Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

గీథ్ : పాడుదాం పాడుదాం భారతి జయ గీతం

Download

పాడుదాం పాడుదాం భారతి జయ గీతం
వాడిపోని వైభవాల పావన సంగీతం

వేద శారదాంబ వేలు శృతి చేసిన వల్లకీ
సకల విశ్వ శ్రేయమె స్వర సంచారము దీనికి
పరమ పదము పదమైనది ఈ పవిత్ర గీతికి
యోగరాగమీగానం ఆగదు ఏ యుగానికి

ప్రతి పురుగు ఈ పుడమిని పలుకును ఆ ప్రణవమే
ఈ దేశపు దేహం ప్రత్యణువు ఆ గానమే
తలలూచే తరులన్నీ విరబూచే విరులన్నీ
పడిలేచే అలలన్నీ పాడును ఆ గానమే

ఈ పొలాల పంట సిరుల తరగని శ్రీ రాగం
ఈ కోనల నాగుల బుస శంకరాభరణం
ఈ చందన శీతల పవనాలలోని హిందోళం
ఈ సుందర కాననాల కళ్యాణి గమనం
ప్రళయ ప్రభంజనమిచ్చట శివరంజని గా
ప్రతి ప్రభాత భూపాళం శుభ సూచనగా
గీథ్ : పాడుదాం పాడుదాం భారతి జయ గీతం Reviewed by JAGARANA on 9:00 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.