Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భాగ్యనగర్ : ముగిసిన సంఘ్ మాజీ సైనికుల క్షేత్రం ' అఖిల్ భారతీయ పూర్వసైనిక్ సేవా పరిషద్' 16 జాతీయ కార్యవర్గ సమావేశాలు

భాగ్యనగర్ , 25/02/2014 : ' అఖిల భారతీయ పూర్వ సైనిక్ సేవా పరిషద్ (ABPSSP)' రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయవాద ప్రేరణతో భారత దేశ సైన్యంలో పని చేసి పదవివిరమణ పొందిన సైనికులు ఏర్పాటు చేసుకున్న సంస్థ. ఈ సంస్థ యొక్క 16 వ జాతీయ కార్యవర్గ సమావేశాలు తేది 21 - Feb - 2014 నుండి 23 - Feb - 2014 వరకు భాగ్యనగర్ ( హైదరాబాద్) లోని శ్రీ సరస్వతి విద్యాపీఠం బండ్లగూడ లో జరిగాయి.

దేశం కోసం అవసరమైనతే ప్రాణత్యాగానికి సిద్ధపడి సైన్యంలో చేరాం - ఇప్పుడు శేష జీవితం అంతా ఈ దేశం కోసం బ్రతుకుదాం అంటూ మాజీ లెఫ్ట్నెంట్ జనరల్ MA జాకి గారు చేసిన ఉద్ఘాటన కార్యక్రమ ప్రసంగం మాజీ సైనికుల హృదయంతరాలను స్పృశించింది , ఈ సంస్థ మార్గదర్శకులు ప్రముఖ సంఘ్ ప్రచారక్ మాన్య శ్రీ ఇంద్రేష్ జి మూడు రోజుల పాటు సమావేశాలలో ఉన్నారు.
చివరిరోజు మాన్య ఇంద్రేష్ జి మార్గదర్శనం చేస్తూ ' ప్రస్తుత ప్రభుత్వం మాజీ సైనికుల పట్ల కనీస కృతజ్ఞతా భావాన్ని కూడా కలిగిలేదు , ఈ దేశం కోసం ఉగ్రవాద దాడులలో అమరులైన సైనికుల కుటుంబాలను ఓదార్చే తీరికా ఈ నాయకులకు లేదు, చావడం కోసమే సైన్యంలో చేరుతారు అంటూ బహిరంగంగా ప్రకటించే రాజకీయ  నాయకులు ఈ దేశానికి నాయకత్వం వహించడం ఈ దేశం చేసుకున్న దురదృష్టం , సైన్యం పట్ల దేశ ప్రజలలో ఆరాధన భావం వుంది , కాని ఈ నాయకులలో సైన్యం పట్ల నిర్లిప్తత ఉంది , ఈ నాయకత్వం మారాలి దృడమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు ఈ దేశానికి కావాలి , సైన్యాన్ని కాళ్ళు చేతులు కట్టి యుద్ద మైదానంలోకి పంపే నాయకత్వం కాదు , పూర్తీ స్వేచ్చ తో వదిలే నాయకత్వం కావాలి , ఈ ఎన్నికలలో అలాంటి నాయకత్వం కోసం ప్రజలను చైతన్య వంతం చేయడం మన అందరి బాధ్యత ' అని అన్నారు .

కార్యక్రమ ముగింపులో అమరులైన సైనికుల కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం ఆద్యంతం ఉద్విగ్న భరితంగా సాగింది .        
భాగ్యనగర్ : ముగిసిన సంఘ్ మాజీ సైనికుల క్షేత్రం ' అఖిల్ భారతీయ పూర్వసైనిక్ సేవా పరిషద్' 16 జాతీయ కార్యవర్గ సమావేశాలు Reviewed by JAGARANA on 9:45 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.