Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

దాద్రి ఘటనపై మీడియా పాపమెంత?

ఎస్.ఆర్. రామానుజన్, ఆంధ్రభూమి దినపత్రిక, అక్టోబర్ 6, 2015

గ్రేటర్ నోయ్‌డా సమీపంలోని దాద్రి లో జరిగిన సంఘటన ఏవిధంగా చూసినా గర్హనీయమే. పవిత్రమైన బక్రీద్ పండుగ రోజున ఆవును చంపాడన్న ఆరోపణతో ఒక వ్యక్తిని హత్యచేయడం కూడని పని. జనాగ్రహం అనేది ఎన్నడూ ఒక తర్కం లేదా కారణం లేదా చట్టానికి లోబడి ఉండదు. అయితే ఆకస్మికంగా చెలరేగిన అల్లర్ల వెనుక కుట్రను మాత్రం నిర్ద్వంద్వంగా ఖండించి తీరాల్సిందే. కేవలం ఒక ప్రార్థనాస్థలం నుంచి వెలువడినట్టుగా చెబుతున్న ప్రకటన తర్వాత గ్రామ ప్రజల్లో ఉవ్వెత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తడానికి బాధ్య త ఎవరిది అనే యుక్తమైన ప్రశ్నను మనం ఈ సందర్భంగా వేసుకోవాలి. ఢిల్లీ మీడి యా వారి ‘లిబరల్’ పోషకులు మాత్రం.. 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన న రేంద్ర మోదీ మద్దతుదారులు, ఆర్‌ఎస్‌ఎస్, భాజపాలు మతోద్రేకాలు రెచ్చగొట్టిన పుణ్యమే ఈ దారుణానికి కారణమని చెబుతున్నారు. ఎవరికీ అసలు సమస్యను, దాని వెనకాల చరిత్రను విశ్లేషించే ఓపిక, తీరిక లేవు.


మోదీ పక్షపాతి. ఆయన నేతృత్వం దేశం లో చీలికలు సంభవించడం తథ్యం. ముఖ్యంగా కఠినమైన తిరోగామి మనస్తత్వం దేశానికి ఈ దుస్ధితిని దాపురింపజేస్తుందని మీడియా, లిబరల్ పోషకులు ముక్తకంఠంతో ఘోష పెడుతున్నారు. ఇక వామపక్ష తీవ్రవాద లిబరల్ ఒకరు విషం చిమ్ముతూ ఈవిధంగా ట్వీట్ చేశాడు,‘‘మనం నేరుగా విషయంలోకి వద్దాం. దాద్రి బాధితుడు ఆ వుమాంసం తిన్నాడన్న కారణంగా కొట్టి చంపలేదు. కేవలం ‘మోడీ ఇండియా’లో ముస్లిం అన్న కారణంగా మాత్రమే ఈ దారుణానికి ఒడిగట్టారు. 

ఇక ‘ఆగ్నెస్ ఆఫ్ గాడ్’ అనే నాటకం.. పెళ్లికాకుండానే తల్లి అయన ఒక సన్యాసినికి చెందిన వాస్తవ కథనం. ఈ నాటకం ఇంకా ప్రదర్శించకముందే దాన్ని నిషేధించారు. ఎందుకంటే క్రైస్తవుల భావోద్వేగాలను దెబ్బతీస్తుందని బిషప్‌లు భావించడమే అందుకు కారణం. అదే గోహత్యలను సమర్థించడం, కొన్ని వేలమంది హిందువులను సామూహిక హత్యాకాండకు పాల్పడిన టిప్పు సుల్తాన్, ఔరంగజేబ్‌లను ఆకాశానికెత్తేయడం ద్వారా మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే తప్పులేదు. ఇదీ మన బ్రాం డ్ సెక్యులరిజం.

ఏడాది క్రితం చర్చిల విధ్వంసం జరిగిన దగ్గరినుంచి మీడియాలో ఈ రకమైన త ప్పుడు ప్రచారం మొదలైంది. సహజంగానే ఈ దుష్ప్రచారం ఎన్నికల్లో చర్చి నరేంద్ర మోదీకి వ్యతిరేక ప్రచార ప్రణాళికను రూపొందించుకోవడానికి దారితీసింది. ఇక్కడ అసలు నిజం బయటకు రాకముందే అబద్ధం పూర్తి ప్రచారం పొందింది. తాను చేసిన తప్పుడు ప్రచారానికి మీడియాలో ఏ కొంచెం పశ్చాత్తాపం వ్యక్తం కావడంలేదు. తన తీర్పరితనానికి, ఉన్మత్త రిపోర్టింగ్‌తో తప్పుదోవ పట్టించినందుకు కనీసం వీక్షకులకు క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రస్తుత వ్యవస్థలో మైనారిటీలు ఏమాత్రం సురక్షితంగా లేరన్న భావన మాత్రమే ఇంకా కొనసాగుతోంది.

ఇక దీని తర్వాత మీడియా దృష్టి ‘ఘర్ వాపసీ’పై పడింది. అదేంటో మనదేశంలో కొత్తగా ప్రవేశపెట్టినట్టు! క్రూరమైన ఈ మతమార్పిడుల కారణంగా దేశంలోని మెజారిటీ జనాభా శతాబ్దాలుగా నానా హిం సలకు గురవుతున్నారు. భయపెట్టో లేక ప్రలోభపెట్టో మతాన్ని మార్చినప్పుడు తిరిగి స్వమతంలోకి మార్చే ప్రతిక్రియ స హజంగానే ఉంటుంది. స్వామి లక్ష్మణానంద సరస్వతి తన జీవితమంతా ఒడిశాలోని గిరిజనుల సంక్షేమం కోసమే ధారబోసి పెద్ద మూల్యమే చెల్లించారు. ఇప్పుడు మనం మన రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుకుందాం. మరి ఈ పురోగాములెవ్వరూ సరస్వతి హక్కుల గురించి పోరాడలేదు. ‘పావు’ మాత్రం హింసకులకు అనుకూలంగానే పడింది. 

ప్రతి ఒక్కరూ రాజ్యాంగ బద్ధులై ఉండాలని మాత్రం చెప్పడం నేడు పరిపాటైపోయింది. అంటే అది వస్తధ్రారణ లేదా తినడం లేదా తాగడం లేదా ఎక్కడ పడుకోవాలి, ఎవరితో పడుకోవాలి లేదా పోర్న్ సైట్ల వీక్షణ లేదా యువతులపై బహిరంగంగా తమ ఆకర్షణను ప్రదర్శించడం వంటివి ఏవైనా కావచ్చు. ప్రతి ఒక్కటీ రా జ్యాంగ హక్కు మాత్రమే. అందుకు తక్కువ ఏదీ కాదు. అన్ని రకాల రాజ్యాంగపరమైన హక్కులకు ‘సముచితమైన పరిమితి’ అనే మాట నేడు అణచివేతగాను, రాజకీయంగా తప్పుగాను కనిపిస్తోంది.

ఇప్పుడు గోమాంస నిషేధానికి వద్దాం. దశాబ్దులుగా జైనమతస్థుల పర్వదినం నాడు గోమాసం అమ్మకాల నిషేధం అమల్లో ఉన్నదన్న సత్యాన్ని మీడియా తొక్కిపెట్టింది. మోదీ ప్రభుత్వం మాత్రమే ఈ తాత్కాలిక నిషేధానికి కారణమని, మోదీ మతతత్వ మనస్తత్వంతో మైనారిటీలు (ముస్లింలు) హింసలకు గురవుతున్నారని మీడియా మొత్తం ఏకంగా ప్రచారం చేసింది. ‘‘ప్రభుత్వం పౌరుల వంటగదిలోకి ఏవిధంగా ప్రవేశిస్తుంది? మనమేం తినాలనేది ఎలా నిర్దేశిస్తుంది?’’..ఇదీ ఇంగ్లీషు మీడియా, చర్చల్లో, తమ పేజీల్లో విపరీతంగా చర్చించిన అంశం. అసలు జైనుల పర్వదినం నాడు మాంసం భుజించడంపై ఏవిధమైన నిషేధం లేదని, కాకపోతే కేవలం జంతువధపై మాత్రమే నిషేధం అమల్లో ఉన్నదన్న అసలు సత్యాన్ని ప్రజలకు తెలియజెప్పినవారే లేరు. ఈ నిషేధం దేశంలోని ఒక మతవర్గం వారి మనో భావాలను దెబ్బకొట్టడమేనని మాత్రం విపరీతంగా ప్రచారం చేశారు.

ఒక మూర్ఖపు నమ్మకంతోపాటు మీడి యా చేసిన తీవ్రస్థాయి రిపోర్టింగ్ లేదా తీర్పరితనం...దేశంలోని ప్రధాన రాజకీయపక్షం కేవలం మైనారిటీల పక్షానే ఉండాలని, మెజారిటీ ప్రజలు మైనారిటీలకు తాబేదార్లుగా వ్యవహరించాలన్న వాతావరణాన్ని సృష్టించింది. దీనివల్ల అతి చిన్న అంశాలు కూడా విస్ఫోటం చెందే స్థాయికి చేరుకున్నాయి. ముగ్గురు హేతువాదులను అతి దారుణంగా హత్యచేసిన ఉందంతాన్ని మీడియా రిపోర్ట్ చేసిన తీరు పరికించండి. కనీసం తాము రాస్తున్న రాతలు మెజారిటీ మతస్థుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయన్న అంశాన్ని కూడా పట్టించుకోలేదు. హేతువాదం పేరుతో మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వీరి ప్రాథమిక హక్కా? ఇది హింసను,హత్యాకాండను సమర్ధించడం కాదు. అంతకంటె చాలా దూరం. ఫ్రెంచ్ కార్టూనిస్టులు మతపరమైన మనోభావాల విషయంలో కొంత సంయమనం పాటించి ఉండాల్సిందంటూ అప్పట్లో మీడియా, లిబరల్స్ వాదించారు. మరి ఇప్పుడు వీరు పెడుతున్న గగ్గోలు దానికి పూర్తి విరుద్ధం అని చెప్పడానికే పై ఉదాహరణ. 

తమిళనాడులో ఎనిమిది మంది హిందూ మున్నానీ (హిందూవాహిని) నాయకులను దారుణంగా హత్య చేసినప్పుడు మీడియానోటి వెంట ఒక్క మాట కూడా పెగల్లేదేం? బహిరంగంగా రెండు నాలుకలతో మాట్లాడడం వల్ల మెజారిటీ ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలుగదా మరి. 

మీడియా బుద్ధిలేని వ్యవహారశైలే దాద్రి సంఘటనలో వెల్లడైంది. మీడియా ఏ దశలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు.

గోహత్యను వ్యతిరేకిస్తూ దేశ వాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం కేవలం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంగా మాత్రమే ఊపందుకున్నదంటూ ప్రచారం చేయడంపైనే మీడియా దృష్టి కేంద్రీకరించింది. ఇక ‘గేదె’గా ప్రఖ్యాతుడైన అజామ్‌ఖాన్ మరింత ముందుకెళ్లి 2016 ఎన్నికలకు ముందు ఉత్తర ప్రదేశ్‌లో ముస్లింలందరినీ మోదీ హతమారుస్తాడంటూ విపరీత ప్రచారానికి దిగాడు. ఇక అసదుద్దీన్ ఒవైసీ అయితే...కేవలం ముస్లిం అయినందువల్లనే దాద్రి సంఘటనలో బాధితుడు హత్యకు గురయ్యాడంటూ మరో విపరీత వ్యాఖ్యానానికి తెరలేపాడు. కేవలం గోమాంస భక్షణ చేసినందుకు మాత్రమే అతగాడిని హతమార్చారనేది మీడి యా ‘ట్విస్ట్’.

హిందువులు అధిక సంఖ్యలో ఉన్న సమాజంలో జంతువులకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులుంటాయంటూ కొందరు లిబరల్స్ ఎగతాళి! వారు రాజ్యాంగ సభ, న్యాయ వ్యవస్థల వివేచనను కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్లారు. గోహత్యపై ఆ రెండు సంస్థలది వంచన మాత్రమేననేది వారి వాదన. తమ ఆర్థికపరమైన వాదనతో ‘హేతుబద్ధత అనే ముసుగులో మతపరమైన మనోభావాలకు వేషధారణ చేయడం’ వీరు పైరెండు సంస్థలను నిర్లక్ష్యంగా పక్కనపెట్టడం వెనుక దాగివున్న అసలు వాస్తవం.

గోహత్యను భాజపా ప్రభుత్వం ముంగిటికి తీసుకెళ్లడం హాస్యాస్పదం. 20,30 ఏళ్ల వయసున్న టెలివిజన్ యాంకర్లకు 1966 నాటి గోహత్యలకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళన గురించి అసలు తెలియనే తెలియదు. అప్పట్లో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండేవారు. హోంశాఖను గుల్జారీలాల్ నందా నిర్వహించారు. 1966, నవంబర్ 7న ఢిల్లీలో 10వేల మంది సాధువులు, గోవధను నిషేధించాలని కోరుతూ పార్లమెంట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులో ఆరుగురు సాధువులు అసువులు బాసారు. ఈ సంఘటన ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నకాలంలోనే జరిగింది. నందా గోవధపై చాలా శ్రద్ధ చూపడంతో ఆయన్ను హోంమంత్రి పదవి నుంచి ఇందిర బర్తరఫ్ చేశారు.

బ్రిటిష్ పాలకులపై జరిగిన 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ జారీ చేసిన మొట్టమొదటి ఫర్మానా గొహత్యా నిషేధానికి సంబంధించినదే. భారతదేశంలో మతవిశ్వాసాలతో సంబంధం లేకుండా అందరు పాలకులూ గోహత్యను నిషేధించారన్నది చారిత్రిక వాస్తవం. అయితే ఈ వాస్తవాన్ని బ్రిటిష్ వారు దాచిపెట్టేసేరు. హిందూముస్లింల మధ్య గొడవలు పెట్టి అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన కదా. పోర్చుగీసు వారి నుండి బ్రిటిష్ వారి వరకు మన దేశాన్ని ఆక్రమించుకున్న ఐరోపా దేశీయులు ఎద్దు మాంసాన్ని ఎక్కువగా తింటారు. భారత్ పై పాలనాధికారాన్ని చేజిక్కించుకున్న బ్రిటిష్ వారు గొహత్యా నిషేధాన్ని ఎత్తివేసి గోవు లేదా ఎద్దు మాంసాన్ని భుజించడం మైనారిటీ మతస్థుల అభీష్టంగా ప్రచారం చేసేరు. 

గోవధ నిషేధాన్ని ముస్లింలు సమర్థిస్తే..ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతిస్తామని అప్పట్లో హిందువులు స్పష్టం చేశారు కూడా. 

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారెవరూ దీన్ని అసలు ప్రస్తావించరు. గోవధ నిషేధించిన కొన్ని రాష్ట్రాల గురించి రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెప్పవు. 

మనకు అవసరమైనప్పుడల్లా గాంధీ మహాత్ముని కొటేషన్లను ప్రస్తావిస్తుంటాం. కానీ గోహత్యపై ఆయన అభిప్రాయాన్ని గౌరవించం. 

గోవు మతపరంగా పవిత్రమైనది మాత్రమే కాదు, సౌభాగ్యాలను కలిగించేదన్నది విశ్వాసం. మరి ఎవరైనా దేశంలోని మెజారిటీ ప్రజల విశ్వాసాలను గౌరవించాలని ముస్లింలకు చెప్పారా? లేదు. 

దాద్రి వంటి సంఘటనలు జరగడానికి ఇదే ప్రధాన కారణం. మీడియా, లిబరల్స్ తమ వక్రీకరణల ద్వారా అనుదినం మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టే తమ తప్పుడు వైఖరినుంచి బయటపడలేకపోతున్నది.

దాద్రి ఘటనపై మీడియా పాపమెంత? Reviewed by rajakishor on 8:18 AM Rating: 5

1 comment:

  1. అదే ఆ గో మాసం తిన్నవాడు ఒక హిందువు ఐతే ఇలాగే కొట్టి చంపేవాళ్ళా?

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.