Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సూరత్ : ప్రారంభమైన విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ పాలక మండలి సమావేశాలు


  • వచ్చే ఎన్నికల్లో ఎ పార్టి ప్రభుత్వం వచ్చిన అయోధ్య లో శ్రీ రామ మందిరం నిర్మిచాల్సిందే - ప్రవీణ్ తొగాడియ 
  • స్వర్ణోత్సవాల సందర్భంలో దేశ వ్యాప్తంగా లక్ష యాభై వేల గ్రామాలో పరిషత్ సమితుల నిర్మాణానికి నిర్ణయం 

సూరత్ , గుజరాత్ 31/12/2013 : విశ్వ హిందూ పరిషద్ లో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన  అంతర్జాతీయ పాలక మండలి ఐదు రోజుల పాటు నిర్వహించే సమావేశాలు తేది 31/12/2013 న గుజరాత్ రాష్ట్రము లోని సూరత్ నగరం లో ప్రాపంభమయ్యాయి.  ప్రముఖ భాగవత ప్రవచనకారులు పూజ్య శ్రీ రమేష్ భాయి ఓజా మరియు స్వామి నారాయణ మందిరం యొక్క సంతు శ్రీ నౌతం జి మహారాజ్, మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గార్ల దివ్య జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఉద్గాటన జరిగింది .
ప్రస్తుత ప్రభుత్వం హిందూ ఆధ్యాత్మిక వేత్తలు , సాధు సంతులు లను లక్ష్యంగా చేసుకుని మైనారిటి సంతుస్టికరణ చేసి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంది - పూజ్య రమేష్ భాయి ఓజా 
సాధువుల అశిః ప్రసంగం అనంతరం మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియ మార్గదర్శం చేస్తూ ' నేడు దేశం లో ఏ హిందువు సురక్షితంగా లేదు , అనునిత్యం దేశంలో లోని ఎదో ఒక చోట హిందువుల పై దాడులు జరిగుతూనే ఉన్నాయి , ముజఫర్ నగర్ లాంటి సంఘటనలు సర్వ సాధారణం అయ్యాయి , కాశ్మీర్ అస్సాం లాంటి హిందూ జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితి మరీ విషమంగా ఉంది , ఈ దేశంలో హిందువుల రక్షణ విషయంలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. వచ్చే విశ్వ హిందూ పరిషద్ స్వర్ణోత్సవ ఉత్సవాలలో దేశం లోని లక్ష యాభై వేల గ్రామాలలో విశ్వ హిందూ పరిషద్ , భజరంగ్ దళ్ , దుర్గావహిని సమితులను ఏర్పాటు చేసి తద్వారా ఈ జాతి వ్యతిరేక శక్తులకు గట్టి సమాదానం చెప్పాల్సి ఉంది ఆ దిశలో మనమందరం కలసి పనిచేద్దాం అని ఆశిస్తున్నాను ' అని అన్నారు.



ఈ సమావేశాలలో విశ్వ హిందూ పరిషద్ కార్యధ్యక్షులు ( విదేశీ విభాగం ) మాయ శ్రీ అశోక్ రావు చంగ్లె , విహిప అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్య శ్రీ చంపత రాయ్ లతో పాటు పరిషత్ పదాదికారులు హాజరయ్యారు .

సూరత్ : ప్రారంభమైన విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ పాలక మండలి సమావేశాలు Reviewed by JAGARANA on 9:02 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.