Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ముస్లీంల తీర్మానం: గోవును జాతీయ ప్రాణి గా గుర్తించి, గో-వధను నిషేదించాలి

ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మక్కా లో గత 1432 సంవత్సరాలుగా గో-వధ జరుగలేదు, గో-వధను రాజకీయ దృక్కోణంలో కాకుండా మనవ జాతి సంక్షేమం మరియు పర్యావరణ రక్షణ కోణంలో చూడాల్సిన అవసరం ఉందిదారుల్ - ఉలూమ్ - దేవ బంద్ కూడా అనేక సందర్భాలలో గో-వధను నిషేదిస్తూ ఫత్వాలు జరీ చేసింది - జనాబ్ మహమ్మద్ అఫ్జల్ (జాతీయ సంయోజకులు - ముస్లీం రాష్ట్రీయ మంచ్)
రాయపూర్ , 29/03/2014 : భారత ప్రభుత్వం గోవును జాతీయ ప్రాణిగా గుర్తించి దేశ వ్యాప్తంగా గోవధను పూర్తీ స్థాయిలో నిషేదించి తద్వారా పర్యవావరణ సమసౌల్యతను కాపాడాలని రాయపూర్లో ముస్లీం రాష్ట్రీయ మంచ్ అధ్వర్యంలో జరిగిన ' ముస్లీం గో రక్షా సమ్మేలన్ ' అనే సదస్సులో ముస్లీంలు తీర్మానించారు.

గో - రక్షణకు ముస్లీంలు ఇంత పెద్ద మొత్తంలో సమావేశమై గో-వధ కు వ్యతిరేకంగా తీర్మానం చేయడం దేశ చరిత్రలో ఇదే మొట్ట మొదటి సారి, సాధారంగా ముస్లీంలందరూ గో-వధను సమర్థిస్తారనే దేశంలో భావన నెలకొనివుంది కానీ ముస్లీం రాష్ట్రీయ మంచ్ చేసిన ఈ ప్రయత్నం ఒక చారిత్రాత్మక సంఘటన. తేది 25 - 26 మార్చ్ 2014 రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో పంజాబ్, డిల్లి, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘర్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, బిహార్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 200 మందికి పైగా గో-రక్షణకు సిద్దపడ్డ ముస్లీంలు పాల్గొన్నారు.
ఈ సమావేశాలలో ముస్లీం రాష్ట్రీయ మంచ్ సంరక్షకులు మాన్య శ్రీ ఇంద్రేష్ కుమార్ ఈ తీర్మానం పట్ల తన అభినందనలు వ్యక్తం చేస్తూ ' ఇలాంటి సదస్సు ప్రపంచంలోనే మొదటి సారిగా ఇక్కడ జరుగుతుండడం సంతోషాన్ని కలిగించే అంశం, 1857 దేశంలో మొదటి స్వాసంత్ర్య పోరాటం జరుగుతున్న సమయం లో బహదూర్ షా జాఫర్ అనే రాజు మొదటి సరిగా తన రాజ్యంలో గో-వధను నిషేదించారు, గో-వధ ను ఆపడం, గో-వంశ రక్షణకై జాతిపిత మహాత్మా గాంధి చూపిన కార్య నిబద్దతను ఈ సందర్భంలో మనం గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంది, కాని నేడు ఆ మహాత్ముని నిజమైన వారసులం అని చెప్పుకుతిరిగే వారు దగ్గరుండి గో-వధశాలలకు అనుమతులిస్తున్నారు' అని అన్నారు.
పాల్గొన్న ప్రతినిధులు 
మన దేశంలో జరుగుతున్న గో-వంశ హత్య పై సదస్సు తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది, వెంటనే గోహత్య ను దేశంలో పూర్త స్థాయిలో నిషేదించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, అధునాతన పద్దతిలో గో-హత్య కు అనుమతి ఇచ్చే యంత్ర ఆధారిత గో-వధశాలల  విధానం మంచిదికాదని సదస్సు అభిప్రాయపడింది.
గోవు విశ్వ మాత ప్రపంచంలోని అన్ని మతాలు ఈ కార్యంలో భాగస్వామ్యం కావాలని క్రైస్తవ, జుడా ఇసం, జైనులు, బౌద్దులు, తదితర మతాల పెద్దలను ఈ వేదిక ద్వార కోరుతున్నట్లు ముస్లీం రాష్ట్రీయ మంచ్ జాతీయ సంయోజకులు ( కన్వినర్ ) మహమ్మద్ అఫ్జల్ కోరారు. 
ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మక్కా లో గత 1432 సంవత్సరాలుగా గో-వధ జరుగలేదు, ఈ విషయాన్ని అందరు గుర్తించాల్సిన అవసరం ఉంది, ఈ అంశాన్ని రాజకీయ దృక్కోణంలో కాకుండా మనవ జాతి సంక్షేమం మరియు పర్యావరణ రక్షణ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది, దారుల్ - ఉలూమ్ - దేవ బంద్ కూడా అనేక సందర్భాలలో గో-వధను నిషేదిస్తూ ఫత్వాలు జరిచేసిందని ఆయన పేర్కొన్నారు.  
మూలం : న్యూస్ భారతి             
ముస్లీంల తీర్మానం: గోవును జాతీయ ప్రాణి గా గుర్తించి, గో-వధను నిషేదించాలి Reviewed by JAGARANA on 9:18 AM Rating: 5

1 comment:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.