రాయికల్ లో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ
మెట్ పల్లి , 12/01/2013 , నాగరాజు గోల్కొండ ( ప్రతినిది - రాష్ట్ర చేతన )
![]() |
స్వామిజి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం |
- కార్యక్రమం నిర్వాహకులు మరియు విగ్రహ దాతలు ప్రతిష్టాపాకులు : మున్నూరు కాపు పటేల్ యువజన సంఘం : ఒజ్జేల నర్సారెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీ నీలి తిరుపతి , కార్యదర్శి : పడాల తిరుపతి మరియు మున్నురు కాపు పెద్ద సంఘం : అధ్యక్షులు శ్రీ ఒజ్జేల భూమారెడ్డి ప్రధాన కార్యదర్శి : తోట భూమయ్య .
- కార్యక్రమం జరిగిన తేది : 12.01.2013 వివేకుని జయంతి రోజున
- ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా స్థానిక SI శ్రీ జి.కోటేశ్వర్ గారు మరియు స్థానిక మెడికల్ అధికారి శ్రీ టి . రాజరెడ్డి గార్లు అలాగే ప్రధాన వక్త గా జగిత్యాల డివిజన్ వివేకానంద సమితి యువజన సంచాలకులు శ్రీ సాయి మధుకర్ గారు పాల్గొన్నారు .
- అలాగే రాయికల్ గ్రామం లోని సంఘమిత్ర యువజన సంఘం, వివేకానంద యూత్ , EVERGREEN యూత్ , RSS కార్యకర్తలు వీరితో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల , ప్రణుతి జూనియర్ కళాశాల , జ్ఞానోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు అంతా కలిసి సుమారు 500 పైన యువజనులు పాల్గొన్నారు .
- శ్రీ సాయి మధుకర్ గారు మాట్లాడుతూ
- యువకులు వివేకుని స్ఫూర్తి తో విగ్రహ ప్రతిస్థాపన చేయడం ఆనంద దాయకం అన్నారు .
- దేశ భవిష్యత్తు వివేకుడు కలలు గన్న భారతం మన యువకుల చేతుల్లోనే ఉంది , కావున సమాజ నిర్మాణ కార్యక్రమం లో యువత పాత్ర అధికంగా ఉండాలని అన్నారు .
- భవిష్యత్తు లో దేశం మరిన్ని సవాళ్లు ఎదుర్కొనే సూచనలు ఉన్నదున యువ జాగరణ జరగాల్సి ఉందన్నారు .
- పాలకులు పాలితులు దేశ యోగ క్షేమమే ప్రథమమని భావించాలని అన్నారు .
- హిందూ దర్మం ప్రపంచానికి దారి చూపే వెలుగు దివ్వె అని దానినే స్వామీజీ ప్రపంచ వ్యాప్తంగా చెప్పారని తెలిపారు .
- భవిష్యత్తు లో మనమంతా దేశ ధర్మ కార్యం లో నిమగ్నం అవుదామని వారి తో ప్రతిజ్ఞ చేయించారు .
- విద్యార్థులు తమ చదువు తో పాటు దేశం పట్ల అవగాహన కలిగి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని తెలిపారు .
- విగ్రహాన్ని స్థానిక SI కోటేశ్వర్ గారు గ్రామ పెద్దలు ఆవిష్కరించారు .
- ఈ విగ్రహం తో పాటు మరి రెండు విగ్రహాలు తెలంగాణ తల్లి , నేతాజీ లను ఆవిష్కరించారు .
- జాతీయ గీతం తో కార్యక్రమం ముగిసింది
రాయికల్ లో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ
Reviewed by JAGARANA
on
11:45 AM
Rating:

Post Comment
No comments: