ఆరోగ్య గ్రామ భారతం కోసం :" స్వాస్థ గ్రామ యోజన " ఆరోగ్య భారతి వారి వినూత్న సేవ ప్రకల్పం
ముంబై 07/03/2014 : అఖిల భారతీయ ఆరోగ్య భారతి మన పల్లెలలో, తండాలలో, సేవా బస్తీలలో ప్రజల ఆరోగ్య రక్షణ కై వినూత్న సేవ ప్రకల్పనికి శ్రీకారం చుట్టింది, అనారోగ్యానికి గురైన తర్వాత వైద్యం కోసం పరిగెట్టడం కంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్య ఉద్ద్యేశం గా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆ సేవా ప్రకల్పం పేరు " స్వాస్థ గ్రామ యోజన " సంపూర్ణ గ్రామీణ ఆరోగ్యం కోసం పది అంశాలలో కూడిన కార్యాచరణ ప్రణాళిక ఈ సేవా ప్రకల్పం లో భాగంగా ఉంది.
మేము గత ఏడూ సంవత్సరాలుగా గుజరాజ్ లోని ఒక కుగ్రామం లో " స్వాస్థ గ్రామ యోజన " లో భాగంగా పని చేస్తున్నాం, ఫలితాలు చాల ఆశాజనకంగా, ఉత్సాహభరితంగా ఉన్నాయి, ఆరోగ్యం రక్షణ కై కలిగించే సకారాత్మక అవగాహనా ప్రజలలో మంచి వాతావరణాన్ని నిర్మాణం చేసింది, ఇదీ అనేక అనారోగ్య కారకాల పై విజయం సాధించింది ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాలలోని కుగ్రామాలకు సైతం ఈ ప్రయోగాన్ని విస్తరించాలని అనుకుంటున్నాము అని ఆరోగ్య భారతి సంయోజకులు డా. హితేష్ జైని గారు తెలిపారు.
గ్రామ ఉన్నతే దేశ ఉన్నతి గ్రామ ఉన్నతిలో ప్రజల ఆరోగ్యం చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది, గ్రామాలకి పట్టణాలకి మధ్య వైద్య సదుపాయాల దృశ్య చాలా పెద్ద అఘాదం ఏర్పడిఉంది, వైద్య ఖర్చులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి, ఇలాంటి పరిస్తితులలో మన పల్లెలు అనారోగ్యానికి లోను కావడం అంటే ఈ దేశం అనారోగ్యానికి లోను కావడమే.
పర్యావరణ పరిరక్షణ తో పాటు 10 అంశాల కార్యాచరణను "స్వాస్థ గ్రామా యోజన" జోడించినట్లు వాటిలో స్వచమైన త్రాగునీరు ఏర్పాటు చేసుకోవడం, సాముహిక అనారోగ్య కారకాల పై చర్చించి అవగాహనా కల్పించుకోవడం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య పథకాలను విరివిగా ఉపయోగించుకోవడం, స్వచ్చమైన గ్రామాల కోసం పనిచేయడం తదితర అంశాలు కల్గిఉన్నాయని డా.హితేష్ జైన్ గారు తెలిపారు.
మూలం : న్యూస్ భారతి
ఆరోగ్య గ్రామ భారతం కోసం :" స్వాస్థ గ్రామ యోజన " ఆరోగ్య భారతి వారి వినూత్న సేవ ప్రకల్పం
Reviewed by JAGARANA
on
8:32 AM
Rating:
No comments: