ఆదర్శవంతంగా ప్రజాస్వామ్యాన్ని నడపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి : రాం మాధవ్
మహిళల వేదింపులలో డిల్లికి ప్రపంచ రాజధానిగా గుర్తింపు వచ్చింది, మన అంతర్గత భద్రతకు ఇండియన్ ముజయిద్దిన్ లాంటి జిహాది సంస్థలు సవాల్ విసురుతూనే ఉన్నాయి, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణచివేయడంలో మన దేశ నాయకత్వం రష్యా అధ్యక్షుడు పుతీన్ ను ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది - రాం మాధవ్
కోజికోడే, కేరళ, 28/03/2014 : కేరళ లోని కోజికోడే లో తేది 27/03/2014 నాడు భారతీయ విచార్ మంచ్ అధ్వర్యంలో " ప్రజాస్వామ్యం మరియు దేశ ప్రగతి " అనే అంశం పైన జరిగిన చర్చా గోష్టిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సహా సంపర్క్ ప్రముఖ్ శ్రీ రాం మాధవ్ గారు ముక్త వక్తగా పాల్గొని ప్రసంగించారు.
శ్రీ రాం మాధవ్ గారు మార్గదర్శనం చేస్తూ ' ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం కలిగిన భారత దేశం ఇంకా అనేక ప్రబలమైన సమశ్యలతో ఉంది, ఇదంతా గత ఆరు దశాబ్దాలుగా మన రాజ్యాంగం ఆదర్శవంతంగా అమలు కావడంలో విఫలం కావడం వలనే జరుగుతుంది. అత్యుత్తమంగా లిఖించబడినప్పటికీ దాని అమలు తీరు సరిగ్గా లేకపోతె లాభం ఉండదు, దాదాపు ఒకే సమయం లో భారత్ స్వాసంత్ర్యాన్ని పొందింది, ఇస్రాయెల్ తమ మాతృభూమిని తిరిగి పొందింది , జపాన్ పై అతిదారుణమైన అణుబాంబు దాడి తర్వాత కూడా అనతికాలంలోనే తిరిగి లేచి ప్రపంచంలోనే ఉత్తమ దేశంగా నిలబడగలిగింది.
నేటికి భారత్ లోని 65 % జనాభా దారిద్ర్య రేఖకు దిగువగా జీవిస్తున్నారు, దేశంలో దాదాపు 60 - 65 % మంది నిరక్షరాస్యులు, మన దేశపు ఉద్పాదక రంగం పూర్తిగా కుంటుబడిపోయింది, చైనా మన సరిహద్దుల్లోనే కాదు మన వ్యాపార రంగంలోనూ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది, చైనా తో మన ఉమ్మడి వాణిజ్యం 70 మిలియన్ డాలర్లు ఉంటె అందులో 60 మిలియన్ డాలర్ల మేరకు మనం దిగుమతి చేసుకుంటున్నాం, కేవలం ముడి ఇనుము వంటి వాటితో ఎగుమతి కేవలం 10 మిలియన్ డాలర్లు మాత్రమె.
మన దేశపు శాంతి భద్రతల పరిస్థతి అగమ్య గోచరమే, మహిళల వేదింపులలో డిల్లికి ప్రపంచ రాజధానిగా గుర్తింపు వచ్చింది, మన అంతర్గత భద్రతకు ఇండియన్ ముజయిద్దిన్ లాంటి జిహాది సంస్థలు సవాల్ విసురుతూనే ఉన్నాయి, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణచివేయడంలో మన దేశ నాయకత్వం రష్యా అధ్యక్షుడు పుతీన్ ను ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది.' అని అన్నారు.
మూలం : విశ్వ సంవాద కేంద్రం - కర్ణాటక
మూలం : విశ్వ సంవాద కేంద్రం - కర్ణాటక
ఆదర్శవంతంగా ప్రజాస్వామ్యాన్ని నడపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి : రాం మాధవ్
Reviewed by JAGARANA
on
10:10 AM
Rating:
No comments: