అవార్డులు తిరిగివ్వడం కాదు - సౌదీలో పందిమాంసం అడిగి తిరిగిరండి చూద్దాం - VHP నేత సురేంద్ర జైన్
- వార్తా సంగ్రహణ కర్త : శ్రీ కిషోర్ కుమార్ గారు
లక్నో, 12/10/2015 : హిందుత్వ మాన చిహ్నాలైన గో-మాత వధ, ఆవు మాంస వినియోగం పై వివాదాలు సృష్టిస్తూ జాతీయ సాహిత్య అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న రచయితలకు ఇక్కడ ప్రభుత్వానికి ఆవార్డులు తిరిగి ఇచ్చేయడం కాదు, దమ్ముంటే సౌది అరేబియా దేశాలకు వెళ్ళి పందిమాంసం అడిగి ప్రాణాలతో తిరిగి రాగలరా ? అలా వస్తే వారికి ఘనంగా స్వాగతం పలుకుతాం అని సవాలు విసిరారు.
లక్నో లో జరిగిన విశ్వ హిందూ పరిషద్ భహిరంగ సభలో ఆయన మార్గదర్శనం చేసారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడ ఆ పని చెయ్యలేనివారు.. ఇక్కడ కపటత్వాన్ని ప్రదర్శించడం సరికాదన్నారు. మన దేశంలో అత్యధికులు మంసాహారులేనన్న సంగతి తమకు, సంఘ్ పరివార్‌కు తెలుసన్న సురేంద్ర కేవలం గోవధను, అవు మాంసాన్ని వినియోగించడాన్ని మాత్రమే నిషేధించాలంటున్నామని స్పష్టం చేశారు. గోమాత హైందవ విశ్వాసాలకు కేంద్ర బిందువంటూ, ఇతరుల మత విశ్వాసాలను హిందువులు ఎప్పుడూ గౌరవిస్తూ వచ్చారన్నారు.భారత్‌లోని ముస్లింల పరిస్థితిపై ఐక్యరాజ్య సమితికి లేఖ రాసిన యూపీ మంత్రి ఆజంఖాన్‌పై దేశద్రోహం కింద కేసు పెట్టాలని, వెంటనే మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి అఖిలేష్ తొలగించాలని సురేంద్ర డిమాండ్ చేశారు. అప్పుడే సమాజ్‌వాదీ ప్రభుత్వం పట్ల హిందువులకు విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు. ఇక సిఎం కూడా ఒక సామాజిక వర్గానికి మాత్రమే అండగా ఉంటూ రూ.45 లక్షలు పరిహారం, ఉద్యోగాలు ఇస్తున్నారని, ఇతర సామాజిక వర్గాల్లోని బాధితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.దేశంలో హిందువులపై ప్రత్యక్ష సవాళ్ళు ఎదురవుతున్నాయని' ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
అవార్డులు తిరిగివ్వడం కాదు - సౌదీలో పందిమాంసం అడిగి తిరిగిరండి చూద్దాం - VHP నేత సురేంద్ర జైన్
Reviewed by JAGARANA
on
4:36 PM
Rating:

Post Comment
No comments: