Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

కేరళ : "అమ్మ" పై దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ రెండు లక్షల మందితో నిరసన

దేశంలోని ధర్మాచార్యుల పై విధర్మియ, విదేశీ శక్తులు చేస్తున్న ఈ కుట్రలకు జాగృత హిందూ సమాజ శక్తి మాత్రమె సరైన సమాధానం ఇవ్వగలుగుతుంది - మాన్య శ్రీ అశోక్ సింఘాల్ 
కోచి , 26/03/2014 : కేరళ లో  హిందుత్వ శక్తి తన బల ప్రదర్శన చేసింది, మాత అమృతానందమయి ఆశ్రమం పై విదేశీయ, విధర్మీయ శక్తులు చేసిన కుత్రంతపు దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ తేది 23/03/2014 ఆదివారం నాడు కేరళ ఆర్ధిక రాజధాని కొచ్చి లో సంఘ్ పరివార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ' ధర్మ రక్షా సంగమం ' కార్యక్రమానికి దాదాపు రెండు లక్షల మంది హిందువులు హాజరై విజయవంతం చేసారు.
మాతా అమృతానందమయి  - గూగుల్ చిత్రం 
హిందుత్వం పై, హిందూ ధర్మ సంస్థల పై ధర్మాచార్యుల పై హిందూ వ్యతిరేక రాజకీయ, సామాజిక శక్తులు చేస్తున్న పన్నాగాలకు సరైన సమాధానం ఈ ధర్మ రక్షా సంగమం ద్వార కేరళ హిందువులు ద్వారా ఇచ్చారు, ఇకపై ఏ విధర్మియ శక్తులు మన ధర్మం వైపు కన్నెత్తి చూసేముందూ ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది.  కేరళ లోని రాజకీయ పార్టీలు ఎన్నడు హిందువుల తరపున ఆలోచించలేదు సంఘ్ పరివార్ కృషి కారణంగా నేడు హిందువులు సగర్వంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. 1982 తర్వాత హిందువులు ఇంత పెద్ద మొత్తంలో ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి.

పూజ్య పెజావర్ పీఠాధీపథి విశ్వేశ్వర తీర్థ చేతుల మీదుగా ప్రారంభం : 

ధర్మ రక్షా సంగమం కార్యక్రమం పూజ్య పెజావర్ పీఠాధీపథి విశ్వేశ్వర తీర్థ స్వామి గారి దివ్య చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమైనది,  ఈ సందర్భంగా స్వామిజి మాట్లాడుతూ ' హిందూ ఆద్యాత్మిక కేంద్రాల పై దాడులు పెరిగిపోతున్నాయి, హిందూ ధర్మాచార్యులపై కుట్రలు జరుగుతున్నాయి, ఇదంతా కలి మహాత్యమేన ! అని అనిపిస్తూ ఉంది కాని ' ధర్మ సంస్థాపనార్థాయ ' అన్న ఆ భగవంతుని మాటలు మనం మననం చేసుకోవాలి ఆ దైవియ శక్తి నేడు మీ అందరిలో జాగృతమై కనిపిస్తుంది అని అన్నారు.

జాగృత హిందూ శక్తి మాత్రమె వీటికి సరైన సమాదానం : మాన్య శ్రీ  అశోక్ సింఘాల్       

మాన్య శ్రీ అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ సంరక్షకులు ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తూ ' జాగృత హిందూ సమాజ శక్తి మాత్రమె ఈ దుష్పరిణామాలకు సరైన సమాదానం ఇవ్వగలుగుతుంది, మనం జాగృతం కాలేకపొతే ఇలాంటి దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతాయి, దేశంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలపై ఒక వ్యూహాత్మకంగా కుతంత్రయుక్త దాడులు జరుతున్నాయి, హిందూ సమాజంలో ధర్మాచార్యుల పైగల గౌరవ భావాన్ని మంటగలిపి హిందుత్వాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతుంది, జగద్గురు కంచి స్వామి శంకరాచార్య పై జరిగిన కుట్రతోనే ఈ దాడులు ప్రారంభమయ్యాయి కాని హిందూ సమాజం తగిన రీతిలో దానికి సమాదానం చెప్పలేకపోయింది కాబట్టే పదేపదే దాడులు జరుగుతున్నాయి, నేడు కొచ్చిలో జరుగుతున్న ఈ ' ధర్మ రక్షా సంగమం ' లాంటి కార్యక్రమం అప్పుడే జరిగి ఉంటే, విధర్మీయులు మన పై ఇలాంటి కుట్రలు కలలో కూడా చేసి ఉండిఉండే వారు కాదు, నేడు అందరు ప్రేమతో అమ్మా అని పిలుచుకునే మాతా అమృతానందమయి పై జరిగిన కుట్రకు వ్యతిరేకంగా హిందూ సమాజం ఒక్క తాటి పై నిలబడి సమాధానం ఇస్తూఉంది ' అని అన్నారు.
           
కేరళ : "అమ్మ" పై దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ రెండు లక్షల మందితో నిరసన Reviewed by JAGARANA on 4:40 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.