మక్కా మస్జిద్ పెళ్లుల నిందితుడు అసీమానంద్ దర్యాప్తు లో RSS నాయకుల పేర్లు ప్రస్తావించలేదు : NIA స్పస్టికరణ
కొత్త డిల్లి , 06/02/2013 : 2006 మరియు 2008 లో సంజౌత ఎక్ష్ప్రెస్ , హైదరాబాద్ లోని మక్కా మస్జిద్ , మరియు అజ్మీర్ దర్గా లలో జరిగిన బాంబు దాడుల నిందితుడు స్వామి అసీమానంద జాతీయ దర్యాప్తు బృందం యొక్క పరిశోదనలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జేష్ట్య నాయకులు ప్రస్తుత సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భగవత్ అనుమతితోనే ఈ పని చేసానని చెప్పినట్లు " కన్వేర్ " అనే పేరుతొ అసీమానంద్ ఇంటర్వ్యూ ను కొన్ని పత్రికలూ కథనాలుగా ప్రచురించాయి.
కాని జాతీయ దర్యాప్తు బృందం ఈ విషయాన్ని నిర్థారించలేదు సరికదా అసీమననంద్ తమ పరిశోదన లో ఏ ఒక్క రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నాయకుని పేర్లను ప్రస్తావించలేదని స్పష్టం చేసింది .
మాన్య శ్రీ మోహన్ జి భగవత్ కి వ్యతిరేకంగా ప్రచురితమైన కథనాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తప్పుల తడకగా అభివర్ణిస్తూ ఖండిచింది
ఈ విషయంలో స్వామి అసీమానంద్ తరపున వాదిస్తున్న న్యాయవాది JS రాణా గారు స్పందిస్తూ ' స్వామి అసీమానంద్ అలాంటి ప్రకటన ఏమి చేయలేదు తప్పుడు కథనం ప్రచురించిన పత్రిక పై న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరతాం' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసారు , దాని ప్రతిని ఇక్కడ క్లిక్ చేయడం పొందవచ్చు .
మక్కా మస్జిద్ పెళ్లుల నిందితుడు అసీమానంద్ దర్యాప్తు లో RSS నాయకుల పేర్లు ప్రస్తావించలేదు : NIA స్పస్టికరణ
Reviewed by JAGARANA
on
6:27 PM
Rating:
No comments: