మెట్పల్లి: 'స్వామీ వివేకుని దృష్టి - డాక్టర్ జి సృష్టి ' వివేకా యువ సమ్మేళనం లో శ్రీ చక్రాల రామాంజనేయులు
మెట్పల్లి 15/12/2013 : స్వామి వివేకానంద శార్ద శతి జయంతి ఉత్సవాలలో భాగంగా కరినగరము జిల్లా మెట్పల్లి పట్టణము లో జరిగిన " వివేకా యువ సమ్మేళనం " కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన కరినగరము విభాగ్ ప్రచారక్ శ్రీ చక్రాల రామాంజనేయులు గారు యువతకు మార్గదర్శం చేస్తూ ' స్వామీ వివేకానందుడు ధన్యజీవి భారతమాత తన విశ్వ గురుత్వాన్ని మళ్ళి పొందాలని , ఆకలి అన్న అన్నార్తులకు అన్నపూర్ణ కావాలని దేశ మాత పరవ వైభవ సిద్ధిని కాంచిన కాలజ్ఞాని , గత వైభవ కీర్తినే కాదు ఇప్పుడున్న సమాజానికి కావాల్సిన మౌలిక సూత్రాలను , హిందూ ధర్మంలోకి వచ్చిన రుగ్మతలకు మంచి ఔషదాలను సూచించిన ధన్వంతరి , దేశానికి చెందిన అన్ని సమశ్యలకు ఒక వంద మంది ఇనుప కండరాలు , ఉక్కు నరాలు , వజ్రతుల్య సంకల్పం గల యువకులు చాలని ప్రకటించిన దీరోద్దాతుడు , స్వామిజి 150 వ జయంతి ఉత్సవాలలో పాల్గొనడం మన పూర్వ జన్మ సుకృతం , ఆ స్వామి వివేకుని సూత్రాన్ని కార్యరూపం దాల్చిన అభినవ వివేకుడు మన డాక్టర్ కేశవ్ రావ్ బలిరాం పంత్ హెడ్గెవార్ తన అసామాన్య సంఘటిన కళతో దేశానికి స్వామీజీ సూచించిన ఔషదాన్ని అందించిన వైద్యుడు డాక్టర్ జి వారిద్దరి స్పూర్తితో మన యువతరం దేశం కోసం పనిచేయాలి , భారత్ ను సూపర్ పవర్ చేయాలి , ఆ దిశలో మీరందరూ నడుస్తారని ఆశిస్తున్నాను" అని చేసిన ప్రసంగం యువత హృదయాంతరాలలో దేశ భక్తిని రగిలించిది .
ఈ కార్యక్రమంలో దాదపు 300 మంది డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు .
మెట్పల్లి: 'స్వామీ వివేకుని దృష్టి - డాక్టర్ జి సృష్టి ' వివేకా యువ సమ్మేళనం లో శ్రీ చక్రాల రామాంజనేయులు
Reviewed by JAGARANA
on
4:00 PM
Rating:
No comments: