కర్నూల్ : క్రైస్తవ మత మార్పిడ్లను అడ్డుకోవడానికి సేవా, గిరిజన బస్తీలలో పర్యటిస్తాం - ధర్మాచార్యుల తీర్మానం
ధర్మాచార్యులు వారంలో ఒక రోజు తమ పరిధిలోని సేవా బస్తీలు, గిరిజన తండాల్లో పర్యటిస్తాం అని ప్రకటించడం శుభ పరిణామం - రాష్ట్ర చేతనకర్నూల్ , 24/03/2014 : విశ్వ హిందూ పరిషద్ ధర్మాచార్య సంపర్క విభాగం ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని విశ్వ హిందూ పరిషద్ కార్యాలయం లో జిల్లాలోని ధర్మాచార్యులతో సమావేశం జరిగింది, ఈ సమావేశానికి జిల్లాలోని అందరు ప్రముఖ ధర్మాచార్యులు హాజరయ్యారు, పరిషద్ జిల్లా అధ్యక్షులు శ్రీ సాయి రెడ్డి గారు ఈ సమావేశానికి అద్యక్షత వహించగా మాన్య శ్రీ గాళ్ రెడ్డి విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత కార్యదర్శి గారు దిశా నిర్దేశం చేసారు. ఈ సమావేశం జిల్లాలో జరుగుతున్న క్రైస్తవ మత మర్పిడ్ల పై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానంగా క్రైస్తవ మిషనరీలు దళితులను, గిరిజనులను లక్ష్యంగా చేసుకుని మత మర్పిడ్లకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడింది. కాగా ఇకముందు నుండి ధర్మాచార్యులు తమ పరిధిలోని సేవా బస్తీలు, గిరిజన తాండాలలో వారానికి ఓఅక రోజు పర్యటించాలని నిర్ణయం తీసుకుని తీర్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మాన్య శ్రీ గాళ్ రెడ్డి గారు మాట్లాడుతూ ' హిందూ ధర్మం లేనిదే ప్రపంచానికి శాంతి లేదు, వసుదైక కుటుంబకం లాండి ద్యేయ వాఖ్యన్ని పోలిన వాఖ్యం ఇంకే మతంలోనూ లేదు, హిందుత్వం లేని రోజున ప్రపంచంలో శాంతి అనే మాటకు అర్థమే ఉండదు, అలాంటి హిందుత్వానికి పెను సవాలుగా మారిన మత మర్పిడ్ల పై ధర్మాచార్యులు సమార శంఖం పూరించడం శుభ పరిణామం ' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ అశ్రామాలకు చెందిన ప్రముఖ స్వామీజీలు, మతాజిలు, పరిషద్ సంబాగ్ కార్యదర్శి శ్రీ సుబ్రమణ్యం గారు, జిల్లా కార్యదర్శి ప్రాణేష్ గారు, జిల్లా సహా కార్యదర్శి ప్రతాప్ గారు తదితరులు పాల్గొన్నారు.
కర్నూల్ : క్రైస్తవ మత మార్పిడ్లను అడ్డుకోవడానికి సేవా, గిరిజన బస్తీలలో పర్యటిస్తాం - ధర్మాచార్యుల తీర్మానం
Reviewed by JAGARANA
on
9:28 AM
Rating:
No comments: