మతపరమైన రిజర్వేషన్ లు రాజ్యాంగ విరుద్ధం: VHP న్యాయవాద సదస్సు మండిపాటు
విజయశ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్, 23/08/2015 : విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ ప్రాంత శాఖా ఆధ్వర్యంలో నిన్న అనగా తేది 22/08/2015 నాడు విశ్వ హిందూ పరిషద్ ప్రాంత కార్యాలయం శ్రీ విజయ శ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ లో హిందూ ధర్మాపేక్షిత గల న్యాయవాదుల సదస్సు జరిగింది, ఈ సదస్సులో భాగ్యనగర్ (హైదరాబాద్) జంట నగరాలకు చెందిన సుమారు 100 మంది ప్రముఖ న్యాయవాదులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలన చూస్తూ ఉంటె ఆనాటి రజాకార్ల పరిపాలను తలపిస్తూ ఉంది, ఇప్పటికే ISI స్లీపర్ సెల్స్ కి స్థిర స్థావరం అయిన పాత పట్టణంలో ప్రభుత్వ కుహాన లౌకికవాద చర్యల వల్ల పరిస్థితి ఇంకా దిగజారుతూ ఉంది, ఇప్పటికైనా ప్రభుత్వం తన మోడీ వైఖరిని వీడి ఉగ్ర మూకలను సమూలంగా తుడిచిపెట్టేందుకు సమాయత్తం కావాలని సదస్సు అభిప్రాయ పడింది.
అలాగే ముస్లీంలకు హామీ ఇచ్చిన 12 % మతపరమైన రిజర్వేషన్ లు రాజ్యంగా స్పూర్తికి విఘాతం కల్పించేలా ఉన్నాయి, ఇప్పటికే ఈ విషయం పై పలుమార్లు దేశ సమున్నత న్యాయస్థానం అనేక మార్లు తన తీర్పును స్పష్టంగా వినిపించిందని, కాబట్టి వెంటనే ఈ అంశం పట్ల ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలనీ సదస్సు డిమాండ్ చేసింది
ప్రభుత్వానికి సదస్సు చేసిన డిమాండ్లు :
- గడువుతీరినప్పటికి పెరోల్ పై బయట తిరుగుతున్న రౌడి షీటర్లను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలి.
- గో - రక్షా చట్టాలు పకట్బందీగా అమలు పరచాలి.
- చైనా మీదుగా భారత్ లోకి ప్రవేశించిన (రియాన్గ్యియో) లను వెంటనే వెనక్కి పంపాలి.
- టెర్రరిస్టులకు అక్రమ వీసా క్లియరేన్సు ఇచ్చిన కానిస్టేబుల్ లను వెంటనే ఉద్యోగాల నుండి తొలగించాలి.
- ఈ అంశంలో పూర్తీ స్థాయిలో విచారణ జరిపి ఉగ్రమూకలకు సహకరిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలి.
మతపరమైన రిజర్వేషన్ లు రాజ్యాంగ విరుద్ధం: VHP న్యాయవాద సదస్సు మండిపాటు
Reviewed by JAGARANA
on
1:08 PM
Rating:

Post Comment
No comments: