పూజ్య సర్ సంఘ్ చాలక్ మోహన్ జి భాగవత్ ఉగాది సందేశం (తెలుగులో)
విశ్వ గురువు స్థానంలో భారతమాతను నిలపడం అనే మన భవ్య లక్ష్యాన్ని మన దృష్టిలో ఉంచుకుని దృడ సంకల్పం, ఆ లక్ష్య సాధనలో సంపూర్ణ సమర్పిత భావం, మనలోని సుగుణాలను వికశించుకోవడం అనే ఈ మూడు అంశాలను సాధించే దిశలో మనం నూతన సంవత్సరాన్ని జరుగుపుకోవాలని అపేక్షిస్తూ - మోహన్ జి భాగవత్
నమస్కారం,
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, మన ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించి చైత్ర శుద్ధ ప్రతిపాద రోజున ఈ సృష్టి ఆరంభం అయిందని నమ్ముతాం, శాలివాహనుడు విజయం సాధించిన రోజు కూడా ఇదే, ఇదే రోజు సంఘ్ నిర్మాత పరమ పూజ్య డాక్టర్ కేశవ్ రావ్ బలిరాం పంత్ హెడ్గేవార్ జన్మ దినం కూడా. మనం మన పరంపరలో ఈ రోజును సంకల్ప దినోత్సవం గా భావిస్తాం, ఏదైనా మంచి మార్పు కోసం మూడు విషయాలు ముఖ్య భూమికను పోషిస్తాయి.
మొదటిది దృడమైన సంకల్పము రెండోది తీసుకున్న సంకల్పం కోసం తన జీవితంలోని ప్రతిదాన్ని సమర్పితం చేసేందుకు సిద్ధపడ్డ మనస్సు, ఇక మూడోది మన భవ్య లక్ష్యానికి అనుగుణంగా మన మన జీవితంలో అనుకూలమైన అంశాలను పెంచుతూ, అననుకూల పరిస్థితులను తగ్గిస్తూ మన జీవనాన్ని ఆ లక్ష్యానికి అనుకూలంగా మార్చడం, సంఘ్ నిర్మాత పరమ పూజ్య డాక్టర్జీ జీవితంలో వారి చేతుల మీదుగా పెరిగిన సంఘ్ లోని మొదటి తరంలోని వరిస్ట కార్యకర్తల జీవితంలోను ఈ అంశాలు గోచరమౌతాయి, మనం మన దేశాన్ని పరమ వైభవ స్థితిలో నిలపగలగాలి, విశ్వం అంతటిలో శాంతి నెలకొనాలని వసుదైక కుటుంబకం అనే భావనలో ప్రపంచం అంతా ధర్మ మార్గంలో నడవాలని పరిశ్రమించే వ్యక్తులం మనం, ఈ విషయాన్ని మనం మన మనస్సులో ఎల్లపుడు తలచుకుంటూ ఉండాలి, మనం భారత మాత పరమ వైభవ లక్ష్యాన్ని మన జీవన లక్షంగా భావించి ఆ లక్ష్య సాధనలో మన సర్వ శక్తులు ధారపోయాలి, ఆ లక్ష్య సాధనలో మన జీవనంలోని దుర్గుణాలను తొలగించుకుని సద్గుణాలను పెంపొందించుకున్నప్పుడు అతి త్వరలో మన పరిశ్రమ కారణంగా మన దేశంలో ఈ విశ్వంలో మన లక్ష్యం సకారమౌతుంది.
ఇప్పుడు మన దేశంలో ఎన్నికల సమయం నడుస్తుంది, కేవలం రాజకీయ మార్పుతో దేశం అంతా మారతుందని సామాన్యులు భావిస్తున్నారు కాని మన గత చరిత్ర ఈ విషయంలో భిన్నంగా కనిపిస్తుంది, రాజకీయ మార్పు దేశ సకారాత్మక మార్పు ప్రక్రియలో అవసరమైన సహాయకారిగా చిన్న భాగం మాత్రమే, కాని అసలు మార్పు సమాజంలో వ్యక్తులలో మార్పు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది, తాత్కాలికంగా ఇలాంటి అంశాలలో యోగ్యమైన విధానంతో పనిచేస్తూ ఉన్నప్పటికీ మనమందరం సంపూర్ణ విశ్వాన్ని ధర్మపథంలో నిలపగలిగే శక్తియుతమైన విశ్వ గురువు స్థానంలో భారతమాతను నిలపడం అనే మన భవ్య లక్ష్యాన్ని మన దృష్టిలో ఉంచుకుని దృడ సంకల్పం, ఆ లక్ష్య సాధనలో సంపూర్ణ సమర్పిత భావం, మనలోని సుగుణాలను వికశించుకోవడం అనే ఈ మూడు అంశాలను సాధించే దిశలో మనం నూతన సంవత్సరాన్ని జరుగుపుకోవాలని అపేక్షిస్తూ మరోసారి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మోహన్ జి భాగవత్ సందేశాన్ని క్రింద వినండి :
Click Here to Download |
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వయం సేవకులనుద్దేశించి తన సందేశాన్నిwww.rss.org ఇచ్చారు, ఆ సందేశాన్ని రాష్ట్ర చేతన తెలుగులో అందిచడం జరుగుతున్నది.
పూజ్య సర్ సంఘ్ చాలక్ మోహన్ జి భాగవత్ ఉగాది సందేశం (తెలుగులో)
Reviewed by JAGARANA
on
4:08 PM
Rating:
nice
ReplyDelete