కేరళ : మళ్ళి పడగ విప్పిన ఎర్ర భీభత్సం - కాలికట్ లో హిందూ ఐక్య వేది సభలో బాంబు దాడి శాఖా ముఖ్య శిక్షక్ మృతి
కాలికట్ : కేరళ రాష్ట్రం లోని కాలికట్ మరో కమ్యునిస్ట్ భీభత్స దాడికి వేదికైంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన స్థానిక శాఖా ముఖ్య శిక్షక్ శ్రీ అనూప్ (29) స్థానిక మెడికల్ కళాశాల లో చికిత్స పొందుతూ 20/12/2013 నాడు మృతి చెందాడు. అనూప్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకైన కార్యకర్త స్థానిక శాఖలో ముఖ్య శిక్షక్ గా బాద్యతలు నిర్వహిస్తున్నాడు, స్థానిక CPI(M) నాయకుని అధ్వర్యంలో జరుగున్న అక్రమ క్వారీ (మైనింగ్) కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలలో క్రియాశీయ పాత్రను పోషిస్తున్నాడు.
తేది 18/12/2013 నాడు " హిందూ ఐక్య వేది " అధ్వర్యంలో నిర్వహించబడుతున్న సభ పై CPI(M) ముష్కర మూకలు స్థానికంగా తయారు చేయబడిన బాంబుతో దాడి చేసారు, ఈ దాడిలో అనూప్ తీవ్రంగా గాయపడి తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందారు .
కేరళ ఎర్ర భీభత్స కాండ కు ప్రసిద్ది చెందుతూనే ఉంది గత కొంత కాలంగా వందల మంది సంఘ్ పరివార్ కార్యకర్తలు హత్య చేయబడ్డారు వేల మంది సాధారణ పౌరులు అమానవీయ దాడులలో వికలాంగులయ్యారు , గత వారం వినోద్ అనే సంఘ పరివార్ దారుణ హత్య ఘటనకు మరవక ముందే మరో సంఘటన జరగటం కేరళలో కమ్యునిస్ట్ భీభత్స కాండ ఏ స్థాయిలో ఉందొ ప్రస్పుటమౌతుంది.
Source: haindavakeralam.com samvada.org
కేరళ : మళ్ళి పడగ విప్పిన ఎర్ర భీభత్సం - కాలికట్ లో హిందూ ఐక్య వేది సభలో బాంబు దాడి శాఖా ముఖ్య శిక్షక్ మృతి
Reviewed by JAGARANA
on
12:58 PM
Rating:

Post Comment
No comments: