RSS ABPS పత్రికా ప్రకటన 2 : నాగాలాండ్ రాణి మాతా గైండిన్ల్యు జన్మ శతాబ్ది వేడుకలు
బెంగళూరు , 10/03/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపులో సర్ కార్యవాహ మాన్య శ్రీ భయ్యాజి జ్యోషి ఆంగ్లేయుల పై ఆజన్మాంతం పోరు సలిపిన ధీర గిరిజన మహిళా నాగాలాండ్ మహారాణి మాతా గైండిన్ల్యు జన్మ శతాబ్ది వేడుకల పై రెండో పత్రికా ప్రకటనను విడుదల చేసారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
అఖిల భారతీయ ప్రతినిథి సభలు (మార్చి 7,8 మరియు 9)
సుప్రసిద్ధ పోరాట యోధురాలు రాణి మా గైండిన్ల్యు గారి జన్మ శతాబ్ది సందర్బంగా ఆర్. యస్.యస్ అఖిల భారతీయ సర్ కార్యవహ శ్రీ భయ్యాజీ జోషి ఇచ్చిన సందేశం:
‘లంగ్ కావు’ నిర్మలమైన హిమాలయ పర్వతాలలో దాగియున్నఈశాన్య మణిపూర్ లోని ఓ గ్రామం. వంద సంవత్సరాల క్రితం రాణి మా గైండిన్ల్యు ఇక్కడ జన్మించారు. దేశ భక్తి ఆమెకు జన్మతః దేవుడు ఇచ్చిన వరం. ఆమె మన ధర్మానికి, ఇక్కడి సంస్కృతికి ఆంగ్లేయులు మరియు క్రైస్తవ మిషనరిల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టారు. 1928 లో తన సోదరుడు ‘హేపావు జాదోనంగ్’ సహాయంతో గుహతి ఉంటున్న మహాత్మా గాంధీ గారిని కలిసి ఈ విషయం మీద తీవ్రంగా ఆలోచించాలని కోరారు. ఆ వెంటనే తన 13వ ఏటనే రాజద్రోహులైన ఆంగ్లేయుల మీద తిరుగుబాటుకు దిగారు. తన సోదరుడు జాదోనంగ్ వేల మంది అనుచరులతో కలిసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. ఫలితంగా ఆయన 29 ఆగష్టు 1931 లో ఆంగ్లేయుల చేతిలో హతమయ్యారు. సోదరుడి మృతితో పోరాటాన్ని తనే స్వయంగా ముందుకు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండ ప్రాంతాలలో నివసిస్తున్న వారితో కలిసి ఉద్యమాన్ని ఆమె ముందుకు నడిపించారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె కూడా 1932 లో తన 16 ఏట ఆంగ్లేయుల చేతిలో జీవితకాల నిర్బందానికి గురయ్యారు.
1937 లో జవహర్ లాల్ నెహ్రు షిల్లాంగ్ లో నిర్బందించబడ్డ రాణి మా ని కలుసుకొని, ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకొని ఈశాన్య రాష్ట్రాలకే రాణి గా అభివర్ణించారు. దురదృష్టవశాత్తు తను మన దేశ స్వాతంత్ర్య అనంతరమే విడుదలకు నోచుకున్నారు. 15 యేండ్ల జైలు జీవితం తర్వాత కూడా ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగిపోతున్న మతమార్పిడులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగించారు. తన జీవితమంతా అలుపెరుగని పోరాటం చేస్తూనే 1993, పిబ్రవరి 17 న తుది శ్వాస విడిచారు.
తన పోరాట ప్రతిమకు మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఉన్నతికి చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్ తో తనని సత్కరించింది.
ఒక వనవాసి ఈ దేశం కోసం చేసిన పోరాటం చూస్తుంటే యావత్ దేశమంతా గర్వించదగ్గ విషయం. తన పోరాట ప్రతిమకు గుర్తుగా రాణి మా అనుచరులు జిలంగ్ రాంగ్ హరక్క అనే సంస్థ ని స్థాపించారు. వారు 26 జనవరి 2014 నుండి 26 జనవరి 2015 వరకు రాణి గారి జన్మ శతాబ్ది వేడుకలను జరుపుటకు నిశ్చయించారు.కళ్యాణ ఆశ్రమం కూడా ఈ పవిత్ర కార్యంలో పాలు పంచుకుంటున్నది.
సంఘ్ ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్న జిలంగ్ రాంగ్ హరక్క సంస్థ మరియు కళ్యాణ ఆశ్రమం వారికీ అభినందనలు తెల్పుతున్నది. ఈ దేశ అభ్యున్నతి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని మనం గుర్తించుకోవాలి. రాణి మా జన్మ శతాబ్ది వేడుకలు ఈశాన్య రాష్ట్రాల్లోనే కాక, భారతదేశమంత జరిగేలా చూడాల్సిన భాద్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ మహాత్కర కార్యంలో పాలుపంచుకోవడానికి ఈ దేశ ప్రజలందరినీ సంఘ్ కోరుతున్నది.
** **
RSS ABPS పత్రికా ప్రకటన 2 : నాగాలాండ్ రాణి మాతా గైండిన్ల్యు జన్మ శతాబ్ది వేడుకలు
Reviewed by JAGARANA
on
8:58 AM
Rating:
No comments: