రెడిఫ్ కథనం : భారత్ పై దాడి చేయడానికి సంసిద్దులైన 313 మంది ఉగ్రవాదులు
భారత భద్రతా సంస్థలు ప్రముఖ జిహాది గ్రుపులైన లష్కర్ - ఏ - తోయిబా మరియు ఇండియన్ ముజాయిద్దిన్ లాంటి వాటి కార్యకలాపాల పైన గట్టి నిఘా పెట్టినప్పటికీ భారత్ ను నాశనము చేయడానికి జైష్ - ఏ - మహామ్మాద్ లాంటి అనామక సంస్థలు పన్నాగాలు చేసే అవకాశం ఉంది - విక్కి నంజప్పా ( మాజీ సైన్యాధికారి )
28/02/2014, క్రొత్త డిల్లి : పాకిస్తాన్ ప్రేరిత జిహాది మూకలు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ పై ఉగ్ర దాడులు చేయడానికి దాదాపుగా 313 మంది తీవ్రవాదులను భారత్లోనే సిద్ధంగా ఉన్నట్లు రెడిఫ్ కథనాలు ప్రచురించింది, జైష్ - ఏ - మహమ్మద్ అదినేత మౌలానా మసూద్ ఆజాద్, పాకిస్తాన్ లోని ముజాఫర్బాద్ లో జరిగిన ఒక పదర్శన లో భావి సూచకంగా ఇలాంటి వాఖ్యలు చేసినట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో లోని ఒక అధికారి తమకు తెలిపినట్లు రెడిఫ్ ప్రచురించింది.
భారతీయ జనతా పార్టి ప్రధాని అభ్యర్థి శ్రీ నరేంద్ర మోడీ గారు తీవ్రవాదులు హిట్ లిస్టు లో ఉన్నట్లు ఇప్పటికే ఐబి ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి, 2003 లో జరిగిన ఉగ్రవాద దాడులకు ముఖ్య సూత్రధారిగా భావిస్తున్న మౌలానా మసూద్ కాందహార్ విమాన హైజాక్ ఘటనలో భారత్ విడుదల చేసిన ఉగ్రవాదులలో ఒకడు. ప్రస్తుతం భారత్ వెదుకుతున్న అతిముఖ్య ముద్దాయి, అమెరికా జైష్ - ఏ - మహమ్మద్ నిషేదించినప్పటికీ పాకిస్తాన్ లో పునరుజ్జీవనం చెంది ప్రస్తుతం లాహోర్ కేంద్రంగా పనిచేస్తూ ఉంది.
రెడిఫ్ కథనం : భారత్ పై దాడి చేయడానికి సంసిద్దులైన 313 మంది ఉగ్రవాదులు
Reviewed by JAGARANA
on
12:32 PM
Rating:
No comments: