Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

గోమాంసం తిని ఛావండి !


‘డబ్బా’లో ‘జబ్బు’, ఆంధ్రభూమి సంపాదకీయం , 27-10-2015


శుద్ధి చేసి డబ్బాలలోను గాలి దూరని సంచులలోను భద్రపరిచిన మాంసాన్ని నిరంతరం ఆరగించే వారు క్రమంగా కాన్సర్ వ్యాధిగ్రస్తులయ్యే ప్రమాదం ఉన్న శాస్ర్తియ ఆవిష్కరణ పాశ్చాత్య దేశాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సంచలన ప్రకంపనాలు మన దేశంలో కూడ విస్తరిస్తుండడం మాంసాహారులు జాగ్రత్త పడవలసిన మహా విషయం. ‘నమాంస భక్షణే దోషః’-మాంసాన్ని తినడంలో దోషం లేదు’ అన్నది మనదేశంలో సనాతన సంప్రదాయం. జనాభాలో అధికాధికులు మాంసం తింటుండడం యుగాలుగా తరాలుగా వ్యవస్థీకృతమై ఉన్న జీవన వాస్తవం. అందువల్లనే ‘జీవో జీవస్య జీవనం’-జీవుడికి జీవుడే ఆహారం’- అన్న నానుడి సైతం పుట్టుకొచ్చింది. కానీ మాంసం ఎలా తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? అన్న స్వయం నియంత్రణ హితభుక్కుల జీవన విధానమైంది. సంపదను ఆర్జించడం తాము అనుభవించడానికి మాత్రమేనన్న పాశ్చాత్య దేశాల స్వభావ ప్రభావంతో అంతర్జాతీయ సమాజం ఆవృతమై ఉండడం వర్తమాన వైపరీత్యం. అందువల్ల నిరంతరం దాదాపు ప్రతిరోజు మాంసం తినాలన్న పాశ్చాత్యుల, అభారతీయ ‘రీతి’-్ఫ్యషన్- మాంసాహారులను ఆవహించి ఉంది! ఇలా విశృంఖల మాంస భక్షణ చేయడంవల్ల అనేకానేక ఆరోగ్య వైపరీత్యాలు ప్రధానంగా గుండె జబ్బులు వస్తున్నాయని వైద్య శాస్తజ్ఞ్రులు ప్రపంచ వ్యాప్తంగా హెచ్చరించి ఉన్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’-వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్-హూ- ఆధ్వర్యవంలో జరిగిన పరిశోధనల ఫలితాలు మాంసాహారులకు మరిన్ని ప్రమాద ఘంటికలుగా పరిణమించాయి. శుద్ధి చేసి, ‘క్షారవంతం’-సాల్టెడ్- చేసిన డబ్బా ల మాంసం-ప్రాసెస్డ్ మీట్- ఎక్కువగా తినడంవల్ల క్రమం గా చిన్న ప్రేవు రక్తనాలలో ‘కార్సినోజెన్’ అన్న జీవరసాయనం పేరుకునిపోతుందట! ఎందుకంటే మాంసాలను ‘క్షారవంతం’-ఉప్పును కలపడం- చేయడానికి జరుగుతున్న ‘శుద్ధి’ ప్రక్రియలో ఈ ‘కార్సినోజెన్’ జీవ రసాయనం తయారు అవుతోందని పది దేశాలకు చెందిన వైద్య శాస్తవ్రేత్తలు శోధించి ఆవిష్కరించారట. ఈ ‘కార్సినోజెన్’ ‘కాన్సర్’ వ్యాధిని కలిగించే జీవ రసాయనం. అందువల్ల ‘డబ్బాల’-ప్యాక్డ్ మాంసాన్ని విరివిగా భోంచేయరాదని ‘హూ’ అధికారులు హెచ్చరించారు. ‘ఐక్య రాజ్య సమితి’ ఆరోగ్య సంస్థవారు చేసిన మరో నిర్ధారణ ‘ఆవుమాంసం’ వంటి ‘ఎర్ర మాంసం’-రెడ్ మీట్-తినడం వల్ల కూడ తిన్నవారు క్రమంగా కాన్సర్ రోగానికి గురి అవుతున్నారట. ఇతర పశువుల మాంసం శుద్ధికి గురి అయినప్పుడు మాత్రమే దాన్ని విరివిగా తినడం ప్రమాదకరం. కానీ ‘ఎర్రమాంసాన్ని’ తాజాగా ఉన్నప్పుడే విరివిగా తింటున్నవారు సైతం కాన్సర్ గ్రస్తులయ్యే ప్రమాదం ఉందన్నది ‘సమితి’ సంస్థ వారు తేల్చిన నిగ్గు...
ఆవు మాంసాన్ని కొన్ని ఇతర జంతువుల మాంసాన్ని కాని తినడంవల్ల మనదేశంలో గో సంతతికి కాని, జంతు సంతతికి కాని జరుగుతున్న ప్రమాదం తక్కువ. గోమాంసాన్ని, ఇతర మాంస ఖండాలను ‘డబ్బా’లలో భద్రపరిచి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల మాత్రమే దేశవాళీ ఆవులు, ఆవు సంతతి అంతరించిపోతోంది, ఇతర పశువులు కూడ విచక్షణ రహితమైన వధకు గురి అవుతున్నాయి. మాంసాన్ని కాని, ఇతర ఆహార పదార్ధాలను కాని శుద్ధి చేసి ఎండబెట్టి స్థానిక అవసరాలకోసం ఉపయోగించడం వేరు...కానీ భారీ ఎత్తున ఈ డబ్బాల తిండిని తయారుచేసి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు వివిధ దేశాలకు తరలించుకునిపోయే ప్రక్రియ సామాన్య ప్రజల నోరు కొడుతోంది. ఇలా ‘నోరుకొట్టే’ ప్రక్రియ ‘ప్రపంచీకరణ’ తరువాత మరింతగా ముదిరింది. సంపన్నులు సంవత్సరంలో ఎప్పుడైనా ఎక్కడైనా తినడానికి వీలుగా పండ్లను, ఇతర కూరగాయల ఆహారాలను, మాంస ఖండాలను శుద్ధి చేసి డబ్బాలలో నిల్వ చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏ ఋతువులోని పండ్లు ఆ ఋతువులోనే అమ్మనక్కరలేదు. ఫలితంగా ఆయా ఋతువులలో సామాన్య ప్రజలకు ఆ పండ్లు, కూరగాయలు సరసమైన ధరలకు లభించడం లేదు. సామాన్యుల నోరు కొట్టి ‘సంపన్నుల’కు నిరంతరం తినడానికి వీలుగా శాకాహారాన్ని, మాంసాహారాన్ని డబ్బాలలో నిల్వ చేస్తున్న పరిశ్రమల వారు వ్యాపారులు ‘ప్రపంచీకరణ’ ప్రచారకర్తలు...అందువల్ల ఈ ‘మాంసపు’ డబ్బాల వ్యాపారులు, ఉత్పత్తి దారులు ‘సమితి’ నిర్ధారణతో కలవరానికి గురి అవుతున్నారట! ఎందుకంటె కాన్సర్ వ్యాధి భయం కారణంగా డబ్బాల మాంసాన్ని, పచ్చిగా ఉన్న ‘ఎర్రమాంసాన్ని’ తినేవారి సంఖ్య తగ్గిపోతుంది. అంటే ‘డబ్బాల’ మాంసానికి, గోమాంసానికి గిరాకీ తగ్గిపోతుంది! గోపరిరక్షణకు, పశువుల పరిరక్షణకు ఈ ‘ఆవిష్కరణ’ దోహదం చేస్తుంది.

మన దేశంలో ఆవు మాంసం తినేవారి సంఖ్య జనాభాలో నాలుగు శాతం కంటె తక్కువన్నది సర్వేలలో నిగ్గుతేలిన నిజం. వీరిలో కూడ నియంత్రంగా వారానికో పదిరోజులకో తినేవారు ఒకటిన్నర శాతం కంటె తక్కువే. మిగిలిన వారు చాలా అరుదుగా మాత్రమే గోమాంస భక్షణ చేస్తున్నారు. అయినప్పటికి దశాబ్దుల తరబడి ఆవులను, కోడెలను, ఎద్దులను, దూడలను చంపి మాంసాన్ని డబ్బాలలో పెట్టి విదేశాలకు ఎగుమతి చేసారు. భారతదేశంలో పుట్టిపెరిగిన దేశవాళీ ఆవుల మాంసాన్ని విదేశీయులు ‘ఆబ’గా తినడంవల్లనే ప్రధానంగా గోసంతతి హరించుకునిపోయింది. అందు గోమాంసం ఎగుమతులను సంపూర్ణణంగా నిషేధించడం వల్ల వ్యవసాయానికి ఆయువుపట్టువంటి ‘ఆవు’నకు రక్షణ ఏర్పడుతుందన్నది నిగ్గుతేలిన నిజం. గోమాంసం-తాజాగాగానీ, డబ్బాల ద్వారా కాని తినడంవల్ల కాన్సర్ వ్యాధికి గురి కావడం ఖాయమని తేలింది! అందువల్ల ‘సమితి’ ఆధ్వర్యంలో పరిశోధించిన శాస్తవ్రేత్తలు కనిపెట్టిన వాస్తవం గోరక్షణకు దోహదం చేయగల మానవీయ పరిణామం! ఆర్థిక, ఔషధీయ, ధార్మిక, సాంస్కృతిక కారణాలు ప్రాతిపదిక గో సంతతిని పరిరక్షించడం అనివార్యమన్నది ఇప్పటివరకు కొనసాగిన ధ్యాస...కాన్సర్ భయంతో నైనా అధికాధికులు గోమాంస భక్షణకు ఇక స్వస్తిచెప్పక తప్పదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ‘ఆవిష్కరణ’ గురించి మన దేశంలో ప్రచారం చేసి జనంలో అవగాహన పెంచవలసిన బాధ్యత ప్రభుత్వాలది. గోవధను సంపూర్ణంగా నిరోధించడానికి, ఇతర పశువుల వధను విచక్షణాయుతంగా నియంత్రించడానికి దానివల్ల వీలు కలుగుతుంది!

‘విచక్షణ’ అనాదిగా భారతీయ జీవన స్వభావం. ‘న మాంస భక్షణే దోషః’ అన్న నిజాన్ని చెప్పిన శాస్తజ్ఞ్రులు ‘నివృత్త్యస్తు మహా ఫలాః’-తినకపోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని కూడ చెప్పారు. అందువల్ల ‘మాంసభక్షణ’ మన దేశంలో అప్పుడప్పుడు అనుభవించదగిన ‘్భగం’ అయింది. ఈ భోగాన్ని మాంసాహారులైన భారతీయులు ప్రతిరోజు అనుభవించలేదు, అనుభవించడం లేదు. అవకాశం ఉన్నవారు సైతం ప్రతిరోజు మాంసం తినకపోవడం శారీరక బౌద్ధిక ఆరోగ్య సంరక్షణలో భాగమైన సంప్రదాయమైంది...కానీ అవకాశం లభిస్తే భోగాన్ని రోజూ అనుభవించాలన్న పాశ్చాత్య జీవన విధానం రోగాన్ని సృష్టించింది. ‘డబ్బాల’ మాంసం, గోమాంసం తినడంవల్ల కాన్సర్‌కు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది!

గోమాంసం తిని ఛావండి ! Reviewed by rajakishor on 9:35 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.