హిందూ ఉత్సవాల పట్ల వివక్షను సహించేది లేదు - భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
ఈ నెల 13 వ తేదిన NTR స్టేడియంలో జరిగే హిందూ చైతన్య సభకు వేల సంఖ్యలో గణేష్ మండపాల నిర్వాకులు తరలి వచ్చి సంఘటిత హిందూ శక్తిని చాటాలి, దైవ భక్తీ మాధ్యమంగా దేశ సమగ్రత ను సాదించే క్రమంలో జరిగే ఈ సభలో పరమపూజ్య సాధు సంతుల మార్గదర్శనం ఉంటుంది - శ్రీ భగవంత రావ్ , ప్రధాన కార్యదర్శి - భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
భహతి భవన్, భాగ్యనగర్, 02/09/2015 : ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు కలిగిన సాముహిక గణేష్ ఉత్సవాలు జరిగే ముంబై, పూణే లను మించి భాగ్యనగర్ లో ఉత్సవాలు జరుతున్నాయి, సాముహిక గణేష్ ఉత్సవాల కాలంలో మన భాగ్యనగర్ అంతా అద్భుత ఆధ్యాత్మిక శోభను చేకుర్చుకుంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ భగవంత రావ్ గారు తెలిపారు.
ఈ సందర్భంలో ఉత్సవ సమితి కార్యాలయం భహతి భవన్ లో ఉత్సవ సమితి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు, ఈ మీడియా సమావేశంలో పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకుల పట్ల తమ వైఖరిని మార్చుకుని, అనవసర వేదింపులు వెంటనే ఆపాలని సూచించారు, ఈ గణేష్ ఉత్సవాల మాధ్యమంగా నగర ఖ్యాతి ప్రపంచ నలుమూలలా వ్యాపిస్తుందని తెలిపారు.
ప్రభుత్వానికి ఉత్సవ సమితి డిమాండ్లు :
- మండల నిర్వాహకుల పై పోలిసుల వేదింపులు ఆపాలి.
- మండపాలకు ప్రభుత్వమే ఉచిత కరెంటును అందించాలి.
- హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రాలపైన, హిందూ విశ్వాసాల పైన దాడులు ఆపాలి.
- దేవాదాయ నిధులను హిందూ ఉత్సవాలకే వినియోగించాలి.
- గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వమే పూర్తీ ఏర్పాట్లు చేయాలి.
హిందూ ఉత్సవాల పట్ల వివక్షను సహించేది లేదు - భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
Reviewed by JAGARANA
on
6:20 PM
Rating:

Post Comment
No comments: