Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

రేపు " హిందూ ధర్మ రక్షణలో - న్యాయ వ్యవస్థ" పై VHP న్యాయవాదుల సదస్సు

21/08/2015, విజయశ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ : విశ్వ హిందు పరిషద్ - తెలంగాణ అధ్వర్యంలో తేది 22/08/2015 నాడు సాయంత్రం 5 గంటలకు స్థానిక విహిప రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ లో " హిందూ ధర్మ రక్షణ లో - న్యాయ వ్యవస్థ " అనే అంశం పై ఒక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతున్నది.
సదస్సు వివరాలు :అంశం  : హిందూ దర్మ రక్షణ లో - న్యాయ వ్యవస్థ తేది : 22/08/2015 శనివారం సమయం : సాయంత్రం 5 గంటలకు స్థలం : విజయశ్రీ భవన్, కోఠి, భాగ్యనగర్ వక్త : శ్రీ కసి రెడ్డి వెంకట్ రెడ్డి గారు

ఈ సందర్భంలో జరిగిన విలేకరుల సమావేశం లో మాన్య శ్రీ ఆకారపు కేశవ రాజు మాట్లాడుతూ ' హిందూ ధర్మ రక్షణ లో న్యాయవాదుల పాత్ర చాల కీలకంగా ఉంది, న్యాయం అవసరం అయిన హిందూ బందువులకు తక్షణ న్యాయ సహాయం కోసం మన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, మన మాన బిందువుల రక్షణ లో న్యాయవాదులు సమాజానికి మార్గదర్శనంచేయాలి, ఈ దిశలో ప్రణాళిక బద్దంగా కార్యోముఖులు కావడానికి ఇదే సమయం' అని అన్నారు  
రేపు " హిందూ ధర్మ రక్షణలో - న్యాయ వ్యవస్థ" పై VHP న్యాయవాదుల సదస్సు Reviewed by JAGARANA on 9:08 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.