ప్రత్యేక వ్యాసం: రోజురోజుకు దిగజారుతున్న పాకిస్తానీ దళిత హిందువుల జీవన ప్రమాణాలు - చందర్ కొల్హి
(రచయిత చందర్ కొల్హి పాకిస్తాన్ హిందూ సేవా ఉపాధ్యక్షులు)
- స్వేచ్చానువాదం : శ్రీ నాగరాజు గోల్కొండ
--------------------------------------------------------------
Like Page : www.facebook.com/rastrachethana
--------------------------------------------------------------
--------------------------------------------------------------
Like Page : www.facebook.com/rastrachethana
--------------------------------------------------------------
పాకిస్థాన్ లో నివసిస్తున్న దళిత హిందువులు తీవ్ర వివక్షతో చూడబడుతున్నారు. ఈ వివక్ష ఉన్నత హిందూ పక్షం ఉన్నచోట అధికంగా కనబడుతోంది. వీరికి దేవాలయాల ప్రవేశం లేకుండా చేస్తునారు. మరో వైపు అధిక సంఖ్యలో దళిత హిందూవులు వారు పని చేసే చోట ముస్లిం యజమాని కింద మరో రకమైన వివక్షతో సతమతం అవుతున్నారు. ఒక దళిత విశ్లేషకుని ప్రకారం 70% దళితులు వ్యవసాయకులే గాక నిరక్షరాస్యులు. హిందూవులు పాకిస్తాన్ లో పెద్ద మైనారిటీ వర్గంగా ఉన్నారు, వారిలో హిందువులలో 85% మంది దళితులే , కావున దళిత హిందూ అంశం అక్కడ ప్రాధాన్యమైనది.
80 వ దశకానికి పూర్వం అక్కడి దళిత హిందూవుల స్థితి కాస్త బాగుండేది , కాని అనంతరం చాలా వివక్ష మొదలైంది. దాని ఫలితంగా జరిగిన ఉద్యమాల కారణంగా కాస్త వివక్ష తగ్గి వారి జీవనం మెరుగైంది.. ఉద్యమ నాయకుల పై పాలకులు కన్నెర్ర జేసి నిర్భందం మొదలు పెట్టినప్పటికీ వారు జనకక అలాగే ఉద్యమ పంథాలో ఉన్నారు. హైదర్ బక్స్ జటోయ్ , ఫాజిల్ రాహు , జి ఎం సాహిద్ , సంభో హమీరాని , మిస్కాన్ జహీన్ ఖాన్ కొసో మరియు ఇతరులూ దళితుల కోసం గొంతెత్తిన వారిలో ఉన్నారు.
పాకిస్థాన్ లోని దళితులు ప్రధానంగా 42 కులాలుగా ఉన్నారు. వీళ్ళంతా నిత్యం తీవ్ర వివక్షకు గురవుతున్నారు. కనీస మర్యాదకు కూడా నోచుకోవడం లేదు. మళ్ళీ 80 దశకంలోని తీవ్రమైన రోజులు వీరికి వచ్చాయి. Pakistan Hindu Seva మరియు Global Human Rights Defense ఆధ్వర్యం లో జరిగిన దళిత హిందూ మైనారిటీ సర్వేలో నేను ఊహించని విషయాలు దృష్టి కి వచ్చాయి.
అందులో అత్యాచారం ద్వారా మత మార్పిడులు , కట్టు బానిసత్వం ,భూమిని లాక్కోవడం, బలవంతంగా హిందూ మైనారిటీ బాలికలను మత మార్పిడి చెయ్యడం , మైనర్ హిందూ బాలికలపై అత్యాచారం , అలాగే బాలురను డబ్బు కోసం బంధించడం , హిందూ అధికారులను కొట్టడం , వివాహిత హిందూ బాలికలను ఆస్తి కోసం అత్యాచారం చెయ్యడం, కొట్టడం లాంటి విషయాలు వెలుగు చూసాయి.
ఇలాంటి అఘాయిత్యాలు అక్కడి సమాజంలో అవలీలగా జరుగుతున్నాయి. ఈ విషయాలను పత్రికలు గాని, మీడియా గాని వెలుగులోకి తేని కారణంగా ప్రజలు నిత్య నరకాన్ని చూస్తున్నారు. బాధితులు పోలీస్ లను ఆశ్రయించినా వారు పట్టించుకోవడం లేదు, పైగా ఇద్దరి మధ్య సర్ది చేసి పంపడం జరుగుతోంది. న్యాయ సంస్థలు వీరి హక్కుల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. పెద్ద కులం వ్యక్తుల పై ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రం దళితులతో సహా అందరూ సానుభూతి తెలపాలి . ఇదో వివక్ష.
సింధు రాష్ట్రములోని ఉమర్కొట్ జిల్లాలో మైనారిటీ హిందూ దళితుల పరిస్థితి దయనీయం. కోర్టులు వారి పట్ల అశ్రద్ధ చూపడమే గాక చట్ట విరుద్ధ తీర్పులను ఇస్తున్నాయి.. ఎందుకంటే న్యాయమూర్తులకు తేరా వెనుక బహుమానాలు అందుతాయి గనుక. పై కోర్టులైన ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళాలంటే పూట గడవని వీరు దారిఖర్చులు, వసతి ఖర్చులు భరించడమే కష్టం ఇక న్యాయవాదుల ఫీజులు వీరిని అక్కడి వరకు చేరనీయవు. కింది కోర్టులు తిరగడానికే వారు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది.
ఈ నిస్సహాయత స్థితిలో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా సింధు రాష్ట్రంలోని తర్పారకర్ జల్లా లో ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి . ఎక్కువ శాతం కుటుంబాలు కాస్త డబ్బున్న వాళ్ళు దేశం విడిచి భారత్, కెనడా, ఇంగ్లాండ్ మరియు గల్ఫ్ దేశాలకు తరలిపోతున్నారు, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. చాలా హిందూ కుటుంబాలు సింధు రాష్ట్రం లో బాలికలను బడికి పంపడానికి కూడా భయపడుతున్నారు. వారు ఎక్కడ అపహరించబడతారని వారి భయం . అలా ఈ మధ్య సప్నా రాణి అనే బాలిక కనబడకుండా పోయింది. అతి కష్టం మీద Coalition for the Rights of Minorities (CRM) వారి సహాయంతో దొరికింది.
వందల సంఖ్యలో NGO లు వీరి కోసం పని చేస్తున్నప్పటికీ అవినీతి మరియు ఆచరణ లోపం వల్ల ఫలితం అందడం లేదు. ప్రభుత్వం కొన్ని పథకాలు చేస్తున్నా అవి దళిత హిందూ సమస్యలకు సంబంధించి ఉండడం లేదు. పాకిస్థాన్ ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థలు ఒక విషయం ఆలోచించాలి. హిందూ దళితుల్లో నిరక్షరాస్యత అదికంగా ఉంది, ముందు దానికోసం పని చెయ్యాలి . అనంతరం వారి ఉపాది పై దృష్టి పెట్టాలి. వ్యాపార, వాణిజ్య మరియు కంప్యుటర్ రంగాల అభివృద్దికి కృషి చెయ్యాలి. ముఖ్యంగా సింధు రాష్ట్రంలో ఇది జరగాలి. అపుడు వారు వారి హక్కులు, బాధ్యతలను గుర్తిస్తారు.
మూలం : న్యూస్ భారతి
ప్రత్యేక వ్యాసం: రోజురోజుకు దిగజారుతున్న పాకిస్తానీ దళిత హిందువుల జీవన ప్రమాణాలు - చందర్ కొల్హి
Reviewed by JAGARANA
on
10:21 AM
Rating:
The article reveals a lot about the plight of the Hindu minority in theocratic Pakistan..
ReplyDelete