నల్గొండ: ధర్మ రక్షణకు సర్వదా సిద్ధం - త్రిశూల్ దీక్ష తీసుకున్న 120 మంది యువకులు
23/08/2015, నల్గొండ : విశ్వ హిందు పరిషద్ యువజన విభాగం భజరంగ్ దళ్ అధ్వర్యంలో నల్గొండ పట్టణానికి చెందిన 120 మంది నవ యువకులు ' భజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష ' తీసుకున్నరు, ఈ కార్యక్రమానికి మార్గదర్శనం చేయడానికి విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ ప్రాంత ( రాష్ట్ర ) గౌరవ అధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంలో మార్గదర్శనం చేస్తూ ' ప్రతి వ్యక్తీ జీవనంలో ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పచుకుని ఆ లక్ష్య సాధన పథంలో సక్రమంగా నడవడానికి మార్గాన్ని ఎంచుకోవడాన్నే దీక్షితులు కావడం లేదా దీక్ష తీసుకోవడం అని అంటారు, ఆ విధంగా మీ అందరి జీవితాలలో నేడు ఆ శ్రీ రాముని ఆదర్శాలు పునర్జన్మ తీసుకున్నట్లు భావించాలి, మనవుడిగా జన్మించిన శ్రీ రాముడు తన ఉన్నత ఆశయాలకు జీవితాంతం అంకితం అయి ఉండటం వలెనే మాధవుడిగా దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు, మనం తీసుకున్న సంకల్పం కోసం అహర్నిశలు కృషి చేయడమే మానవుడు మాధవుడిగా మారడానికి మార్గం, అలా కంట-కాకీర్ణమైన మార్గాన్ని ఎంచుకున్న మనం ఆ మార్గ పదంలో మన కర్తవ్య నిస్టకు ఆ ఆంజనేయుని జీవనం మనకు ఆదర్శం కావాలి' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ శ్రీ సురేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ ప్రాంత ( రాష్ట్ర ) గౌరవ అధ్యక్షులు, మాన్య శ్రీ యాదగిరి రావ్ క్షేత్ర గో-రక్షా విభాగం ప్రముఖ్, శ్రీ ఆకారపు కేశవరాజు ప్రాంత సంఘటన కార్యదర్శి, పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
నల్గొండ: ధర్మ రక్షణకు సర్వదా సిద్ధం - త్రిశూల్ దీక్ష తీసుకున్న 120 మంది యువకులు
Reviewed by JAGARANA
on
9:40 AM
Rating:

Post Comment
No comments: