సైన్యం ఆత్మ స్థైర్యానికి " భగవద్గీత " పాఠాలు బోధింపజేసిన బ్రిటన్ ప్రభుత్వం
బ్రిటన్ సైన్యం లోని వివిధ రెజిమెంట్లకు భారత సంతతికి చెందిన ఆచార్య దృవ్ చాత్రలియా మూడున్నర గంటల పాటు విరామం లేకుండా భగవద్గీత పై ఉపన్యసించడం చరిత్రాత్మకం - రాష్ట్రచేతన
దాదాపు 5,000 సంవత్సరాల క్రితం భగవాన్ శ్రీ కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడికి శ్రీ మత్ భగవద్గీత ను బోదించి తన కర్తవ్యాన్ని గుర్తుచేసాడు, మార్చ్ 15 న ఆచార్య దృవ్ చాత్రాలియ బ్రిటీష్ సైన్యంలోని వివిధ రెజిమెంట్లకు మూడున్నర గంటల పాటు విరామం లేకుండా ఉపన్యాసం ఇచ్చి చరిత్ర సృష్టించారు.
ఆచార్య దృవ్ భగవద్గీత లోని ఆత్మ యొక్క శాశ్వతత్వం, అమరత్వం, ఆశాత్వత శరీరం, స్వధర్మం యొక్క ఆవశ్యకత, లోక సంగ్రహణ లాంటి ముఖ్య భావనలను వివరించడం జరిగింది. స్వీయ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం, మన మనస్సును నియంత్రంచుకోవడం లాంటి వాటిని సాధించడంలో భగవద్గీత సూచించిన ఆచరనాత్మకమైన పద్దతులపై చర్చిండడం జరిగింది, మంచి - చెడుల మధ్య భేదాన్ని గ్రహించడం, ధ్యానం, మహాభారత యుద్ధంలో అనుసరించిన యుద్ధ వ్యూహాలు, అనేక రూపాలలో భగవంతున్ని పూజించే విధానం, లాంటి అనేక అంశాలను భగవద్గీత కు జోడిస్తూ మాట్లాడారు, తర్వాత సైనికులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు.
మూలం : హిందూ హ్యూమన్ రైట్స్
మూలం : హిందూ హ్యూమన్ రైట్స్
సైన్యం ఆత్మ స్థైర్యానికి " భగవద్గీత " పాఠాలు బోధింపజేసిన బ్రిటన్ ప్రభుత్వం
Reviewed by JAGARANA
on
5:35 PM
Rating:
No comments: