హిందూ సమాజ సంఘటిత శక్తికి విశ్వంలో తిరుగే లేదు : RSS చీఫ్ మోహన్ జి భాగవత్
కురుక్షేత్రం సంగ్రామం మధ్యలో శ్రీ కృష్ణుని విశ్వరూపం స్పూర్తితో నేడు సంఘటిత హిందూ సమాజం ప్రపంచ శాంతి కోసం తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది, ఈ దైవీ శక్తి ని ఎదుర్కునే సాహసం ఏ విధర్మియ శక్తులకు లేదు - మోహన్ జి భాగవత్
సూరత్, గుజరాత్ 18/08/2015 : గుజరాత్ రాష్ట్రము లో ని సూరత్ లో ' శుభమంగల్ ఫౌండేషన్ ' అధ్వర్యంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ జైన సాధువు అభయ్ దైవసురిస్వర్ జి సహబ్ మరియు జైన సమాజ మార్గదర్శులైన సంతులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ గారికి బంగారు పూతతో కూడిన అక్షరాలతో రాయబడిన భవద్గీత ను భాహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా మోహన్ జి భాగవత్ మాట్లాడుతూ " మానవజీవితం లో అత్యున్నత జీవన విధానం యొక్క మార్గదర్శి అయిన భవద్గీత లాంటి గ్రంధ రాజాలలో ఉన్న ఆదర్శాలను మన నిత్య జీవితంలో ఆచరణాత్మకంగా ఉపయోగించనంత వరకు ఆ అద్భుతాన్ని మనం అనుభవంలోకి తీసుకోలేం. కురుక్షేత్ర సంరమంలో అర్జునిడుకి భగవద్గీతను అర్థం చేయించడానికి శ్రీ కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపాల్సి వచ్చింది, అలాగే ఈ రోజు సంఘటనాత్మక హిందూ సమాజ శక్తి తన విశ్వ రూప సందర్శనం ప్రపంచానికి చేస్తుంది, కాబట్టే విశ్వ శాంతికై ప్రపంచం అంతా హిందూ దర్మం వైపే చూస్తూ ఉంది " అని అన్నారు.
హిందూ సమాజ సంఘటిత శక్తికి విశ్వంలో తిరుగే లేదు : RSS చీఫ్ మోహన్ జి భాగవత్
Reviewed by JAGARANA
on
12:17 PM
Rating:

Post Comment
No comments: