గీథ్ : ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను
Download |
ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను
నా తల్లి వైభవము ఎలుగెత్తి చాటెదను
నా ధర్మ జ్యోతి నల్వైపులా చూపెదను ||
ఉత్తుంగ హిమశృంగ ఔన్నత్యమది నాది
హిందు సంద్రమె నాదు గాంభీర్య చిహ్నంబు
పావన జాహ్నవీ సమమె నా జీవితము
ఈ నేల అణువణువు తెలుపు నా సచ్చరిత ||
సేతువు హిమగిరియు ఒక్కటె నాకెపుడు
ముక్కోటి దేవతలు మోక్ష ప్రదాతలే
ప్రతి హైందవుడు నాదు సోదరుడె సోదరుడె
జాతి మనుగడ కొరకె జీవితమునర్పింతు ||
భావ దాస్యము నాకు ఏ కోశమున లేదు
ప్రతి రక్త నాళమున ప్రవహించు శౌర్యమె
అపజయా శంక నా సాంప్రదాయమే కాదు
వెనుకంజయే లేదు విజయమే నా సొత్తు ||
గీథ్ : ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను
Reviewed by JAGARANA
on
9:30 AM
Rating:
No comments: