మందిరానికి కేటాయించిన భూమిని తిరిగి ముస్లీం సంస్థకు అప్పజెప్పిన ప్రభుత్వం
హిందువుల మనోభావాలను గాయ పరుస్తున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం , కేవలం హిందూ రాష్ట్ర సాధన మాత్రమె ఈ విధమైన పరిస్థితికి సమాధానం ఇవ్వగలుగుతుంది - రాష్ట్ర చేతన
బెంగళూరు, కర్ణాటక, 28/03/2014 : ప్రసిద్ధ నాగ క్షేత్రంగా ఖ్యాతి గడించిన కుక్కే సుబ్రమణ్యం స్వామి మందిరానికి గతంలో బెంగళూరు అభివృద్ది ప్రదికరణం కేటాయించింది, మళ్ళి ఇప్పుడు అదే స్థలాన్ని 'యు టి నసీమా ఫరీద్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్' కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది, సమాచార హక్కు చట్టం క్రింద ప్రభుత్వానికి వచ్చిన ఉత్తరంతో ఈ విషయం బయటకి పొక్కింది, ఈ విషయమై స్థానిక హిందువుల మనోభావాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించకపోవడం తో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.
దేవాలయానికి వచ్చే భక్తులకు దేవాలయానికి చెందిన సమస్త సమాచారం, మరియు బెంగళూరు నగరానికి సంబందించిన సమాచారం అందించడం కోసం ఒక కార్యాలయానికి అవసరమైన 1695 చదరపు గజాల స్థలాన్ని ఇవ్వాలని దేవాలయ అభివృద్ది కమిటి ప్రభుత్వానికి తేది 30/01/2013 " కర్ణాటక హిందూ ధార్మిక సంస్థ 1997 " మరియు చారిటి చట్టాల క్రింద నాడు వినతి పత్రం అందించడం జరిగింది. మందిరం ఖాతా నుండి దానికి రూపాయలు 3,99,858 విలువ చెల్లించడం జరిగింది.
కాని తదుపరి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్థలాన్ని ఇప్పుడు ముస్లీం సంస్థకు కేటాయిస్తు ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది, ఈ విషయమై హిందువులు తీవ్ర ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు.
మూలం : దైనిక్ సనాతాన్ ప్రభాత్
మందిరానికి కేటాయించిన భూమిని తిరిగి ముస్లీం సంస్థకు అప్పజెప్పిన ప్రభుత్వం
Reviewed by JAGARANA
on
10:51 AM
Rating:
Every Hindu must oppose .
ReplyDelete