Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

పాకిస్థాన్ : ల్యాండ్ మాఫియ చేతులలో ద్వంసమౌతున్న హిందూ దేవాలయాలు

27/02/2014 , ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో మైనారిటీలు అయిన హిందువులు అక్కడి ల్యాండ్ మాఫియా దురాగతాలను నుండి తమ మందిరాలు , మందిరాల భూములను రక్షించుకోవడానికి విఫల పోరాటం సాగిస్తున్నట్లు స్థానిక మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి . దేశ విభజన సమయంలోనే పాకిస్తాన్ లోని హిందువులు మందిరాలను, మందిరాల భూములను , ఆస్తులను , తమ ఆస్తి,పాస్తులను ఒదులుకుని కడుపు చేతులో పట్టుకుని భారతదేశానికి వలస వచ్చారు. మిగిలిన హిందువుల బ్రతుకు ఇప్పటికి దినదిన గండంగానే ఉంది.

స్థానిక ల్యాండ్ మాఫియ దృష్టి ఇలాంటి వాటిపై పడి అక్రమ ఆస్తి పత్రాలను స్థానిక అధికారుల వల్ల సృష్టించుకుని ఆక్రమణలను పాల్పడ్డాడు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన హిందువులపై దౌర్జన్యానికి ఒడిగట్టారు, అధికారులు, స్థానిక పొలిసు యంత్రాంగం దురాక్రమణ దారులకే వంతపాడడం అక్కడి వైచిత్ర్యం. 
ప్రతి దేవాలయం ల్యాండ్ మాఫియ చేతులలో ఆక్రమణలకు, విద్వంసాలకు గురౌతూనే ఉంది - కిరాట్పురా లో నివసిస్తున్న అమరనాథ్ ఆవేదన
నిస్సహాయ హిందూ సమాజం అక్రమార్కుల దౌర్జన్యాల నుండి మందిరాల రక్షణకు అనన్య సామాన్య పోరాటం సాగిస్తున్నప్పటికీ అది విఫల పోరాటంగానే మిగిలిపోతుంది, రావల్పిండి లో దాదాపుగా 5,000 మందికి పైగా హిందువులు నివాసం ఉంటున్నారు , వారికి అక్కడ ప్రస్తుతం ఒకే ఒక్క కృష్ణ మందిరం మాత్రమే మిగిలింది.
ప్రతి రోజు జరుగుతున్న పభుత్వ పరోక్ష ప్రేరిత విద్వంసాల నుండి మందిరాలను రక్షించుకోవడం అక్కడి హిందువులకు తలకుమించిన భారమే ఈ సందర్భంలో భారత ప్రభుత్వం ఈ విషయంలో జ్యోక్యం చేసుకోవాలని అక్కడి హిందువులు కోరుకుంటున్నారు. 

మూలం : హిందూ న్యూస్ నెట్వర్క్ 


పాకిస్థాన్ : ల్యాండ్ మాఫియ చేతులలో ద్వంసమౌతున్న హిందూ దేవాలయాలు Reviewed by JAGARANA on 9:36 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.