జిహాది మూకకు సమాదానంగా ప్రారంభమైన VHP బూడ అమరనాథ్ యాత్ర
- పాక్ ప్రేరేపిత జిహాది మూక హెచ్చరికలకు సమాదానం గా ప్రారంభమైన యాత్ర
- సాహసోపేతమైన, దుర్భర పరిస్థితులలో ప్రయాణం.
- పాక్ చొరబాట్లను ఆపడానికి భజరంగ్ దళ్ తీసుకున్న ప్రేరణాత్మక యాత్ర
- ఒక్కో రాష్ట్రము నుండి దాదాపు 150 మంది బృందం తో అన్ని రాష్ట్రాల బృందాలతో యాత్ర
జమ్మూ కాశ్మీర్, 19/08/2015 : విశ్వ హిందూ పరిషద్ యువజన విభాగం భజరంగ్ దళ్ అధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే బూడ బాబా అమరనాథ్ యాత్ర తేది 18/08/2015 మంగళవారం రోజున ప్రారంభమయ్యింది. దాదాపు 150 మందికి చెందిన మొదటి బృందం యాత్రకు బయలుదేరింది. ఈ రోజు నుండి ప్రతి రోజు దేశంలోని ఒక్కో రాష్ట్రానికి బృందాలు యాత్రకు బైలుదేరుతాయని బూడ బాబా అమరనాథ్ సంయోజన సమితి మీడియా కు తెలిపింది.
ఈ సందర్భంలో జరిగిన ఉద్గాటన కార్యక్రమంలో శ్రీ రాజేష్ పాండే భజరంగ్ దళ్ జాతీయ సంయోజకులు మాట్లాడుతూ ' దైవ భక్తీ కేవలం ముక్తి సాధనకో లేదా స్వకుటుంబ క్షేమాన్ని కోరి జరగటం మనం మాములుగా చూస్తున్నే ఉన్నాం, దీనికి కారణం ఈ దేశంలోని హిందువు సంకుచితవాది కావడమే, సర్వే జన సుఖినో : భవంతు - వసుదైక కుటుంబకం అంటూ విశ్వ హితాన్ని కోరుకునే హిందువు నేడు కేవలం తన జానెడు పొట్టకు శ్రీ రామ రక్షా అనే చందంగానే ఆలోచించడం శోచనీయం, ఇలాంటి పరిస్థితిలో కేవలం దైవ భక్తీ మాత్రమే కాదు దేశ భక్తీ కోసమే దైవం అనే స్పూర్తితో జరుగుతున్న ఈ బూడ బాబా అమరనాథ్ యాత్ర ఒక నూతన ఒరవడిని ప్రారంబించింది, కొన్ని సంవత్సరల క్రితం కేవలం మన దేశపు సైన్యం మాత్రమే వెళ్ళగలిగే ప్రాంతం నేడు ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రంలా ఉండడానికి కారణం కేవలం భజరంగ్ దళ్ తీసుకున్న ప్రేరణాత్మక సాహసోపేత నిర్ణయం మాత్రమే ' అని అన్నారు.
జిహాది మూకకు సమాదానంగా ప్రారంభమైన VHP బూడ అమరనాథ్ యాత్ర
Reviewed by JAGARANA
on
12:35 PM
Rating:

Post Comment
No comments: