బెంగళూరు: మార్చ్ 7 - 9 వరకు జరగనున్న RSS అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు
బెంగళూరు , 04/03/2014 : రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘ్ యొక్క విధాన రూపల్పన జరిగే అత్యుత్నత స్థాయి నిర్యాత్మక మండలి " అఖిల భారతీయ ప్రతినిధి సభ 2014 " సమావేశాలు బెంగళూరు లోని ' రాష్ట్రోత్తాన విద్యా కేంద్ర ' లో తేది 07-మార్చ్-2014 నుండి తేది 09-మార్చ్-2014 వరకు మూడు రోజుల పాటుగా జరగనున్నాయి.
దేశం నలుమూలల నుండి RSS శాఖల ద్వార ఎన్నికైన ప్రతినిధులు, ప్రాంత ( రాష్ట్ర ) స్థాయి బాధ్యత ఆ పై స్థాయి బాద్యత కలిగిన అధికారులు, దేశం లో వివిధ క్షేత్రాలలో పని చేస్తున్న సంఘ్ పరివార్ సంస్థల నుండి జాతీయ స్థాయి నాయకులు ఈ సమావేశాలకు హాజరౌతారు.
మార్చ్ 7 న మాన్య సర్ సంఘ్ చాలక్ మోహన్ జి భాగవత్ గారి జ్యోతి ప్రజ్వలన చే ప్రారంభమయ్యే ఈ సమావేశాలలో ఆయన తో పాటు మాన్య సర్ కార్యవాహ సురేష్ (భయ్యాజి) జ్యోషి మూడు రోజుల పాటు సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
రైతుల కోసం పని చేసే ' భారతీయ కిసాన్ సంఘ్ ', గిరిజనుల అభ్యున్న్తకి పాటుపడే ' వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ' , దేశం లోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ' అఖిల్ భారతీయ విద్యార్థి పరిషద్ ' , కర్షక , కార్మిక రంగంలో ప్రముఖ సంస్థ ' భారతీయ మజ్దూర్ సంఘ్ ' , ఆధ్యాత్మిక రంగంలో పనిచేసే ' విశ్వ హిందూ పరిషద్ ' , భారత దేశంలనే అతి పెద్ద రెండు ప్రముఖ రాజకీయ పార్టీలలో ఒకటైన ' భారతీయ జనతా పార్టి ' ల ప్రముఖ నాయకులు ఈ సమావేశాలకు హాజరుఅవుతున్నారు .
విద్యాభారతి, విజ్ఞాన భారతి, క్రీడా భారతి, సేవా భారతి, సంస్కృత భారతి, సంస్కార భారతి, లఘు ఉద్యోగ భారతి లాంటి సంస్థల నాయకులతో పాటుగా రాష్ట్ర సేవికా సమితి, స్వదేశీ జాగరణ్ మంచ్, దీన దయాళ్ సంశోదన సమితి, భారత్ వికాస్ పరిషద్, అఖిల భారతీయ శైక్షనిక్ మహా సంఘ్, ధర్మ జాగరణ సమితి ల జాతీయ స్థాయి నాయకులు ఈ సమావేశాలకు హాజరుతారు,
వీటితో పాటు అంధులలో ఉన్నతికై పనిచేసే " సక్షమా " , దేశం లోని సరిహద్దు జిల్లలో ప్రజలలో ఆత్మా విశ్వాసం నింపే " సీమ సురక్షా పరిషద్ " , పదవి విరమణ పొందిన సైనికుల కోసం పనిచేసే "పూర్వ సైనిక్ సేవ పరిషద్" ల ప్రతినిధులు ఈ కార్యక్రమం లో భాగమవ్వనున్నారు.
ప్రాంతాల వారిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిపై సమీక్షా మరియు ముఖ్య జాతీయ అంశాల పై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న సుమారు 1600 మంది సామాజిక కార్యకర్తలు ఈ సమావేశాలలో పాల్గొంటారు.
- ఈ సమావేశాల వార్తలు ఎప్పటికప్పుడు www.rastrachethana.net లో అందిచడం జరుగుతుంది.
బెంగళూరు: మార్చ్ 7 - 9 వరకు జరగనున్న RSS అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు
Reviewed by JAGARANA
on
10:41 AM
Rating:
No comments: