Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

బెంగళూరు: ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ లో సర్ కార్యవాహ భయ్యాజి జ్యోషి పత్రికా సమావేశం

బెంగళూరు , 09/03/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలలో భాగంగా తేది 09/03/2014 నాడు మధ్యాన్నం జరిగిన మీడియా సమావేశంలో మాన్య శ్రీ సురేష్(భయ్యా)జి జ్యోషి సర్ కార్యవాహ ( ప్రధాన కార్యదర్శి ) పాల్గొని విలేకరుల ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు. 
Click Here to Download
పత్రికా సమావేశం లోని ముఖ్యాంశాల సారాంశం
సంఘ్ ప్రతినిధి సభ - 2014 వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిపిన మన మీడియా మితృలకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, సంఘ్ యొక్క గత సంవత్సర కాలంలో జరిగిన కార్యకలాపాలు, వాటి సమీక్షా, మూల్యాంకనం, రాబోవు రోజులలో జరిగే కార్యక్రమాల యోజన తదితర అంశాల పై చర్చించడానికి ఇక్కడ సమావేశామయ్యం.
గత సంవత్సరం జరిగిన అతి పెద్ద మరియు అతి ముఖ్య కార్యక్రమాలో ఓకటి ' స్వామి వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలు' ఈ ఉత్సవాలలో హిందుత్వ అభ్యున్నతికి స్వామి వివేకుడు చేసిన బోదనలను ప్రజల్లోని పెద్ద ఎత్తున తీసుకెళ్లగలిగాం, స్వామి వాణిని దేశ వ్యాప్తం చేయడం లో రామకృష్ణ మిషన్ వారి మార్గదర్శనం లో సంఘ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా తమ పూర్తీ సహకారాన్ని అందించారు, 'వందే వివేకానందం' అనే భావన దేశంలో జాగృతం అయ్యింది.
దేశ సౌభాగ్యానికి 'గో రక్షణ మరియు గో - సేవా' ప్రముఖ అంశాలుగా సంఘ్ భావిస్తుంది, దేశ అభ్యున్నతికి సంబందించిన అనేక ఆర్ధిక, సామజిక పరమైన అంశాలు గో - వంశ అభివృద్దితో ముడిపడివున్నాయి వాటిని విస్తారంగా జన భాహుల్యంలోకి తీసుకెళ్ళి వాటిపై దేశ ప్రజలలో అవగాహనా కల్పించడానికి సంఘ్ కృషి చేస్తూఉంది, సంఘ్ పరివార్ సంస్థలతో పాటు అనేక స్వచ్చంద సంస్థలు ఈ రంగంలో తమ పనిని చేస్తున్నాయి వాటి కృషి ఇప్పుడిప్పుడే ఫలితాలను చూపుతోంది ఆ కార్యదక్షత కారణంగానే దేశ వ్యావ్తంగా దాదాపు 1000 పైగా గో-శాల లను స్థాపితం కావడం జరిగింది.
సంఘ్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న అతి ముక్యమైన సేవా ప్రకల్పలలో ఒకటి ' గ్రామ వికాస్ ' గ్రామాలు దేశ ప్రగతికి వెన్నుముక్క లాంటివి కాని 1947 తర్వాత కూడా మన గ్రామాలో అత్యంత అవశ్యకమైన కనీస మౌలిక సదుపాయాలు అభివృద్ధికి నోచుకోలేదు, ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదు కాని సంఘ్ మొదటి విడుతగా 200 వందల గ్రామాలను స్వయం సంవృద్ది చెందించి ఆర్ధిక శక్తి పుంజం గా మార్చింది, ఈ రంగంలో ఇంకా మా పని కొనసాగుతూనే ఉంటుంది.
కుటుంబ వ్యవస్థ భారతీయ సమాజ మూలం ఇదే విషయాన్ని సంఘ్ బలంగా నమ్ముతుంది, కాని అనేకా సామజిక, ఆర్థిక అంశాల కారణంగా నేడు దేశంలో కుటుంబ వ్యవస్థ కుంటుపడుతుంది, కుటుంబ వ్యవస్థను శక్తి యుతం చేసేందుకు సంఘ్ ' కుటుంబ ప్రభోదన్ ' లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. 
దేశంలో సంఘ్ శాఖలు అత్యంత వేగంతో గణనీయ సంఖ్యలో పెరుగుతున్నాయి, సంఘ్ నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాల వివరాలను ఇప్పటికే మీ అందరికి అందిచడం జరిగింది. సంఘ్ నిత్య శాఖలు దేశం లోని 55,000 గ్రామాలలో జరుగుతున్నాయి, కాని సంఘ్ నిర్వహించే సేవా, సంఘ్ మండలి, సప్తయిక్ మిలక్ వంటి కార్యక్రమాలో ఇప్పటికే సంఘ్ దాదాపు లక్ష గ్రామమలో పని చేస్తూఉంది.
దేశ హితాన్ని కోరి చేసే అనేక ప్రయత్నాలలో మేము విజయం సాధిస్తూనే ఉన్నాం, సంఘ్ యొక్క ప్రగాఢ లక్ష్యాలు తక్షణ కాలవ్యవధిలో సాధించబడేవి కావు, దీర్గ కాల ప్రణాళికతో ముందుకెళ్తునాం.
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న మాన్య శ్రీ భయ్యాజి జ్యోషి 

విలేకరులు అడిగిన ప్రశ్నలు - భయ్యాజి సమాదానాలు 

ప్ర : స్వలింగ సంపర్కం పై దేశ వ్యాప్తంగా సమాజం లో న్యాయవ్యవస్థ లో విసృతంగా చర్చ జరుగుతుంది . దీనిపై సంఘ్ దృక్కోణం ఎలా ఉంది ?
స : ఈ అంశం పై చర్చ సంఘ్ లో  జరగలేదు కాని ప్రజల ఆరోగ్యానికి మరియు సమాజ భావనలకు విఘాతం కలిగించే ఏ అంశాలైన అనర్థదాయకాలే.
ప్ర : భాజపా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందికి గురైనప్పుడు సంఘ్ ఆ విషయాన్ని సరిచేస్తుందా ?
స : సంఘ్ ఏ ఇతర సంస్థల లేదా పార్టి అంతరంగిక అంశాలలో తలదూర్చదు, పార్టి విధాన పర నిర్ణయాలు తీసుకోవడం లో భాజపా నాయకులు సమర్థులే.
ప్ర : దలై లామా సహజీవనాన్ని సమర్థించారు, తను గతంలో సంఘ్ ని సమర్థించారు, దలై లామా వ్యాఖ్యలను సంఘ్ ఎలా చూస్తుంది ?
స : ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి, కాని అలాంటి వ్యాఖ్యలను చేసేటప్పుడు తన దదృక్కోణాన్ని ఒక సారి సరి చూసుకోవడం మంచిది.
ప్ర : ప్రతినిది సభ ఏమైనా తీర్మానాలు చేసిందా ?      
స : లేదు , సంఘ్ ఈ ప్రతినిధి సభ సమావేశాలలో ఎలాంటి తీర్మానాలు చేయలేదు, కాని రెండు ప్రత్రిక ప్రకటనలు విడుదల చేసింది వాటిలో ఒకటి మాత అమృతానందమయి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సంఘ్ తీవ్రంగా ఖండిస్తుంది. రెండోది ఆంగ్లేయుల పై ఆజన్మాంతం పోరాడిన గిరిజన ధీర వనిత నాగాలాండ్ రాణి మాతా గైండిన్ల్యు జన్మ శతాబ్ది వేడుకలను నిర్వహించడం ఈ వేడుకలలో పాల్గొనాలని దేశ వాసులందరినీ ఆహ్వానిస్తున్నాం.
ప్ర : వృద్ధులు రాజకీయ జీవితం నుండి విశ్రాంతి తీసుకోవాలని సంఘ్ చెప్పింది కాని ఇప్పటికి ఎన్నికలలో పోటి చేయడానికి అనేక మంది వృద్ధులు సిద్ధపడుతున్నారు ?
స : సంఘ్ ఇలాంటి మార్గదర్శకాలను ఎప్పుడు ఇప్పలేదు, కాని క్రొత్త తరాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి అవకాశం ఇవ్వడం మంచిది అని మాత్రమే చెప్పింది, అనుభవం ఉన్నవారు క్రొత్త వారికి మార్గదర్శకులుగా ఉండాలి.
ప్ర : దేశంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమాలను సంఘ్ ఎలా చూస్తుంది. 
స : సంఘ్ ఎప్పటినుంచో దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, అలాగే అనేక సంస్థలు జరిపే అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో సంఘ్ స్వయం సేవకులు క్రియాశీల పాత్ర నిర్వహిస్తూఉంటారు, అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ లాంటి సంఘ్ పరివార్ సంస్థలు కూడా ' అవినీతికి వ్యతిరేకంగా యువత ' లాంటి ప్రత్యక్ష ఉద్యమాలను నిర్వహిస్తున్నాయి.
ప్ర : అంఆద్మీ పార్టి లాంటి పార్టిలు అవినీతి వ్యతిరేకమంటూ ఉద్భవించాయి, ఆప్ పై సంఘ్ దృక్కోణం ఏమిటి ?
స : ప్రజాస్వామ్యంలో క్రొత్త పార్టిలు ఏర్పడటం సహజమే, మేము కూడా మీడియాలో ఆప్ గురించి విన్నాం, కాని ఎవరు మంచో ఎవరు చెడో కాలమే నిర్ణయిస్తుంది, వారు అవినీతికి వ్యతిరేకంగా తమ కార్యపద్దతి, సిద్ధాంతలతో ఫలితాలను చూపితే సంఘ్ తప్పకుండా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దత్తు ఇస్తుంది. 
ప్ర : జైనులను మైనారితిలుగా గుర్తించడం & గాంధీజీ హత్య లో సంఘ్ హస్తం విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల పై మీరేమంటారు. 
స : సంఘ్ సమాజాన్ని మైనారిటి , మెజారిటి లనే పేరుతొ విభజించడాన్ని ఎన్నటికి సహించదు,హిందుత్వం లో అనేకా ఆరాధన విధానాలు ఉన్నాయి వాటిలో జైనులు కూడా ఒకటి ఎన్ని ఆరాధన విధానాలున్నా హిందుత్వ జీవన విధానంలో అవి అంతర్భాగమే, ఇకపోతే గాంధీజీ హత్య విషయంలో రాహుల్ వ్యాఖ్యలను సంఘ్ తీవ్రంగా ఖండిస్తూ జాతీయ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది దానిపై ఎన్నికల సంఘం వారు తగిన చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నాం.
మీడియా సమావేశంలో మాన్య భయ్యాజి జ్యోషి తో పాటుగా డా మన్మహన్ వైద్య గారు కూడా వేదికను పంచుకున్నారు, విశ్వ సంవాద కేంద్ర ప్రభారి శ్రీ రాదా కృష్ణ గారు మీడియాను అధితులను వేదిక పైకి ఆహ్వానించారు.
మూలం : విశ్వ సంవాద కేంద్రం - కర్ణాటక            
బెంగళూరు: ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ లో సర్ కార్యవాహ భయ్యాజి జ్యోషి పత్రికా సమావేశం Reviewed by JAGARANA on 8:15 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.