలిఫోర్నియాలో నిషేధించారు. పంది మాంసాన్ని ముస్లిం దేశాలలో నిషేధించారు. పిల్లి లేదా కుక్క మాంసాన్ని అమ్మడం ఆస్ట్రేలియాలో చట్టవ్యతిరేకం. హాంగ్‌కాంగ్‌లో ఆహారం కోసం కుక్కనీ, పిల్లినీ చంపడం నిషేధించారు. ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో టమాటాలు, ఇతర కూరగాయల వంటి వాటినుంచి చేసే సాస్‌ల వంటివి నిషేధించారు. కాని భారత్‌లో మాంస భక్షణపై, గోవధ నిషేధంపై మెజారిటీ హిందువులు మాట్లాడితే ఎంతో గొడవజరుగుతోంది.

ముస్లిం దేశాల్లో రంజాన్ మాసంలో ఉపవాసదీక్ష సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. వారితో పాటు వివిధ దేశాల నుంచి వెళ్లి అక్కడ పనిచేస్తున్న వారికి కూడా ఈ దీక్షలు వాటి ప్రభావం వర్తిస్తాయి. 

మాంస భక్షణను మత ప్రాతిపదికన ప్రభుత్వం నిషేధించడం తప్పని వాదిస్తున్న కొన్ని వర్గాల అంతరంగంలోనూ హిందువులు తల్లిగా భావించే గోవును అవమానించే కుట్ర కూడా దాగి వుంది. బిజెపి అధికారంలో వున్నపుడు కర్ణాటకలో గోవధ నిషేధం చేసింది. కాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య చేసిన మొదటి పని ఏమిటంటే ఆ నిషేధాన్ని ఎత్తివేయడం. మతం పేర హిందువులను ఏ కారణంగానూ బిజెపి వెనకేసుకురావడం కాంగ్రెస్‌కిష్టం లేదు. 

మాంసం ఉత్పత్తి చేసే కబేళాలకు నీటి వినియోగం ఎక్కువ. మాంసాన్ని ఎగుమతి చేయడంలో భారత్ ఈమధ్యకాలంలో అమెరికాను మించిపోయింది. 2050 వచ్చేసరికి మాంస భక్షణం ఇప్పటికి రెండింతలవుతుందని అంచనా. ఎద్దు మాంసం లేదా గోమాంసం తయారీలో నీటి వినియోగం మరింత ఎక్కువ. ఎద్దు మాంసం తయారీలో గ్రీన్‌హౌస్ వాయువులు ఎక్కువగా వెలువడ్తాయి. నీటి సంక్షోభం భారత్‌కు శాపగ్రస్తం కూడా. 

ప్రపంచ బ్యాంకు నివేదికననుసరించి 2020 నాటికి భరత్‌లో భూగర్భ జలాలు అడుగంటుతాయి. సుమారుగా దేశంలో కబేళాలన్నీ నిషేధించారని చెబుతున్నప్పటికీ చట్టవరుద్ధంగా 10000 కబేళాలాలున్నాయట. సుమారు 26 లక్షల టన్నుల ఎద్దు మాంసం ఏటా భారత్‌లో ఆహారమవుతోంది. రూ. 14000 కోట్ల ఆదాయం ఈ ఎద్దుమాంసం ఎగుమతివల్ల లభిస్తోంది. అంత మాత్రం చేత గోవధ సమ్మతమైపోతుందా? 

గోవు పేడ నుంచి పుట్టే క్రిములు భూమి ఎక్కువ నీటిని గ్రహించే విధంగా సన్నటి సొరంగ మార్గాల నేర్పరుస్తాయి. ఒక అంగుళంలో 129 శాతం నీటి వృద్ధి జరుగుతుంది. ఎకరాకు 254530 లీటర్ల నీరు భూమిలోకి చేరుతుంది. దీనివల్ల భూమి సారవంతమై కరువు నివారించబడుతుంది. గోవు పేడ అలికిన యింటి గోడలతో మేథస్సు పదునెక్కుతుందని న్యూయార్క్‌కు చెందిన బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

గోమాత భారతీయ జీవనంతో పెనవేసుకుపోయింది. 200 ఏళ్ళ క్రితం భారతదేశం భాగ్యదేశం. 1913లో కలకత్తాలో బ్రిటీషు వాళ్ళు మొదటి గోవధశాలను ప్రారంభించారు. భారతీయ ఆర్థిక శక్తికి మూలబిందువైన గోవును అంతరింపజేసేందుకు కుట్ర చేశారు. నమోదైన గోవధశాలలు నేడు36 వేలు ఉన్నాయి. పంటలు పండించే రైతుకు గోవు పేడ సేంద్రియ ఎరువుగా ఉపయోగపడేది. రాను రాను కృత్రిమ ఎరువులు, రసాయనాలు కొనలేక రుణగ్రస్తుడై విషవలయంలో చిక్కిన రైతుతో వ్యవసాయం కుంటుపడింది. పచ్చదనం కళ తప్పింది. వ్యవసాయ భూములు బీడు భూములై రైతులు జీవచ్ఛవాలయ్యారు.

1851లో ఆంగ్లేయులు నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో కేవలం 8 శాతంమంది రోగగ్రస్తులుగా వుండేవారు. కాని భారత ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కలప్రకారం 76 శాతం భారతీయులు రోగాలతో బాధపడుతున్నారు. సుమారు 90 కోట్లమందికి ఏదో ఒక రోగం వుంది. 150 సంవత్సరాలలో ఎందుకిలా జరిగింది? కారణం గోమాతను దేశం మర్చిపోయింది. 

గోవు ముప్ఫై మూడు కోట్ల దేవతల ప్రత్యక్ష రూపమన్నది భారతీయుల విశ్వాసం. గోవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ- యివన్నీ ఆరోగ్య లక్షణాలున్నవే. గోమూత్రంలో 24 రకాల రసాయనాలున్నాయని కనుగొన్నారు. ఇది అనేక రోగాలను నయం చేస్తుందని, దీనిపై ఇప్పటికే భారతీయులు 4, 5 పేటెంట్లు పొంది వున్నారు. 

గోవు పేడతో అమెరికాలో సైతం కోట్ల రూపాయలతో గోబర్ గ్యాస్ ప్లాంట్‌లు నిర్మాణమయ్యాయి. బ్రెజిల్ దేశం 40000 గోవుల్ని భారత్ నుంచి దిగుమతి చేసుకుని అక్కడి పాడి పరిశ్రమ, వ్యవసాయాలను బలోపేతం చేసుకుంది. గోక్షీరం అణుధార్మికతను ఎదుర్కొనే శక్తి కల్గివుందని రష్యను శాస్తవ్రేత్త హిరోవిచ్ అన్నాడు. క్షయవ్యాధిగ్రస్తులను గోశాలలో వుంచినపుడు గోవు పేడ, మూత్రాలనుంచి వచ్చివాసనవల్ల వారు రోగ విముక్తులయ్యారు. 10 గ్రాముల ఆవు నెయ్యితో హవనం చేస్తే 1000 కిలోల ఆక్సిజన్ వెలువడుతుంది. గోవు పాలనుంచి తయారుచేసిన నెయ్యిని బియ్యంతో కలిపి మండించినపుడు వచ్చే ఇథిలిన్ ఆక్సైడ్ ప్రొపిలిన్ ఆక్సైడ్‌లు ప్రాణరక్షణకు మందులుగా పనిచేస్తాయి. గోవు మూత్రం నుంచి 32 రకాల ఔషధాలను తయారుచేస్తున్నారు. జాతీయ పర్యావరణ పరిశోధనా సంస్థ కూడా వీటిని గుర్తించింది.

గోమాంస భక్షణం విషయంలో న్యాయమూర్తులైన మార్కండేయ కట్జూ, యాదవకుల శ్రేష్ఠుడు లాలూప్రసాద్ వంటివారే కువ్యాఖ్యానాలు చేయడం విడ్డూరం. హురియత్ చెప్పిందని పరమత సహనం ఆవంత కూడా లేకుండా వ్యవహరించే ముస్లిం నాయకులు హురియత్ చెప్పిన ‘దావత్-ఈ-దీన్’ (పేదలకు అన్నవితరణ) ఎందుకు పాటించరు? మహమ్మద్ అబ్దుల్ రహీమ్ ఖురేషి, మజ్లిస్-యి-తాయి- యి-మింత్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు కార్యదర్శి వౌలానా ఖలీద్ సైఫుల్లా రహమానీ వంటివారు ముస్లింలు గోమాంస భక్షణం విడిచిపెట్టాలని కోరుతున్నారు. ముస్లిం దేశాల్లో ఎక్కడా గోమాంస దుకాణాలు కనబడవు. హైద్రాబాద్ బార్‌ఖాస్‌లో కొందరు ముస్లిం యువకులు ‘అరబ్ గోవ్ రక్షాదళ్’ పేరున ఓ సంస్థను స్థాపించి గోరక్షణకు ఉపక్రమించడం అభినందించదగ్గ విషయం. బక్రీద్ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త రెండు మేకలను బలి ఇచ్చాడు. ఆవును, ఎద్దును బలిఇవ్వమని చెప్పలేదు. ముస్లింలు గోమాంస భక్షణం విడిచిపెట్టాలని బార్‌ఖాస్ యువకులంటారు.

ముస్లింలు హిందువుల భక్తిని గౌరవిస్తే వారి కి ఆదరం, గౌరవం లభిస్తాయని బార్‌ఖాస్ యువకులంటారు. 

గోమాంస భక్షణంవల్ల అనేక రోగాలొస్తాయని యునానీ వైద్యులంటున్నారు. 

వాస్తవాలిలా వుంటే మతం, ఉన్మాదం ఊపిరిగా బతుకుతున్న కొందరు నాయకులు మాత్రం యుపిలో, దాద్రీలో జరిగిన సంఘటనకు ఆజ్యం పోస్తూ, వరుస పర్యటనలు చేపట్టారు. తాజాగా రాహుల్ గాంధీ కూడా సరాసరి అమెరికా నుండి దాద్రిలో వాలిపోయారు. రాజకీయం తప్ప దేశ ధర్మాల పట్ల భక్తి అంతుబట్టని ఈ అభినవ అసురులనుంచి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అందరిపై వుంది.

మాంస భక్షణపై ఇంత రాజకీయమా? Reviewed by rajakishor on 10:34 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.