ఏకల్ పాఠశాల కేంద్రంగా సంపూర్ణ గ్రామ వికాసానికే - జనహిత : శ్రీ జి సత్యం
21/08/2015, మార్పల్లీ, రంగారెడ్డి : జనహిత అభియాన్ మార్పల్లి సంచ్ గ్రామ సమితి కార్యకర్తల సమావేశం తేది 20/08/2015 గురువారం నాడు కోటపల్లి లోని స్థానిక శివాలయం ఆవరణలో నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా మాన్య శ్రీ గుమ్ముల సత్యం గారు విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి ( ధర్మ ప్రసార్ ) గారు హాజరయ్యారు, మార్పల్లి సంచ్ 20 గ్రామాల నుండి 120 మంది గ్రామ సమితి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంలో మాన్య శ్రీ సత్యం గారు మార్గదర్శనం చేస్తూ ' భారత దేశ ప్రగతి గ్రామమలోనే ఇమిడి ఉంది, ప్రతి గ్రామం ఆర్ధిక, సామాజిక, సాంఘిక, స్వావలంభన సాధించినప్పుడే భారత దేశం కూడా ప్రగతి సాధిస్తుంది, నేడు గ్రామాలలో అనేక సమశ్యలు ఉన్నాయి, పశ్చిమ దేశాల సాంసృతిక దాడి నగరాలను దాటి ఇప్పుడిప్పుడే గ్రామాల పై పడుతూఉంది, ఈ విష సంసృతి గ్రామ వికాసాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ముందే మనం మేల్కొనాలి, గ్రామీణులను చైతన్యవంతం చేసి సాముహిక కృషి తో మన గ్రామాలను మనమే ప్రగతి వైపు నడిపించుకునెందుకు సంసిద్ధులు, ప్రతి గ్రామం కూడా తమ గ్రామంలో ఉండే బడి, గుడి ల బాధ్యతను మోయగలిగే స్థితికి చేరుకోవాలి, పిల్లల అభ్యున్నతికి తల్లి ఒడి, బడి, గుడిలే మార్గదర్శనం చేస్తాయి, ఆ దిశలో మన గ్రామాలను నడిపించే కార్యంలో మీరు విశేష కృషి చేస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు
ఏకల్ పాఠశాల కేంద్రంగా సంపూర్ణ గ్రామ వికాసానికే - జనహిత : శ్రీ జి సత్యం
Reviewed by JAGARANA
on
9:07 PM
Rating:

Post Comment
No comments: