మిషనరీ స్కూల్ లో దారుణం : హోలీ ఆడినందుకు శిక్షించిన యాజమాన్యం - ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య
హిందూ విద్యార్థులను హిందుత్వం నుండి దూరం చేస్తున్న ఈ క్రైస్తవ మిషనరీ స్కూల్ ల దౌర్జన్యాలను ఈ దేశంలో లేకుండా చేయడానికి హిందువులంతా ఐక్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైనది - రాష్ట్ర చేతన
బెంగళూరు : బెంగళూరు నరరములోని మేరి ఇమ్మక్యులేట్ హై స్కూల్ కి చెందిన ఏడుగురు అమ్మాయిలను స్కూల్ పరిధిలో హోలీ జరుపుకున్నరనే నెపంతో స్టాఫ్ రూమ్ బయట నిలబెట్టారని దానితో మనస్తాపం చెందిన ప్రియాంక మరియు సోనాలి అనే విద్యార్థినులు దగ్గరలోని సంలీ సరస్సులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రియాంక మరియు సోనాలి తల్లితండ్రులు తెలిపారు.
' సోమవారం రోజున స్కూల్ లో ప్రత్యేక తరగతిని నిర్వహించారు, ఆ రోజున తరగతి లో అమ్మాయిలు స్కూల్ దగ్గరలో హోలీ వేడుకలను జరుపుకున్నారు, ఈ అంశం పై కోపంగా ఉన్న స్కూల్ యాజమాన్యం మంగళవారం రోజున ప్రియాంక మరియు సోనాలి లతో పాటు ఏడుగురు అమ్మాయిలను శిక్షించారు, అదే రోజు మధ్యాన్నం సమయం లో ప్రియాంక మరియు సోనాలి కనిపించడం లేదని మాకు ఫోన్ ద్వార సమాచారం అందించారని ' పిల్లల బంధువొకరు టైమ్స్ అఫ్ ఇండియా కి తెలిపారు.
ఇద్దరు అమ్మాయిల మృత దేహాలను స్థానిక రామయ్య ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు, స్థానిక పొలిసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు డిసిపి రవికాంత గౌడ తెలిపారు.
మూలం : హిందూ హ్యూమన్ రైట్స్
ఫోటో : హిందూజాగృతి
మిషనరీ స్కూల్ లో దారుణం : హోలీ ఆడినందుకు శిక్షించిన యాజమాన్యం - ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య
Reviewed by JAGARANA
on
8:41 AM
Rating:

Post Comment
No comments: