Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ప్రత్యేక వ్యాసం: హిందువుగా జన్మించి - ముస్లీం గా జీవిస్తున్న కేజ్రివాల్

మన దేశంలో తనకు తాను అవతార పురుషుడిగా భావిస్తున్న అరవింద్ కేజ్రివాల్ పై ముస్లీం మిర్రర్ అనే ఇస్లామిక్ భావజాల వెబ్ పోర్టల్ లో సయ్యద్ జుబైర్ అహ్మద్ రాసిన వ్యాసం Kejriwal: A Hindu by faith A Muslim by practice (హిందువుగా పుట్టి - ముస్లీం గా జీవిస్తున్న కేజ్రివాల్) ముస్లీం పక్షపాతి గా అరవింద్ కేజ్రివాల్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసింది ఆ వ్యాసం లోని కొంత భాగాన్ని మీకు తెలుగులో అందిస్తున్నాం - రాష్ట్ర చేతన 

‘నేను అల్లాను మనస్పూర్తిగా వేడుకుంటున్నాను’ అన్న శబ్దం నాకు వినబడేసరికి  హటాత్తుగా లేచి టీవీ దగ్గరికి వెళ్లి చూస్తే సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న అరవింద్ కేజ్రివాల్ నోటి నుంచి ఈ మాటలు వస్తున్నాయి. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను.ఇంతవరకు ఏ ముస్లీం నాయకుడు కూడా ఇంత  ధైర్యముగా ఇలా చెప్పలేదు.( నిజమే ! )
కేజ్రివాల్ యొక్క త్యాగం, కార్యకుశలత, నిరాడంబరత, సాదా సీదా జీవనం ఇవన్నీ చూస్తే నాకు ఒక నిజమైన ఇస్లామికుడు కనబడుతున్నాడు. ఆయన చేస్తున్న ప్రతీ కార్యం ఇస్లాంను తలిపిస్తున్నది (50 రోజులు కూడా ప్రభుత్వాన్ని నడపడం చేతకాక ఢిల్లీ ముఖ్య మంత్రి పదవిని వదిలేసిన కేజ్రివాల్ కార్యకుశలత ఇదేనా? - రాష్ట్ర చేతన ).
మహ్మద్ ప్రవక్త ఇలా చెప్పెను: ఎవరయితే ఇతరుల మంచికోసం జీవిస్తారో వారే మంచివారు. అరవింద్ కేజ్రివాల్ ప్రవక్త చెప్పినట్టుగా పేద ప్రజల అభ్యున్నతికోసం నిర్విరామ కృషి చేస్తున్నారు. నీ అహంకారమే నీ అసలైన శత్రువు అని అన్న ప్రవక్త మాటలను కేజ్రివాల్ లో మనం చూడవచ్చు. తన ప్రమాణ స్వీకారోత్సవ సభలో మనమంతా అహంకారాన్ని త్యజించకపోతే మరోక నూతన విప్లవం రావడానికి ఆస్కారం ఉందని సూచించారు (తమ ప్రభూత్వం 15 రోజుల్లో జన లోకపాల్ అమలులోకి తీసుకొస్తుందన్న అహంకారంతో విర్రవీగిన నువ్వు దానిని అమలు చేయడంలో మాత్రం విఫలం అయ్యావు ఎందుకు? - రాష్ట్ర చేతన).
మహ్మద్ ప్రవక్త ఇలా చెప్పెను : లంచం ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఇద్దరూ నరకానికి వెళతారు. కేజ్రివాల్ ఈ దేశంలో కూరుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు మరియు ప్రజలతో నేను ఎప్పటికీ కూడా లంచం తీసుకోనని ప్రమాణం చేసారు (ఈ వ్యవస్థనంతా మారుస్తానని చెబుతున్న కేజ్రివాల్ ని విదేశీ సంస్థ అయిన ఫోర్డ్ ఫౌండేషన్ కోట్ల డబ్బిచ్చి పోషిస్తుంది. ఇది చాలదా? అతను కూడా ఒక దోపిడీ దొంగ అని నిరూపించడానికి - రాష్ట్ర చేతన).
మహ్మద్ ప్రవక్త ఇలా చెప్పెను: శుభ్రత అనేది ఇమాన్ లో ఒక భాగమే. కేజ్రివాల్ ఆదాయ పన్ను ఆఫీసరుగా ఉన్నపుడు తన కుర్చీని తనే శుబ్రం చేసుకునేవాడు. ఇప్పుడు ఈ వ్యవస్థను శుభ్రపరుస్తున్నాడు (అనినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ తో చేతులు కలిపిన కేజ్రివాల్ అసలు ఈ వ్యవస్తను ఎలా శుభ్రం చేయగలదడు? - రాష్ట్ర చేతన).
ఒకసారి ప్రవక్త తన పాదాల మీద కూర్చున్నాడు. అది చూసిన తన సహచరుడు ఇలా ఎందుకు కూర్చున్నావని అడిగితే నేను దేవుడి సేవకుడిని అందుకే ఇలా కూర్చున్నాను అని సమాదానం ఇచ్చెను. అరవింద్ కేజ్రివాల్ కూడా ప్రతిసారీ తన ప్రసంగంలో ‘నేను ఏమి కాను, నాకంటూ ఏది లేదు అని చెబుతుంటారు (ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమ్ ఆద్మీ అని చెప్పుకు తిరుగుతూ బంగళాలు కావాలని కోరడం ఎంతటి హాస్యాస్పదం - రాష్ట్ర చేతన ).
మహ్మద్ ప్రవక్త ఇలా చెప్పెను: అతి క్రూరమైన పరిపాలకులను ఎదిరించడమే అసలైన జిహాద్. అరవింద్ కేజ్రివాల్ కూడా క్రూరమైన రాజకీయ నాయకులను సైతం ఎదిరిస్తున్నాడు (కాంగ్రెస్ మరియు బాజపాలు నాణానికి బొమ్మ బొరుసు లాంటివి అన్న కేజ్రివాల్ అదే కాంగ్రెస్ తో నేడు కుమ్మక్కయావు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు  మొదట్లో చెప్పిన మాటలు గుర్తుకు రావడంలేదా? - రాష్ట్ర చేతన).
మరణానికి  ఒక తేది ఖరారు చేయబడి ఉంటుంది. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు అన్న సిద్దాంతాన్ని ముస్లింలు చాల గట్టిగా నమ్ముతారు. కేజ్రివాల్ కూడా మీ ప్రాణానికి అపాయం ఉంది కనుక మీకు రక్షణ అవసరం అని పోలీసులు కోరితే దాన్ని చాల సున్నితంగా తిరస్కరించారు. నేను చూసిన హిందూ నాయకులలో అనైతిక విధానాలతో కూడిన చాణక్య నీతులు మరియు నీతి శాస్త్రమ్మును అనుసరించని నాయకుడు కేజ్రివాల్ (అసలు కేజ్రివాల్ దేశభక్తుడు అయితే ఫోర్డ్ ఫౌండేషన్ తో చేతులు ఎందుకు కలుపుతాడు? )
కేజ్రివాల్ అతని మిత్రబృందం వీదుల గుండా తిరుగుతూ ప్రజల సమస్యల్ని తెల్సుకునే ప్రయత్నం చూస్తే ఇస్లాం చరిత్రలోని కలిఫాలు ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని కనుగొన్న సంఘటన గుర్తుకు వస్తుంది (ఎన్నికల కోడ్ ను ఉల్లంగించడం, ప్రజలను మభ్యపెట్టడమే తన పని తప్పా ప్రజల సమస్యలను తానెందుకు పట్టించుకుంటాడు? ).
ఏది ఏమైనా ఇస్లాం ఎలా ఉండాలని కోరుకుంటుందో అక్షరాల కేజ్రివాల్ దానిని చేసి చూపిస్తున్నాడు. అందుకే నేనంటాను కేజ్రివాల్ ' హిందువుగా జన్మించి ముస్లీం గా జీవిస్తున్నాడు' అని
కేజ్రివాల్ facebook పేజి స్వాతంత్ర్యఅనంతరం కలకత్తాలో జరిగిన బహిరంగ సభలో గాంధీ మాట్లాడుతూ ‘ ఈ దేశ వాసులంత ఒమర్ ఇబన్ ఖతంలా అయితే మనకు ఎలాంటి సమస్యలు ఉండవు  అని చెప్పిన తలిస్మాన్ ను తలపిస్తుంది (తన నిజస్వరూపం తెల్సుకున్న అనుచరుల సంఖ్య చివరి రెండు నెలల నుండి క్రమంగా తగ్గుతూ వస్తుంది)ఏది ఏమైనా ఇస్లాం ఎలా ఉండాలని కోరుకుంటుందో అక్షరాల కేజ్రివాల్ దానిని చేసి చూపిస్తున్నాడు. అందుకే నేనంటాను కేజ్రివాల్ 'హిందువుగా జన్మించి ఇస్లాంను ఆచరిస్తున్నాడు' అని.
మూలం : http://muslimmirror.com/eng/kejriwal-a-hindu-by-faith-a-muslim-by-practice/

ప్రత్యేక వ్యాసం: హిందువుగా జన్మించి - ముస్లీం గా జీవిస్తున్న కేజ్రివాల్ Reviewed by JAGARANA on 4:37 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.