భాగ్యనగర్ : ఎల్లమ్మ దేవాలయం కబ్జా కాకుండా అడ్డుకున్న భజరంగ్ దళ్
భాగ్యనగర్, 25/03/2014 : భాగ్యనగర్ షేర్ లింగంపల్లి లో గత 30-35 సంవత్సరాలుగా స్థానికులు ఆరాధ్యంగా పూజించే రేణుక ఎల్లమ్మ దేవాలయం పై గత రెండు మూడు రోజులుగా ఉద్రిక్తత నెలకొన్నది స్థానిక అన్య మతస్తుడు దేవాలయ స్థలం తనది అని కోర్టులో పిల్ వేయడం జరిగింది, కోర్టు అతని పక్షంలో తీర్పు ఇచ్చిన తర్వాత స్థానిక భాజపా, భజరంగ్ దళ్ నాయకులు అత్యత్మికతకు సంబందిచిన విషయం కాబట్టి దేవాలయం చుట్టూ ఉన్న 200 గజాలను వదలి మిలిగిన స్థలాన్ని అతనికి అప్పజెప్పాలని రేవేన్యు అధికారులకు విన్నవించడం జరిగింది. ఇలా ఈ ప్రసహనం జరుగుతూ ఉండగానే అతను దేవాలయ స్థలం లో ప్రహారి గోడ నిర్మించి దేవాలయాన్ని అక్కడి నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుసుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రహారి గోడ నిర్మాణాన్ని ఆపడం జరిగింది తిరిగి ఆలయ స్థలం చుట్టూ కంచెను నిర్మించడం జరిగింది.
ఈ సందర్భంగా భాజపా స్థానిక నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భజరంగ్ దళ్ ప్రాంత ప్రాముఖ్ శ్రీ సుభాష్ చందర్ గారు సంయుక్తంగా మాట్లాడుతూ ' స్థానిక భక్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని తొలగించడం భక్తుల మనోభావాలను విఘాతం కలిగించడమే అవుతుంది , భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దేవాలయాన్ని రక్షించడానికి సహకరించాలని స్థానిక రేవేన్యు అధికారులను కోరుతున్నాం, ఈ అంశం పై న్యాయ పోరాటం చేయడానికి వెనుకాడం ' అని అన్నారు.
దేవాలయ పాత చిత్రం |
భాగ్యనగర్ : ఎల్లమ్మ దేవాలయం కబ్జా కాకుండా అడ్డుకున్న భజరంగ్ దళ్
Reviewed by JAGARANA
on
9:42 AM
Rating:
No comments: