హిందుత్వం ముస్లింలు కూడా హిందువుల్లాగే ఉండాలని కోరుకుంటుంది - రాం మాధవ్
ఈ దేశానికి ఆధార భూతమైన హిందువులను మరియు హిందూ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తే మాత్రం హిందువులు ఊరుకోరు. అలాంటి వారికి దేశ బహీష్కరణ తప్పదని గుర్తించాలి - రాష్ట్ర చేతన
వినాయక దామోదర సావర్కర్ చెప్పినట్టు హిందుత్వమే జాతీయవాదానికి ప్రతీక. అసుతోష్ వర్సినీ హిందుత్వానికి ఆధార భూతమైన 3 సిద్దాంతాలను సూచిస్తున్నారు. అవి :
1. హిందువులే ఆది వాసులు ఇంకా సూటిగ చెప్పాలంటే హిందువులే ఈ దేశానికి యజమానులు.
2. క్రైస్తవులు ప్రత్యేకించి ముస్లింలు ఈ దేశంతో చాల గాడమైన మరియు అనిశ్చిత సంబంధాన్ని కలిగి ఉన్నారు.
3. హిందూ ఐక్యతకు విఘాతం కల్గించే కుల విభాగాలు అలాగే కుల ఆధారిత రాజకీయాలు తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక్కడి అతి ప్రాచీన సంస్కృతి అయిన హిందూ సంస్కృతినే ఈ దేశానికి ఆధారం. ఈ ప్రాతిపదికన హిందువులకు ఒక ప్రత్యేక మతం మరియు పూజా పద్దతి అంటు ఏది లేదు. వారు వివిద రూపాల్లో ఈశ్వరుడిని పూజిస్తారు. వినాయక దామోదర సావర్కర్ తన పుస్తకంలో హిందూ అనే పదానికి చాల స్పష్టమైన అర్ధాన్ని ఇలా ఇచ్చారు :
‘సిందు నది పరివాసం నుండి హిందూ మహా సాగరం వరకు గల పవిత్ర నేల మీద జీవిస్తూ ఈ దేశం నా మాతృభూమి అనే భావనను కల్గి ఉన్నవారంత హిందువులే’.
ఇది ముఖ్యంగా ఈ దేశంలో జన్మించిన వారి యొక్క భావోద్వేగ బంధాన్ని తెలియచేస్తుంది. కాని సావర్కర్ ఎప్పుడు కూడా హిందువులు ఎక్కువ స్థాయివారు, ముస్లింలు తక్కువ స్థాయివారని చెప్పలేదు.
అతి ముఖ్యంగా భావించే హిందూ రాష్ట్ర ప్రణాళిక గురించి సావర్కర్ ఇలా అంటున్నారు : ఈ దేశంలో గల అల్ప సంఖ్యాకులకు వారి మతాన్ని అనుసరించే హక్కు వారికివ్వబడింది. దానికి హిందుత్వం ఏ మాత్రం ఆటంకం కాదు. కాని హిందూ దేశం మాత్రం ఇక్కడ మత ప్రాతిపదికన ఇంకో దేశం ఏర్పడితే మాత్రం ఎన్నటికీ ఒప్పుకోదు.
పూజనీయ గురు గోల్వాల్కర్(గురూజీ) 1971 లో సైఫుద్దీన్ జిలాని అనే ఇరాన్ పండితుడితో ఇలా అన్నారు : హిందువుల మత పరమైన నమ్మకం ఏమిటంటే ముస్లిం లు కూడా హిందువుల్లాగే ఉండాలని. అంటే కేవలం హిందువులు మాత్రమే దైవత్వానికి దగ్గరి వారు అని కాదు. ప్రతి ఒక్కరికి తమ దైవమును కొలిచే స్వేచ్చ కలదు. అందరూ పవిత్రంగా, ఎవరికీ హాని కల్గించకుండ ఉండాలనుకోవడం మా వైఖరి. ఇందులో మేమే ప్రత్యేకమైన వాళ్ళము అనే సందేహం ఎందుకు?
వర్సినీ పరోక్షంగా సావర్కర్ క్రైస్తవులు మరియు ముస్లింల గూర్చి చెప్పినట్లుగా ‘ భారత దేశం వారి మాతృభూమి కాదు. అదే వారిని ఈ దేశాన్ని విభజించేలా చూడాలని చూస్తుంది. వారికి ఈ దేశంపై ఏ మాత్రం భక్తి లేదు. దానితో భారతీయుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది’ అని హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ పవిత్ర భారత దేశంలో ఉంటున్న వారంతా కూడా ఈ దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలి అంతే కాని ఈ దేశంలో ఉంటూ పర దేశాలను పోగటడం, ఈ దేశానికి ఆధార భూతమైన హిందువులను మరియు హిందూ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తే మాత్రం హిందువులు ఊరుకోరు. అలాంటి వారికి దేశ బహీష్కరణ తప్పదని గుర్తించాలి.
మూలం : http://indianexpress.com/article/opinion/columns/what-hindutva-seeks/
హిందుత్వం ముస్లింలు కూడా హిందువుల్లాగే ఉండాలని కోరుకుంటుంది - రాం మాధవ్
Reviewed by JAGARANA
on
8:21 AM
Rating:
No comments: