బంగ్లాదేశ్ : 'ఇస్లాంలోకి మారండి లేదా భారత్ కి వెళ్ళిపొండి' హెచ్చరిక - దేవాలయం పై దాడి - విగ్రహాలు ద్వంసం
డాకా , ఘాజిపూర్ , 01/03/2014 : గురువారం రోజున ఘాజిపూర్ లోని స్థానిక సార్భోజిని దేవి మందిరం పై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి దుర్గామాత, లక్ష్మి దేవి, గణేష్, కార్తికేయ విగ్రహాలను ద్వసం చేసారని ఈ విషయమై స్థానిక మందిర కార్యదర్శి పొలిసు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపాడని స్థానిక The Daily Star అనే ప్రముఖ దిన పత్రిక వార్తను ప్రచురించింది.
దుండగుల చేతిలో ద్వంసం అయిన విగ్రహాలు |
మందిర కార్యదర్శి సుర్జా మోహన్ సర్కార్ తమ పత్రికతో మాట్లాడుతూ " గురువారం రోజు రాత్రి 7:30 ప్రాంతంలో సాయుధులైన దుండగులు మందిరంలోకి ప్రవేశించి విగ్రహరధానను వదిలి వేయాలని లేని పక్షం లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ హిందూ దేవీ - దేవతల విగ్రహాలను ద్వసం చేసారు , ఇస్లాం లోని మారండి లేదా భారత్ కి వెళ్ళిపొండి లేకుంటే బాంబు దాడులు జరుపుతామంటూ ఒక హెచ్చరిక పత్రాన్ని వదిలి వెళ్ళారని " కథనం ప్రచురించింది.
హెచ్చరిక పత్రం |
Source : The Daily Star దిన పత్రిక
బంగ్లాదేశ్ : 'ఇస్లాంలోకి మారండి లేదా భారత్ కి వెళ్ళిపొండి' హెచ్చరిక - దేవాలయం పై దాడి - విగ్రహాలు ద్వంసం
Reviewed by JAGARANA
on
8:41 AM
Rating:
No comments: