ధర్మ యుద్ధం 2014 ప్రత్యేక వ్యాసం : 'ఓటరే' - భారత భాగ్య విధాత - 1
దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన పాశుపతాస్త్రం ఓటు మనం అనేక సంవత్సరాలుగా పడ్డ తపన కార్యరూపం దాల్చే సమయం రానే వొచ్చింది, ఈ సమయంలో మన శక్తి ప్రదర్శన చేద్దాం, భారత మాతను తిరిగి విశ్వ గురువు స్థానం లో నిలుపుదాం - ఈ మహత్తర కార్యం కోసం జరిగే ధర్మ యుద్ధం - 2014 లో మీరు భాగస్వామ్యులు కండి - రాష్ట్ర చేతనా ( జయమగు గాకా భారత మాతా )
ఓటు శక్తి గుర్తించండి : వొచ్చే ఎన్నికలలో దేశ నాయకత్వంలోనూ, వ్యవస్థలోను రావాల్సిన మార్పును మీ ఓటే నిర్ణయిస్తుంది, గతంలో రాజులు వంశ పారంపర్యంగా గద్దెనేక్కేవారు, కాని ఇప్పటి రాజకీయ నాయకత్వం మీరు వేసే ఒక్కొక్క ఓటు తోనూ, మీ భవిష్యత్తు, మీ పిల్లల మరియు మీ కుటుంబ, మీ వాణిజ్య, వ్యాపార, వ్యవసాయ భవిష్యత్తు తో పాటు ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్ణయమౌతుంది, మన దేశానికి నిజాయితిగా వ్యవహరించే స్థిరమైన మరియు దృడమైన వైఖరితో ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థ నాయకత్వానికే మీ ఓటు తప్పకుండా వేయండి ఇతరులతో వేయించండి.
మార్పు ఎందుకు అవసరం : స్వాసంత్ర్యం వచ్చిన కేవలం 67 సంవత్సరాల కాలంలోనే దాదాపు వేయి పైచిలుకు సంవత్సరాల మొఘల్, ఆంగ్లేయ తదితర విజాతీయ ముష్కరుల పరిపాలనలో జరిగిన దోపిడీ కంటే ఎక్కువగా దాదాపు పది వేల లక్షల కోట్ల దోపిడీ ఈ దేశంలో జరిగింది, అవినీతి మాయ కాంగ్రెస్ దానికి మద్దతిచ్చే అవినీతి రాజకీయవేత్తలు, అవినీతి వ్యాపార వేత్తలు, ఒక రకంగా కాంగ్రెస్ ను ఎన్నుకున్న ఈ దేశ ప్రజలు ఆ దోపిడీకి ప్రత్యక్ష పరోక్ష పద్దతిలో బాధ్యులు, ఈ దేశం నుండి తరలించబడిన నల్లదనం, కుంభకోణాలు, టాక్స్ ఎగవేత, వంటివాటితో కలుపుకుంటే ఆ దోపిడీ దాదాపు ఇరవై వేల లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈ దోపిడీదారులు మన దేశంలోని నీరు, అడవి, నేల ఇలా దేన్నీ వదలలేదు, పూర్తిగా మన దేశన్నే అమ్మకానికి పెట్టారు.
ఈ దేశానికి వచ్చే క్రొత్త నాయకత్వం మన దేశం నుండి దోచుకుని దాచుకున్న ఆ సొత్తును తిరిగి తెప్పించి ఆ డబ్బు పై దేశం లోని 122 కోట్ల మంది ప్రజల హక్కును తిరిగి ఇప్పించగలగాలి, ఇక పై ఇలాంటి దోపిడీ జరగకుండా ఆపాలి, దోపిడీ పెద్ద పీట వేసే ఈ దుర్మార్గపు వ్యవస్థను మార్చి, భారత్ ను అమెరికా, చైనాల కంటే శక్తి వంతమైన దేశంగా తయారు చేయగలగాలి, నేడు భారత కరెన్సీ, భారత పౌరులు, భారతీయ సంస్కృతీ, భారతీయ పరిపాలన వ్యవస్థకు ప్రపంచంలో ఎక్కడా గౌరవంలేదు, దేశంలో ఒక రాజకీయ ఆర్ధిక, సమాజిక అరాచకత్వం బయల్దేరింది, వీటన్నిటికి ఒకటే పరిష్కారం దేశంలో నాయకత్వ మార్పు.
మన దేశం ఇలా సర్వనాశనం కావడానికి బాధ్యులెవరు : ' తిలా పాపం తలా పిడికెడు ' అన్నట్లు కేవలం కాంగ్రెస్ ఒక్క పర్తియే కాదు, వివిధ సందర్భాలలో కాంగ్రెస్ కు మద్దత్తు ఇచ్చిన ప్రతి రాజకీయ పార్టికి ఇందులో భాగస్వామ్యం ఉంది, ఎదుకంటే కాంగ్రెస్ తో పాటు దాని మిత్ర పక్షాలు అవలంబించిన ద్వంద ప్రమాణాలు, దుర్మార్గపు విధానాలు, లోపభూయిష్టమైన నాయకత్వం వల్లే దేశం పది రెట్లు పతనమైంది.
భారత్ లోని ప్రభుత్వాన్ని కీలుబొమ్మా చేసి ఆడించాలని చూస్తున్న శక్తులేవి ? : భారత దేశంలోనే ఉంటున్న జాతీయ వాద వ్యతిరేక శక్తులు, అమెరికా, చైనా దేశాల గుణకీర్తనం చేసే రాజకీయ పార్టిలు, విదేశీ ధనం, పురస్కారాలతో బరువెక్కిన కొందరు వ్యక్తులు, దేశాన్ని దోచుకోవలనుకుంటున్న కొన్ని ఎన్జిఓ లు ఇలాంటి వారంతా మన దేశానికి పెద్ద శల్య సారథ్యం చేయడానికి సిద్ధపడ్డారు, వీళ్ళంతా కలసి దేశంలో ఎక్కడా నిజాయితీ పరుల్ని, సుధృడ స్థిరమైన ప్రభుత్వాలను నిలబడనీయకుండా చేస్తున్నారు, దేశం వారి చేతులలో ఉండాలి భారత్ చైనా, అమెరికా, యూరప్ దేశాల కంటే ముందుకు సాగకూడదు, మనం ఎప్పటికి బలహీనంగానే ఉండిపోవాలి.
ఈ దేశ ద్రోహుల పగటి కలలను నిజం కాకుండా అడ్డుకునేందుకు సమస్త భారతం సిద్ధమవ్వాలి ఆ దిశలో మనం చేయాల్సిన, ఖచ్చితంగా ప్రతి దేశ పౌరుడు చేయగలిగిన పనులను వచ్చే భాగంలో చర్చిద్దాం - వందే భారత మాతరం
ధర్మ యుద్ధం 2014 ప్రత్యేక వ్యాసం : 'ఓటరే' - భారత భాగ్య విధాత - 1
Reviewed by JAGARANA
on
7:34 AM
Rating:
No comments: