దొంగ సెక్యులరిజం
అక్టోబర్ 22, 2015 విజయదశమి రోజున అమరావతిలో జరిగిన శంకుస్థాపనోత్సవం బాగా అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి మోదీగారికి చంద్రబాబునాయుడుగారు చూ పంచిన ఎగ్జిబిషన్లోని ఫొటోల్లో ఉన్న చిత్రాలన్నీ ఏమిటి? అమరావతి బౌద్ధస్తూపాలు. ఆఖరి ఫొటోలో మాత్రం ఒక బక్కచిక్కిన రాజు కనిపించాడు!
ఆంధ్రప్రదేశ్ అంటే బౌద్ధమా? బీజపూరు, గోల్కొండ, బహమనీ సుల్తానుల బారినుండి హిందువులను రక్షించిన కృష్ణదేవరాయలు ఏమయ్యాడు? మహాభారత ఆంధ్రీకరణ కారకుడు రాజరాజనరేంద్ర చోళుడు ఏమయ్యాడు? పిండారీల పీచమడచి, ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించి నిలిచిన మొట్టమొదటి హిందూరాజు రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఏమయ్యాడు? అతడి రాజధాని అమరావతియేగా! పోనీ, త్రిలింగదేశం నందలి ద్రాక్షారామ, శ్రీశైల స్వాములేమయ్యారు? పక్కనే ఉన్న దుర్గమ్మ ఏ కొండ ఎక్కింది?
ఒకవేళ ఇదంతా సెక్యులరిజం అనుకుందామంటే బౌద్ధ ‘మతం’ సెక్యులరిజం కాదే.
అక్కడ కే.సి.ఆర్. చార్మినార్ను వాటేసుకున్నారు. ఇక్కడేమో మన బాబుగారు బౌద్ధస్తూపాల వెంట పడుతున్నారు. హిందువుల చేత ఎన్నికైన హిందూ వారికి హిందువులు కావాలి, వారి వోట్లు కావాలి. కాని, హిందుత్వం అక్కర్లేదా?
ఇదెక్కడి సెక్యులరిజం?
దొంగ సెక్యులరిజం
Reviewed by rajakishor
on
8:18 AM
Rating:
No comments: