భాగ్యనగర్ : చైనా దురహంకార వ్యుహలను అడ్డుకొవడం మన దేశానికి తక్షణ అవసరం - రాం మాధవ్
మన దేశస్తులు తాజమహల్ కట్టడానికి ఇచ్చిన ప్రాదాన్యం దేశ సరిహద్దుల మీద చూపించలేకపోయారు. 1950 లోనే మనం చైనాతో జగ్రత్తగా నడుచుకోవాలని పండిత్ నెహ్రు కు సర్దార్ పటేల్ హెచ్చరించినా కూడా పట్టించుకోలేదు. ఫలితంగా1962 లో మనం చైనా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.- శ్రీ రాం మాధవ్23/03/2014, భాగ్యనగర్ : హైదరాబాద్ ఉస్మానియా యునివర్సిటి లొని ఐయిటియి అడిటొరియం లొ తెది 22/03/2014 సాయంత్రం సొషల్ కాస్ అధ్వర్యంలొ జరిగిన ఒక సదస్సు లొ రాష్ట్రీయ స్వయం సెవక్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ రాం మధవ్ గారు తను రాసిన "అనీజి నైబర్స్" అనే పుస్తకం పై ప్రసంగించారు.
ప్రసంగం పూర్తి పాఠం :
కేవలం విద్యా నిపుణులు, మిలిటరీ నిపుణులు మరియు వ్యూహాత్మక నిపుణులే కాకుండా ఈ దేశ ప్రజలంతా కూడా దేశ సరిహద్దు దేశాల గురించి తెల్సుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పుస్తకం కేవలం దేశ సరిహద్దుల్ని గూర్చి, 50 ఏండ్ల క్రితం చైనాతో జరిగిన యుద్ధం గూర్చి మాత్రమే కాకుండా, మనమంతా మన సరిహద్దు దేశాల గూర్చి ఎందుకు తెల్సుకోవాలి? అన్ని దేశాల ఆలోచనలు ఒకే విదంగా ఉన్నాయా? మొదలగు విషయాలపై సమగ్రమైన అవగాహనను కల్గిస్తుంది.
భారత్ మరియు చైనాల మద్య వర్ణనా సంభందాలున్నాయి. మనం సాంస్కృతికంగా దాయాదులుగా ఉన్నాము. మనం చైనా విషయంలో ఎక్కడ వెనుక బడి ఉన్నామంటే అది ఆ దేశాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడంలోనే అని చెప్పవచ్చు.మనం మంచివాళ్ళము కావున మిగిలిన వారంతా కూడా మంచివాళ్ళే అనుకోవడం సరికాదు. నా ఉద్దేశ్యం చైనీయులు, చైనా చెడ్డ దేశం అని కాదు. అంతర్జాతీయ విషయాలు స్నేహపూర్వకమయినవి కావు మరియు అవి శాశ్వత ఆసక్తులు. ముందుగా మనకు మన శాశ్వత ఆసక్తుల మీద స్పష్టత ఉండాలి. అది ఎలా ఉండాలంటే అది మన జాతీయ ప్రయోజనాలకు అడ్డంకి కారాదు. కాని దురదృష్టవశాత్తు మన దేశంలో అలా జరగడం లేదు.
చైనాతో వాణిజ్య సంబంధం కల్గి ఉండటం మంచిదే. ఈరోజు చైనాతో మన వర్తకం విలువ అక్షరాల 70 బిలియన్ డాలర్లు. అయినా కూడా గత వారం మన వాణిజ్య శాఖ మంత్రి మేము సంతోషంగా లేమని చెప్పారు ఎందుకంటే అందులో 60 బిలియన్ డాలర్లు మనం దిగుమతి చేసుకుంటున్నాము. కేవలం 10 బిలియన్ డాలర్లు మాత్రమే ఎగుమతి చేస్తున్నాము. అందులోను మనం ఇనుప దాతులను ఎగుమతి చేస్తే చైనా మాత్రం మనకు ఇనుప ఊచలను ఎగుమతి చేస్తుంది. ఇది అసమమైన వర్తకము.అసలుసమస్య ఏమిటంటే చైనా ఆ దేశంలో మనల్నివర్తకం చేయనివ్వదు.
చైనావ్యూహాత్మక సంస్కృతి గల దేశం. ఉత్తర ద్వీపాల నుండి ప్రమాదం ఉందని తెలసి చాల పెద్ద గోడ (wall of china) ను నిర్మించుకుంది.అదే మన దేశాన్ని తీసుకుంటే మన మీద ఆక్రమణకు వచ్చిన వారంతా కూడా కైబర్ పర్వత మార్గం గుండా వచ్చిన వారే. మనం ఎందుకు ఆ ద్వారాన్ని మూసివేయాలని ఆలోచించలేదు?
మన దేశస్తులు తాజమహల్ కట్టడానికి ఇచ్చిన ప్రాదాన్యం దేశ సరిహద్దుల మీద చూపించలేకపోయారు. 1950 లోనే మనం చైనాతో జగ్రత్తగా నడుచుకోవాలని పండిత్ నెహ్రు కు సర్దార్ పటేల్ హెచ్చరించినా కూడా పట్టించుకోలేదు. ఫలితంగా1962 లో మనం చైనా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
1950 లో చైనా టిబెట్ ను ఆక్రమించడం ప్రారంబించిది. అనవసరమైన ఉత్తర కొరియా గూర్చి పార్లమెంటులో చర్చ చేపట్టిన నెహ్రుమన పక్క దేశమైన టిబెట్ ని పట్టించుకోలేదు.1962 ఓటమి మన అమాయకత్వానికి, చైనా వ్యుహత్మక సంస్కృతికి ప్రతీక. ఇప్పటికి 50 ఏండ్లు గడిచినా చైనా వైఖరి మాత్రం ఇంకా మారలేదు.
సరిహద్దు ఒక్కటే చైనాతో మనకు గల సంభందాన్ని నిర్ణయించదు. చైనాతో యుద్ధం తర్వాత 1986 లో రాజీవ్ గాంధీ చైనా పర్యటనకు వెళ్లారు. అప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లోని సిందోరాం లోయ చైనా ఆక్రమణలో ఉన్నది. అయిన ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు.1993 లో పి.వి. నరసింహ రావు చైనా కు వెళ్లారు. ఈ సారి ఒప్పందం ఏమిటంటే ఇరు దేశాలు 25 కిలోమీటర్ల మేర వెనక్కి పోవాలి. అంతకు ముందే చైనా మన దేశంలో చొచ్చుకొని వచ్చి కూర్చుంది. ఇదెక్కడి న్యాయం? 2003 లో అటల్ జీ ప్రదానిగా ఉన్నపుడు టిబెట్ చైనా అంతర్భాగమే కానీ అరుణాచల్ ప్రదేశ్ మాత్రం మాకే చెందాలని కోరినప్పుడు ఒప్పుకొని తిరిగి 2005 లోవివాదానికి మళ్ళీ తెరలేపింది. చైనా పని భారత్ పై నిరంతరం ఒత్తిడిని పెంచడం ఎందుకంటే రాబోయే రోజుల్లో భారత్ ఒక మహా దేశంగా అవతరించపోతున్నది కాబట్టి ఎలాగైనా దానికి అడ్డుకట్ట వేయాలనేదే చైనా వ్యూహం.కాబట్టి అందరూ తప్పక ఈ పుస్తకాన్ని చదివి మన సరిహద్దు దేశాల వ్యూహాత్మకతను సమర్దవంతంగా తిప్పికొడదాం.

పుస్తక ముఖ చిత్రం |
భాగ్యనగర్ : చైనా దురహంకార వ్యుహలను అడ్డుకొవడం మన దేశానికి తక్షణ అవసరం - రాం మాధవ్
Reviewed by JAGARANA
on
8:19 AM
Rating:
Communism is actually Kings rule it's a fact.
ReplyDelete