Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

RSS ABPS పత్రికా ప్రకటన 1 : మాతా అమృతానందమయి పై దుష్ప్రచారం అంతర్జాతీయ కుట్ర - తీవ్రంగా ఖండిస్తున్నాం

బెంగళూరు , 10/03/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపులో సర్ కార్యవాహ మాన్య శ్రీ భయ్యాజి జ్యోషి మాతా అమృతానందమయి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసారు.


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్


అఖిల భారతీయ ప్రతినిథి సభలు (మార్చి 7,8 మరియు 9)
గొప్ప మానవతా మూర్తి  అమ్మ మాతా అమృతానందమయి పై అసత్య ఆరోపణల తో అవమానపరిచే అంతర్జాతీయ కుట్ర !

మాతా అమృతానందమయి .... ఎన్నో కోట్ల మందికి ఆరాధ్యురాలు  తనే వారి  'అమ్మ'.  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ సన్యాసిని. కుల మత వర్గ బేధం లేకుండా భూమండలం లోని దేశ దేశాల్లో తన ఆత్మీయ స్పర్శలో తన అనుచరులు గా కోట్లాది మంది నేడు అమ్మ ను ఆరాధిస్తున్నారు. అవధులు లేని ప్రేమ ఆత్మీయ స్పర్శ లో నేడు కోట్లాది ప్రజలు ఆమె తన్మయం లో జీవన దుఃఖ బాధలను మరచి జీవిస్తున్నారు. దుఃఖ భారంతో జీవితం లో నిరాశ నిస్పృహ నిండిన వ్యక్తుల జీవితాల్లో తన ఆలింగనం ద్వారా తేలిక చేసి జీవితం పై ఆశలు చిగురింప జేసే “ ఆలింగాన సన్యాసిగా “ అటు ఐక్యరాజ్య సమితి మరియు మరెన్నో దేశాలు విశ్వవిద్యాలయాలు సగౌరవంగా ఉన్నత పురస్కారాలతో సత్కరించాయి. గొప్ప ఉదాత్తమైన మానవతా వాదం తో అమ్మ ప్రపంచ నలుమూలలు తిరుగుతూ తన ప్రేమామృత వర్షాన్ని కురిపిస్తున్నారు. తన ఆధ్యాత్మిక దివ్య సందేశాలతో ఎంతో మంది కి సాంత్వన ఇవ్వడమే గాక ఎంతో ఓపిక తో లక్షలాది మెయిల్ ద్వారా మరియు ఉత్తరాల ద్వారా వచ్చే సందేహాలకు సమాధానాలు తెలియపరచుచున్నారు. అన్నార్తులు అవసరార్తుల కోసం తను లెక్కలేనన్ని సామాజిక సేవా ప్రకల్పాలు నడుపుతున్నారు. తన కృషి తో అమ్మ ఎన్నో సంస్థలను వ్యక్తులను ధార్మిక సామాజిక సేవ వైపు మరలేటట్టు స్పూర్తిని ఇచ్చి  మానవ సేవకు మించినది లేదని చాటారు. అలా అమ్మ ధార్మిక సేవా ఉద్యమ తీరు నే మార్చారు.
అలాంటి అమృత మూర్తి పై  కొన్ని పశ్చిమ దేశాల దుష్ట  శక్తులు ఇటీవల కొన్ని ఉదేష్యపూర్వక చర్యలతో అమ్మను అవమాన పరచడం అగౌరవపరచడమే  లక్ష్యం చేసుకున్నాయి. నిజానికి వాటి ఉనికే పూర్తీ అనుమానాస్పదంగా ఉంది. ఇటీవల వచ్చిన Holy Hell అనే పుస్తకం లో  శత్రువులు పూర్తిగా గొప్ప ధార్మిక ఉద్యమమైన హిందూ ధర్మాన్ని మరియు మానవత్వాన్ని మంటగలిపే పద్దతిలో మసి పూసి తప్పుడు వాఖ్యానాలు చేయడం కుట్ర పూరితమే ! ఈ పని పశ్చిమం లో నిలకడ లేని తమ పై తమకు నమ్మకం లేని మత వాదులైన పెద్దల చర్య గా అనుమానిచాల్సి ఉంటుంది.
ఆ పుస్తకం లో అమ్మ ఉద్యమం పై చేసిన ఆరోపణలు నిరాధారము. అట్టి అర్థం పర్థం లేని దోషపూరిత  ఆరోపణలకు ఊతం ఇస్తూ హిందూ వ్యతిరేక మీడియా వర్గం ఒకటి వకాల్తా పుచ్చుకుని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ఒక అంతర్జాతీయ కుట్ర గా భావించాలి. గతం లో కూడా ఇలా ఎందరో హిందూ సన్యాసులను  సంస్థలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరిగాయి.
ఇట్టి హేయమైన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.  అమ్మ అమృతానందమయి పై ఈ విధంగా జరుగుతున్న కుట్ర ను మొత్తం ప్రపంచ హిందూ సమాజం ఏకమై ఎదుర్కోని కుట్ర వెనుక గల శక్తుల చర్యలను తిప్పికొట్టాలని  పిలుపు నిస్తున్నాము. వారిని మానవతా ప్రపంచానికి శత్రువులు గా పరిగణించాలని తెలియజేస్తున్నాము.
అమ్మ నిర్వహిస్తున్న ఉదాత్తమైన మానవతావాద ఆధ్యాత్మిక ఉద్యమానికి మా మద్దతు ఎల్లపుడూ ఉంటుంది. అంతే గాక ఆమె పై కుట్రలకు దిగుతున్న శత్రువులను ఎదుర్కొనే క్రమం లో మా మద్దతు తప్పక అందజేయగలం అని తెలిజేస్తున్నాను. ఇలాంటి కుట్రలతో సతమతమయ్యే ప్రతీ హిందూ సాధువు మరియు సంస్థల పక్షాన సంఘం తప్పక నిలుస్తుంది.  
** ** 
మూలం : విశ్వ సంవాద కేంద్రం - కర్ణాటక 

RSS ABPS పత్రికా ప్రకటన 1 : మాతా అమృతానందమయి పై దుష్ప్రచారం అంతర్జాతీయ కుట్ర - తీవ్రంగా ఖండిస్తున్నాం Reviewed by JAGARANA on 8:57 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.