దేశం, ధర్మ రక్షణ కోసం పనిచేస్తేనే జీవితం సార్ధకం అవుతుంది : శ్రీ రాఘవులు విహిప సంయుక్త కార్యదర్శి
అన్నోజీగూడ, శ్రీ విద్యావిహార్, భాగ్యనగర్, 20/08/2015 : విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ, ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబందిచిన వానప్రస్త్ర కార్యకర్తల వర్గ (శిక్షణ కార్యక్రమం) భాగ్యనగర్ అన్నోజీగూడ శ్రీ విద్యావిహార్ లో ఈ నెల 17,18 తేదిలలో జరిగింది, ఈ వర్గలో మూడు ప్రాంతాలకు చెందిన 59 మంది వానప్రస్త కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
మార్గ దర్శనం చేస్తున్న శ్రీ రాఘవులు గారు విహిప అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి |
వర్గ సమారోహ కార్యక్రమంలో మాన్య శ్రీ రాఘవులు విహిప అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి గారు మార్గదర్శనం చేస్తూ ' ప్రాచీన భారతీయ జీవన విధానంలో వానప్రస్త జీవితానికి విశేష ప్రాదాన్యం ఉంది, మానవుడు తన జీవితంలోని అన్ని దశలలోనూ తన కోసం లేదా తన సంసార జీవితం కోసం చతుర్విధ పురుషార్ద సాధన కోసం అధిక సమయం వెచ్చించాల్సి రావడం స్వాభావికం. సంసార భాద్యతలు పూర్తిన తర్వాత వానప్రస్త్ర జీవితంలోకి అడుగుగిడటం తోనే తన పూర్తీ సమయం వసుదైక కుటుంబకం - సర్వే భవంతు సుఖిన: అంటూ సమాజం కోసం, ధర్మ రక్షణ కోసం తన పని చేస్తేనే ఆ వ్యక్తీ జీవితం సార్థకం అవుతుంది, మోక్ష సాధన సాధ్యం అవుతుంది. ఆ దిశలో ఒక సార్ధక నిర్ణయం తీసుకున్న వీరందరూ నేటి యువజనులకు ఆదర్శప్రాయులు' అని అన్నారు.
![]() |
వర్గ లో శిక్షణ పొందిన వానప్రస్త్ర కార్యకర్తలు |
ఈ వర్గ లో మాన్య శ్రీ భాగయ్య గారు (RSS సహా సర్ కార్యవాహ), మాన్య శ్రీ అన్నదానం సుభ్రమణ్యం గారు (RSS తెలంగాణ సహా సర్ కార్యవాహ), మాన్యశ్రీ సత్యం జి (VHP కేంద్రీయ సహా కార్యదర్శి) మన్య శ్రీ గోపాల్ జి (VHP క్షేత్ర సంఘటన కార్యదర్శి), మాన్య శ్రీ కేశవరాజు (VHP తెలంగాణ సంఘటన కార్యదర్శి) తదితరులు మార్గదర్శనం చేసారు
దేశం, ధర్మ రక్షణ కోసం పనిచేస్తేనే జీవితం సార్ధకం అవుతుంది : శ్రీ రాఘవులు విహిప సంయుక్త కార్యదర్శి
Reviewed by JAGARANA
on
5:49 PM
Rating:

Post Comment
No comments: